Pages

Friday, April 5, 2013

నేటి నుంచి ప్రతి రెండవ శనివారం.....నెల్లూరులోనే తిరుపల తిరుపతి స్వామివారి ప్రసాదం

నెల్లూరు; నెల్లూరులో నేటి  నుంచి ప్రతి రెండవ శనివారం తిరుపల తిరుపతి దేవస్ధానం నుంచి శ్రీవారి ప్రసాదం విక్రయించబడుతుందని టిటిడి మేనేజర్‌ యల్‌ రాంగోపాల్‌ తెలిపారు. శుక్రవారం స్ధానిక టిటిడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వామివారి ప్రసాదం టిటిడి కళ్యాణ మండపంలో మాత్రమే దొరుకుతుందని పేర్కొన్నారు. అలాగే ఏప్రిల్‌ నేలలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని వివరించారు. ఈసందర్భంగా పలు భజన, ఉపన్యాస కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రస్తుతం టిటిడి చరిత్రలో తిరుమల వాసుని కళ్యాణ మహోత్సవాలు, స్వామికి పలు విశే ష పూజలు గావించేది నెల్లూరులోనే అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే శ్రీవారి భక్తుల కోసం స్వామి వారి ప్రసాదాన్ని ఈవిధంగా అందజేయనున్నామని పేర్కొన్నారు.

No comments:

Post a Comment