online marketing

Thursday, December 31, 2009

హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్

http://www.123greetings.com/events/new_year/new_year_wishes/newyear87.html

Wednesday, December 30, 2009

ప్రతిపాదనలకే పరిమితమవుతున్న పథకాలు


నెల్లూరు, మేజర్‌న్యూస్‌: జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం బుధవారం స్థానిక జడ్పీ సమావేశమందిరంలో జరిగింది. అధికారుల ఊకదంపుడు ఉపన్యాసాలకు అడ్డుతగులుతూ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యుల ప్రశ్నోత్తరాలతో సాగిన సమావేశంలో విద్య, వైద్య సంబంధిత అంశాలపై కాస్త వాడివేడిగా చర్చ కొనసాగింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కేవలం ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయని తప్ప ఆచరణకు నోచుకోవడం లేదని పలు సందర్భాలలో ప్రజాప్రతినిధులు అధికారులపై విరుచుకుపడ్డారు. మఖ్యంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నా ఆ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు విమర్శించారు. హాస్టళ్లలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల గురించి వాకబు చేసినప్పుడల్లా ‘ప్రతిపాదనలు పంపాము. మంజూరు కాగానే పనులు చేపడతాం’ అనే సమాధానం అధికారుల నుంచి వస్తోందనీ, ప్రతి సమావేశంలోనూ అధికారులు ఇదే విధమైన సమాధానం వస్తోందని గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌రావు ఒక దశలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా వెంకటగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే వైద్యురాలు తిరుపతిలో నివాసం ఉంటూ వారానికి ఒక్క రోజు మాత్రమే వైద్యశాలకు వస్తోందని స్థానిక శాసనసభ్యుడు కురుగొండ్ల రామకృష్ణ అధికారులకు ఫిర్యాదు చేయగా, జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, వైద్య సిబ్బంది డిప్యుటేషన్‌ను రద్దు చేయాలని కలెక్టర్‌ను కోరతామన్నారు. వైద్య సిబ్బంది పనితీరుపై ఫిర్యాదులు అందుకునేందుకు త్వరలో జిల్లాస్థాయిలో తమ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి టివి రమణారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో చికున్‌గన్యా, మలేరియా, సై్వన్‌ప్లూ, డెంగీ తదితర వ్యాధులు తీవ్రమవుతున్నాయనీ, ఇందుకు ప్రతిగా అధికారులు తీసుకుంటున్న చర్యలు మాత్రం ఆశాజనకంగా లేవని జడ్పీటీసీ సభ్యులు ఆరోపించారు.
హాస్టల్‌ విద్యార్థులకు అసౌకర్యం కలిగించొద్దు - కాకాణిజిల్లాలోని వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని జడ్పీ ఛైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శిథిలావస్థకు చేరుకున్న వసతి గృహ భవనాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలు జరగకుండా నివారించాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్న భోజన పథక బిల్లులను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో రూ.29 కోట్లు మంజూరు చేయడం జరిగిందనీ, ఆ నిధులను నియోజకవర్గాల వారీగా కేటాయించి పనులు అమలు చేసేందుకు సంబంధిత ఎమ్మెల్యేల ద్వారా చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు తరచూ సమావేశాలు నిర్వహించుకుంటూ ఆసుపత్రులలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తిరుపతి ఎంపి చింతా మోహన్‌, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, ఉదయగిరి ఎమ్మెల్యేలు పరసా రత్నం, బల్లి దుర్గాప్రసాద్‌రావు, కురుగొండ్ల రామకృష్ణ, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బి.రాఘవేంద్రరెడ్డి, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ టివిఎస్‌ రాజా, సాంఘిక సంక్షేమ శాఖ డిడి సీతామహలక్ష్మి, ఐటిడిఏ పిఓ రమేష్‌కుమార్‌, డిఇఓ డి.ఆంజనేయులు, డిఎంఓ డాక్టర్‌ కనకాద్రి తదితరులు పాల్గొన్నారు.

కడప ఎర్రచందనం.... ఏఎస్‌పేట నుంచి చెనై్నకు....

అనుమసముద్రంపేట, (మేజర్‌న్యూస్‌): ఏఎస్‌పేటలో పోలీసులు స్వాధీన పరచుకున్న ఎర్రచందనం దుంగలు కడప జిల్లాకు చెందినట్లుగా మంగళవారం పోలీసులు నిర్థారించారు. గత ఆరు నెలలుగా ఏఎస్‌పేటలో ఎర్రచందనం వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. అప్పుడప్పుడు కడప జిల్లా పోరుమావిళ్ళ, బ్రహ్మంగారిమఠం పరిసర ప్రాంతాల దుంగలను కొందరు వ్యక్తులు ఏఎస్‌పేటలో ఓ చోట భద్రపరిచేవారు. ఇక్కడ నుంచి స్థానికుల సహాయంతో చెనై్నకు తరలించి వ్యాపారం నిర్వహించేవారు. అయితే మొత్తానికి పోలీసులకు సమాచారం అందడంతో ఏఎస్‌పేట ఎసై్స శ్రీనివాసరావు, ఆత్మకూరు సిఐ అక్కేశ్వరరావులు దాడి చేసి దుంగలను స్వాధీనపరచుకున్నారు. నింధితులు పది మందిగా తొలుత గుర్తించిన పోలీసులు సోమవారం అక్కడికక్కడే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో మహబూబ్‌బాషా, సోమవరపు సూర్యనారాయణ, షేక్‌ షబ్బీర్‌లు వారిలో ఉన్నారు. అయితే మంగళవారం వారిలో ఓ వ్యక్తిని తొలగించి మరో వ్యక్తిని నిందితునిగా నమోదు చేసి సాయంత్రం కోర్టుకు హాజరుపరిచారు. ఈ విషయమై స్థానికంగా పలు అనుమానాలు చోటుచేసుకున్నాయి. పది మంది నిందితులుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం వారిలో ఒకరిని వదిలేసి మరో వ్యక్తిని నిందితునిగా కోర్టుకు హాజరుపరచడంతో ఈ సంఘటన వెనుక కొందరి నేతల హస్తం ఉందని ఆరోపణలు వినవస్తున్నాయి. గత ఆరు నెలలుగా కడప జిల్లా నుంచి చాకచక్యంగా దుంగలను దర్గా పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ సంచరించే యాత్రికులను కళ్ళుగప్పి గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతుండేది. దీనికి స్థానికంగా కొందరి హస్తం ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అయితే అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి ఆ కేసును అటవీ శాఖకు అప్పగించేసేశారు పోలీసులు. మిగతా ఏడుగురి పరిస్థితి ఏమిటో ఆ పోలీసులకే తెలియాల్సి ఉంది.
నిన్న స్టేషన్‌లో... నేడు అంగట్లో....: ఎర్రచందనం కేసులో నిందితునిగా అదుపులోకి తీసుకున్న షేక్‌ షబ్బీర్‌ సోమవారం స్టేషన్‌లో కనిపించాడు. పోలీసులు ఈయన నిందితుడని పత్రికలకూ సమాచారమిచ్చారు. మంగళవారం సాయంత్రం ఆ వ్యక్తి దర్గా వద్ద తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ కనిపించాడు. ఈ విషయమై స్థానికంగా చర్చ మొదలైంది. పోలీసులు నాయకుల సిఫార్సు మేరకే షబ్బీర్‌ను తొలగించారని గుసగుసలాడుతున్నారు.
అతను అమాయకుడు: ఎసై్సఏఎస్‌పేటలో సోమవారం పోలీసులు ఎర్రచందనం కేసులో అదుపులోకి తీసుకున్న షేక్‌ షబ్బీర్‌ అమాయకుడని, ఈ సంఘటనకు, అతనికి ఎలాంటి సంబంధం లేదని ఎసై్స శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం మేజర్‌న్యూస్‌కు వివరించారు. అయితే నిన్న షబ్బీర్‌ను నిందితునిగా గుర్తించారు కదా అని ప్రశ్నిస్తే అలాంటిదేమి లేదన్నారు. షబ్బీర్‌ స్థానంలో మస్తాన్‌సాహెబ్‌ను నిందితునిగా అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరిచామని ఆయన వివరించారు.

కార్డుల సర్వేపై అనుమానాలొద్దు


సూళ్ళూరుపేట, మేజర్‌న్యూస్‌ ః కార్డుల సర్వేపై అనుమానాలొద్దని జిల్లా పౌరసరఫరాల అధికారి జ్వాలాప్రకాష్‌ తెలిపారు. సూళ్ళూరుపేటలో జరుగుతున్న కార్డుల సర్వేపై మంగళవారం ఆరాతీసారు. సూళ్ళూరుపేట పట్టణంతో పాటు కొన్నుంబట్టు, మన్నారుపోలూరు తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. కార్డుల సర్వేలలో బోగస్‌ కార్డులను మాత్రమే తొలగిస్తామని, అర్హులకార్డులు ఎట్టి పరిస్థితులలోను తొలగించమని వివరణ ఇచ్చారు. జ్వాలాప్రకాష్‌తో పాటు తహసిల్‌దార్‌ జాలిరెడ్డి, డిప్యూటీ తహసిల్‌దార్‌ జయచంద్ర, విఆర్‌ఓలు రాజగోపాల్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

తె.రా.స.వి దౌర్జన్యపూరిత ఉద్యమాలు


నెల్లూరు(కల్చరల్‌/ఫత్తేఖాన్‌పేట) మేజర్‌న్యూస్‌:విద్యార్థులను అడ్డం పెట్టుకుని ప్రత్యేక తెలంగాణా కోసం కెసిఆర్‌ చేస్తున్న ఉద్యమాలు దౌర్జన్యపూరితమని రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర వాదుల ప్రతినిధిగా మంగళవారం నగరంలోని బారాషాహిద్‌ దర్గాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల హృదయాల్లోంచి ఉద్భవించిందన్నారు. ప్రత్యేక తెలంగాణా వాదులు ఉద్యమాల పేరుతో విద్యార్థులను ప్రలోభపెడుతూ, రాజకీయ నాయకులను బెదిరింపులకు గురి చేస్తూ దౌర్జన్యపూరితంగా ఉద్యమించడం ప్రజాస్వామ్యానికి పూర్తి వ్యతిరేకమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి జాయింట్‌ యాక్షన్‌ కమిటీలుగాని, రౌండ్‌టేబుల్‌ కాన్ఫరెన్స్‌లుగాని లేకపోవడానికి కారణం ప్రజల హృదయాల్లోనుంచి ఉద్యమం ఆవిర్భవించడమేనన్నారు. అయితే ఏర్పాటుదారులు ఎల్‌టిడి తరహాలో విద్యార్థులను తయారుచేస్తూ ఆంధ్ర కాంట్రాక్టర్లను బెదిరిస్తూ ఉద్యమాలు చేపట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు. బిడ్డల భవిష్యత్తును కాలరాస్తూ ఆంధ్ర ప్రాంత వాసుల విద్యాసంస్థలపై దాడులు, యాజమాన్యానికి బెదిరింపులను ఆయన తీవ్రంగా నిరసించారు. కుల, మత, జాతి, వర్గాలకు అతీతంగా ఉండే సినీరంగంపై కూడా వేర్పాటువాదులు దాడులు చే యడం సిగ్గుచేటన్నారు. కళాకారులను కళాకారులుగా గుర్తించకుండా వేర్పాటువాద ధోరణితో దుందుడుకు చర్యలకు పాల్పడడంలోనే వారి బుద్ధి అర్ధమవుతుందన్నారు. కెసిఆర్‌ మెడలు వంచైనా సమైక్యాంధ్రను సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. అందుకోసం తమ పదవులను, ప్రాణాలను, ప్రజల కోసం వదులుకోడానికి సిద్ధమన్నారు. ప్రజలకు మంచి చేసే అవకాశం జీవితంలో ఒకసారే వస్తుందని, ఆ అవకాశాన్ని తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాలన్నారు.సుదీర్ఘ చరిత్రగల కాంగ్రెస్‌ పార్టీలో కాంగ్రెస్‌ నాయకులుగా ప్రజలకు తాము చేసిన సేవలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కాంగ్రెస్‌ నాయకులకు ఉందన్నారు. వేర్పాటువాద నాయకులతో చేరి రాజకీయ నిరుద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తే ప్రజలు క్షమించరని కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు ఆయన హితవు పలికారు. ఆంధ్రప్రాంత ఎమ్మెల్యేలపై, వారి ఆస్తులపై దాడులు జరపడం ఎక్కువ కాలం చెల్లదన్నారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన వారి ఆస్తుల జోలికి సమైక్యవాదులు వెళ్లడంలేదన్న విషయాన్ని నొక్కి వక్కాణించారు. ఉదాహరణకు ఎంపి నామా నాగేశ్వరరావుకు చెందిన పవర్‌ప్రాజెక్టు గూడూరులో ఉన్నప్పటికీ సమైక్యవాదులంగా దాని జోలికే పోవడం లేదని అన్నారు. పారిశ్రామికవేత్తలు అంతర్జాతీయ స్థాయిలో తమకు ఇష్టమొచ్చిన ప్రాంతాల్లో తమ వ్యాపార కలాపాలను నిర్వహిస్తున్న ఈ రోజుల్లో తెలంగాణా వేర్పాటువాదుల చర్యలను ఆయన దుయ్యబట్టారు.ప్రజలు, నాయకులు వాస్తవాలు తెలుసుకుని సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాలన్నారు. రాజకీయ నిరుద్యోగులకు అండగా ఉండి ప్రజలకు కష్టాలు కలిగించే చర్యలకు పూనుకోవద్దని తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌పార్టీ నాయకులకు ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, మేయర్‌ నందిమండలం భానుశ్రీ, కార్పొరేటర్లు సందానీబాష, మునాఫ్‌, పిండి సురేష్‌, జయకుమార్‌ రెడ్డి, సాయిలలిత, కమిషనర్‌ టిఎస్‌ఆర్‌.ఆంజనేయులు, కాంగ్రెస్‌ నాయకులు, వక్ఫ్‌బోర్డు సభ్యులు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సమాజంలో పత్రికలది కీలక పాత్ర -- ఎమ్మెల్యే, కలెక్టర్‌

నెల్లూరు, మేజర్‌న్యూస్‌:ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతోపాటు ప్రభుత్వానికి -ప్రజలకు వారధిగా నిలిచే పత్రికలది సమాజంలో ఎంతో కీలకపాత్ర అని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, జిల్లా కలెక్టర్‌ కె.రాంగోపాల్‌లు పేర్కొన్నారు. ‘సూర్య’ దినపత్రిక ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను వారు మంగళవారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ విలేకర్లు నిజాన్ని నిర్భయంగా వార్తల రూపంలో అందజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో, నీతి, నిజాయితీలతో వ్యవహరిస్తే సమాజంలో అవినీతిని పారదోలవచ్చన్నారు.సూర్య దినపత్రిక ఇలాంటి వార్షికోత్సవాలను మరెన్నో జరుపుకుని ప్రత్యేక సంచికలను ఆవిష్కరించుకోవాలని తాను మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. అదేవిధంగా సూర్య దినపత్రిక బ్యూరో ఇన్‌చార్జ్‌ మురళీధర్‌లాల్‌, ఎడిషన్‌ ఇన్‌చార్జ్‌ రమేష్‌బాబు తదితర అధికారులు, సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్‌ కె.రాంగోపాల్‌ మాట్లాడుతూ పత్రికల్లో వచ్చే వార్తల వల్ల ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. పత్రికలకు విశ్వసనీయత ఎంతో అవసరమని, కొన్ని సందర్భాల్లో విశ్వసనీయత కోల్పోయే విధంగా వార్తలు ఉంటుండడం బాధాకరమన్నారు. ప్రస్తుతమున్న పోటీ సందర్భంగా సంచలనాల కోసం వస్తున్న కొన్ని వార్తలు సమాజానికి మేలు చేసేకన్నా కీడు జరుగుతుందనే విషయాన్ని పాత్రికేయులంతా గుర్తించాలన్నారు. విలేకరులు సామాజికంగా, వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్నసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కష్టపడి పనిచేస్తూ నిజాయితీగా వ్యవహరించే పాత్రికేయులకు ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ప్రజాస్వామ్య మనుగడ పత్రికా స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుందని, సమాజాభివృద్ధికి పాత్రికేయులు తమ వంతు కృషి చేయాలని సూచించారు. ‘సూర్య’ దిన పత్రిక ఇలాంటి వార్షికోత్సవాలను మరెన్నో జరుపుకోవాలని, సమాజాన్ని అన్నివిధాలా ముందుకు నడిపించేందుకు తనవంతు సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ భానుశ్రీ, కమిషనర్‌ టిఎస్‌ఆర్‌.ఆంజనేయులు, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుబ్బరాజు, డిఇ సంజయ్‌, సూర్య దినపత్రిక బ్యూరో ఇన్‌చార్జ్‌ ఎస్‌.మురళీధర్‌లాల్‌, ఎడిషన్‌ ఇన్‌చార్జ్‌ రమేష్‌బాబు, అసిస్టెంట్‌ సర్క్యులేషన్‌ మేనేజర్‌ టి.కృష్ణారావు, సర్క్యులేషన్‌ ఆఫీసర్‌ జాన్‌ అహ్మద్‌, అడ్వర్‌టైజ్‌మెంట్‌ మేనేజర్‌ కె.కొండయ్య తదితర పాత్రికేయ సిబ్బంది పాల్గొన్నారు.

జబ్బునపడ్డ నెల్లూరు జిల్లా

నెల్లూరు, మేజర్‌న్యూస్‌:జిల్లాలో ఈ ఏడాది ప్రజారోగ్యం జబ్బున పడిందని చెప్పవచ్చు. మొదట్లో దీని ప్రభావం అంతగా లేకపోయినప్పటికీ చివరి నాలుగు నెలల్లో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది సై్వన్‌ఫ్లూ భూతం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురయ్యేలా చేసింది. ముఖ్యంగా సెప్టెంబర్‌ నెల నుంచి జిల్లాలో విషజ్వరాల తాకిడి ఎక్కువైంది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా జిల్లా విషజ్వరాలతో బాధ పడుతుంటే చాలదన్నట్టుగా వర్షాలు ఎక్కువ కావడంతో సమస్య మరింత తీవ్రమైంది. వర్షపునీరు, మురికినీరు కలసి దోమలకు నిలయాలుగా మారిపోయాయి. కుళాయిల్లో నుంచి కలుషితమైన నీరు రావడం, విపరీతంగా దోమలు ప్రజలపై తమ విశ్వరూపం చూపడంతో డెంగ్యూ జ్వరాలు ఎక్కువయ్యాయి. జిల్లాలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా 15 మంది మృతి చెందారు. అయితే వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం కేవలం మూడు మాత్రమే నమోదు కావడం గమనార్హం. ముఖ్యంగా ఈ వ్యాధికి అనేకమంది చిన్నారులు గురై ప్లేట్‌లెట్ల సంఖ్య తీవ్రంగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురై చెనై్న, తిరుపతి, హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు వంటి పట్టణాలకు పరుగులు తీయాల్సి వచ్చింది. సకాలంలో వైద్యసదుపాయం పొందగలిగినవారు మాత్రం వేలాది రూపాయలు ఖర్చు అయినప్పటికీ ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుకోగలిగారు. అయితే కొందరిని దురదృష్టం వెంటాడడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.ముఖ్యంగా ఖరీదైన వైద్యసదుపాయం పొందే స్థోమత లేని పేదలు నగరంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల, డాక్టర్‌ రామచం్రద్రారెడ్డి ప్రజావైద్యశాల, నారాయణ, జయభారత్‌ తదితర ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వచ్చింది. జిల్లా కేంద్ర ప్రభుత్వ వైద్యశాలలో ప్లేట్‌లెట్లు తయారు చేసే పరికరాలు సిద్ధంగా ఉంచినప్పటికీ అందుకు సంబంధించిన కొన్ని అనుమతులు, ఒకటి రెండు ముఖ్యమైన పరికరాల సరఫరా లేక ఇప్పటికీ వృధాగానే పడివున్నాయి. ఒక్క రెడ్‌క్రాస్‌ సంస్థ మాత్రమే నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు విరివిగా ప్లేట్‌లెట్లను అందజేయగలిగింది. ఇక చికున్‌గున్యా జ్వరాల విషయం చెప్పనవసరం లేదు. ప్రతి వంద మందిలో 70 మంది వరకు ఈ వ్యాధి బారిన పడ్డారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఒక ఇంట్లో ఒ రు ఈ వ్యాధిన పడితే తప్పకుండా అదే ఇంట్లో మరో ఇద్దరు ముగ్గురు పరిస్థితి కూడా అదే కావడం మామూలైపోయింది. చికున్‌గున్యా బారినపడి వారం రోజుల్లోగా కోలుకున్నప్పటికీ మరో నెల రోజులపాటు వారు శరీరంలోని ప్రతి అవయవం నొప్పి పుట్టేలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పడంలేదు. అయితే జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ దృష్టిలో అధికారికంగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం హాస్యాస్పదం.అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఏడాది నగరంలోని బొల్లినేని కంటి వైద్యశాలలో శస్తచ్రికిత్సలు వికటించి 23 మంది శాశ్వతంగా కంటిచూపు కోల్పోయిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఇంతపెద్ద సంఖ్యలో ప్రజలు కంటిచూపును కోల్పోవడం ఇదే ప్రధమం. ఈ ఏడాది అక్టోబర్‌ 19, 20వ తేదీల్లో నగరంలోని బొల్లినేని కంటి వైద్యశాలలో 29 మంది ఉచితంగా, మరో ఏడుగురు ఫీజు చెల్లించి ఆపరేషన్లు చేయించుకున్నారు.అయితే ఇంతటి ఘోర వైఫల్యానికి శస్తచ్రికిత్సలకు ఉపయోగించిన ‘రింగర్‌ లాక్టేట్‌’ అనే ఐవి ఫ్లూయిడ్స్‌ కారణంగా వైరస్‌ సోకి ఆపరేషన్లు వికటించినట్లు సంబంధిత నిపుణులు నిగ్గు తేల్చారు. ఈ విషయంలో ప్రభుత్వం సైతం స్పందించి బాధితులు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేసింది. అయితే ఆసుపత్రి యాజమాన్యం నుంచి మరో రూ.1.50 లక్షలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అది మాత్రం కార్యరూపం దాల్చలేదు. అయితే చివరకు ఆసుపత్రి యాజమాన్యం వైఫల్యం లేదని తేలడంతో సంబంధిత రింగర్‌ లాక్టేట్‌ తయారీ సంస్థ నుంచి ఏమైనా నష్టపరిహారం అందుతుందేమోనని బాధితులు ‘చీకటి ప్రపంచంలో’ ఉంటూ ‘మనో నేత్రాల’తో ఎదురు చూస్తున్నారు. ఇక మెదడువాపు వ్యాధి విషయంలో జిల్లాలో రెండు కేసులు అధికారికంగా నమోదయ్యాయి. దీంతో ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణ, మెదక్‌, ఆదిలాబాద్‌, నెల్లూరు జిల్లాల్లో ఈ వ్యాధి నివారణకు సంబంధించిన వ్యాక్సిన్‌లను వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. జిల్లాలో తొలివిడతగా 4,43,635 మంది చిన్నారులకు ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వాలనేది లక్ష్యం కాగా 3,90,918 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చి ప్రభుత్వం 84 శాతం లక్ష్యాన్ని సాధించింది. ఇక రెండో విడతగా 4.30 లక్షల మంది చిన్నారులకు ఈ వ్యాక్సిన్‌లు ఇవ్వాల్సి వుంది. అయితే ప్రభుత్వం నుంచి చాలినన్ని సిరంజిలు సరఫరా కాకపోవడంతో ఈ కార్యక్రమం మరో నెల రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. జిల్లాలో పోలియోను పూర్తి స్థాయిలో నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. దీనిలో భాగంగా వచ్చేనెల 10వ తేదీ, ఫిబ్రవరి 7వ తేదీలలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా అధికార యంత్రాంగం తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాది జిల్లా తీవ్రస్థాయిలో జబ్బున పడిందని చెప్పకతప్పడంలేదు.

ప్రతిభచూపిన డిఎల్‌ఎన్‌ఆర్‌ విద్యార్ధులు

బుచ్చిరెడ్డిపాళెం, మేజర్‌న్యూస్‌ :బుచ్చి స్థానిక దొడ్ల లక్ష్మీనరసారెడ్డి ప్రభుత్వ పాఠశాల క్రీడా ప్రాంగణంలో సోమవారం జరిగిన మలవతు సుబ్బయ్య స్మారకక్రీడా పోటీలలో స్థానిక దొడ్ల లక్ష్మీనరసారెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు అద్భుత ప్రతిభ చూపారు. బుచ్చి ఎస్‌ఐ సుబ్బారావుచే అట్టహాసంగా ప్రారంభింపబడిన ఈ క్రీడాపోటీలలో పట్టణంలోని అన్ని కళాశాలల క్రీడాకారులు పాల్గొనగా 100, 200, 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌ జంప్‌, షాట్‌ పుట్‌ క్రీడాంశాలలో మొదటి, రెండవ స్థానాలు డిఎల్‌ఎన్‌ఆర్‌ పాఠశాల విద్యార్ధులు కైవశం చేసుకున్నారు. మిగిలిన పాఠశాల విద్యార్ధులు మూడవ స్థానాలకే పరిమితమయ్యారు. ఈ క్రీడాపోటీల అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ఈ కార్యక్రమంలో కొడవలూరు తహసీల్దార్‌, క్రీడాపోటీల నిర్వాహకులు అయిన మలవతు సుధాకర్‌, డిఎల్‌ఎన్‌ఆర్‌ ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి, వ్యాయామ ఉపాధ్యాయులు మధు, ఏసు దానమ్మ తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు నెట్‌లో పంపుతారు.

Monday, December 28, 2009

ఇక్కడ హోమియో వైద్యం ఉన్నా లేనట్లే

నాయుడుపేట, మేజర్‌న్యూస్‌: అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు ప్రభుత్వం వ్యయప్రయాసలకోర్చి హోమియో వైద్యం ప్రజలకు అందించాలన్న ఉద్ధేశంతో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో వైద్యశాలను ఏర్పాటు చేసిన ఇక్కడ వైద్యులు లేక పోవడంతో నిరుపయోగంగా మారింది. గత ఏడాది ఆసుపత్రికి బోర్డు అయితే తగిలించారు కానీ ఒక్కరోజుకూడా వైద్యం అందించిన పాపాన పోలేదు. ఇక్కడక్కి పోస్టింగ్‌చేసిన వైద్యురాలు బాధితలు స్వీకరించక పోవడంతో వైద్యశాల ఖాళీగా ఉంది వచ్చిన మందులు ఏమౌతున్నాయో తెలియని పరిస్థితి. ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా నామమాత్రంగా ఉండటంతో ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేసిన ప్రయోజనం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉన్నత అధికారులైన స్పందించి వైద్యశాలకు సిబ్బందిని నియమించి హోమియో వైద్యం ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది.

కొంత మోదం...కొంత ఖేదం

నెల్లూరు, మేజర్‌న్యూస్‌: ఈ ఏడాది జిల్లా రైతు ఆశించినంతగా వికసించలేకపోయాడని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉదాసీనత, మధ్య మధ్యలో ప్రకృతి ప్రకోపం కలగలిసి రైతుకు మిశ్రమ ఫలితాలను మాత్రమే మిగిల్చాయి. ప్రతి ఏడాది ఏదో రకంగా ప్రకృతి వైపరీత్యాలకు ఎంతో కొంత నష్టపోతున్న జిల్లా రైతు ఈ ఏడాదైనా ప్రకృతి కరుణిస్తుందని ఆశించాడు. అన్నదాతల ఆశలను ప్రకృతి ఈ ఏడాది పూర్తిగా వమ్ము చేయకపోయినా జూన్‌, జూలై, ఆగష్టు నెలల్లో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులు అన్నదాతను కలవరపెట్టాయి. గత ఏడాది ఖరీప్‌ సాగు ఈ ఏడాది మార్చి నాటికి పూర్తయి, జిల్లా వ్యాప్తంగా సుమారు 11.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. దిగుబడి బాగుందని అన్నదాత భావించే లోపే దళారుల పుణ్యమాని గిట్టుబాటు ధర లేక అన్నదాత రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తమ కష్టానికి తగిన గిట్టుబాటు ధరను కల్పించాలని కోరుతూ అన్నదాతలు జిల్లాలో మార్చి నెలలో ఆందోళన చేపట్టారు. మే నెలలో వ చ్చిన ఈదురు గాలులకు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో పంట తోటలు దెబ్బతిన్నాయి. మామిడి, బత్తాయి, నిమ్మ పంటలకు తీవ్ర నష్టం కలిగింది. గాలుల ప్రభావం వలన పండ్లన్నీ నేలరాలిపోవడంతో తలపై చేతులు పెట్టుకొని దిగాలుగా రైతులు ఉండిపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం తన నిస్సహాయతను మరోసారి చూపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో ఆక్వాసాగు మరింత తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది రబీలో డెల్టా కింద 2 లక్షలా 30వేల ఎకరాలకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు మార్చి నెలలో జరిగిన ఐఏబి సమావేశంలో నిర్ణయించారు. అధికారులు అనుకున్న విధంగానే ఈ ఆయకట్టు మొత్తానికి నీటిని అందించడంలో సఫలీకృతులైనారు. అయితే నాయుడుపేట, బోగోలు తదితర మండలాలతో పాటు మెట్ట ప్రాంత మండలాల్లో నీరు లేక వందలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. చివరకు పశువుల దాణాగా పొలాలను ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. విద్యుత్‌ కోత వలనే ఇటువంటి పరిస్థితి దాపురించిందనీ, తమకు నష్టపరిహారం అందచేయాలని రైతులు చేసిన విజ్ఙప్తిని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇక ఖరీప్‌ సాగుకు సమాయత్తమవుతున్న జిల్లా రైతుపై ప్రకృతి ప్రకోపాన్ని చూపించిన సంఘటన జూన్‌, జూలై, ఆగష్టు నెలల్లో చోటుచేసుకొంది. రైతుల నుంచి వస్తున్న ఆందోళనలతో జిల్లా ప్రజాప్రతినిధుల ఒత్తిడితో దిగొచ్చిన ప్రభుత్వం జిల్లాలోని రాపూరు, నెల్లూరురూరల్‌ మండలాల మినహా మిగతా మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. ఆ రెండు ప్రాంతాల రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో చివరకు ఆ రెండు మండలాలను కూడా కరవు జాబితాలో చేర్చారు. కరవు జాబితాలో అన్ని ప్రాంతాలను చేర్చడంతో తమ పనైపోయినట్లు ప్రభుత్వం భావించడం బాధాకరం. ఇంతవరకూ రైతులకు ఎటువంటి కరవు ప్రోత్సాహకాలు అందలేదు. రుణాలను రీషెడ్యూల్‌ చేస్తారని భావించిన అన్నదాతను ప్రభుత్వం కనికరించలేదు. మెట్టప్రాంతాల్లో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితుల వలన పాడిరైతు కూడా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పశుగ్రాస కొరతతో పశువులను అయిష్టంగా కబేళాలకు పాడిరైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. చీకటి వెంటే వెలుతురున్నట్లు, కరవు కోరల్లో చిక్కిన రైతన్నను ప్రభుత్వం మరచినా అదే ప్రకృతి తిరిగి ఆదుకుంది. సెప్టెంబర్‌ నెల నుంచి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాల పుణ్యమాని జిల్లాలోని అన్ని జలాశయాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో జిల్లాలో ఖరీప్‌ సాగుకు సుమారు నాలుగు లక్షలా 10వేల ఎకరాల్లో నీటిని విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు. తుపాన్‌ల నెలగా పేరుగాంచిన నవంబర్‌ నెలలో ఎటువంటి ప్రకృతి ఉపద్రవం చోటుచేసుకోకపోవడంతో అన్నదాత ఊపిరి పీల్చుకున్నాడు. మరో పక్షం రోజుల్లో ఖరీప్‌ కోతలు జిల్లాలో ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా దిగుబడి పెరిగే అవకాశాలున్నాయని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. అయితే జలయజ్ఙంలో భాగంగా చేపట్టిన బ్యారేజి నిర్మాణాలు, చెరువుల మరమ్మతులు, కాలువల ఆధునీకరణ తదితర బృహత్తర కార్యక్రమాలన్నీ తాబేలు నడక చందాన కొనసాగుతుండడం రైతులకు ప్రభుత్వం మీద ఉన్న నమ్మకాన్ని సడలించేలా చే స్తోంది.

మహానుభావులు స్థాపించిందే కాంగ్రెస్‌పార్టీ

వెంకటేశ్వరపురం (నెల్లూరు) మేజర్‌న్యూస్‌:ఎందరో మహానుభావులచే స్థాపించబడిందే కాంగ్రెస్‌పార్టీ అని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం అఖిలభారత కాంగ్రెస్‌ పార్టీ 125 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగువేశారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక ఇందిరాభవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎల్లసిరి మాట్లాడుతూ జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌బహదూర్‌ శాస్ర్తి, మౌలానా అజాద్‌, ఇందిరాగాంధీ లాంటి ఎందరో మహానుభావులు చేసిన కృషి వల్లే కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిందని అన్నారు. ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం మొత్తం తలకిందులైనపుడు అప్పటి ప్రధాని పివి.నరసింహరావు, అప్పటి కేంద్ర ఆర్థిక మంద్రి మన్మోహన్‌సింగ్‌లు ఆర్థిక సంస్కరణల వల్ల ఎటువంటి ఆర్థిక సంక్షోభం లేకుండా మనదేశాన్ని నిలబెట్టిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని అన్నారు.పదవుల కంటే పార్టీయే ముఖ్యమని ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా భావించి కాంగ్రెస్‌పార్టీని పునరుజ్జీవనం చేసిన మహానాయకురాలు సోనియా గాంధీ అని అన్నారు. ఆమె నాయకత్వాన కాంగ్రెస్‌ పార్టీ ఈ రోజు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని, ఇంత ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీలో తాము ఉన్నందుకు గర్వపడుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ వాదులందరూ గర్వపడుతూ ఆ మహానాయకుల అడుగుజాడల్లో నడచి ఈ దేశానికే మరింత సేవ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎం.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి కార్యదర్శి ఉడతా వెంకటరావు, బిసి సెల్‌ ఉపాధ్యక్షులు కె.రఘురాంముదిరాజ్‌, జిల్లా ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌ టి.బాలసుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

నష్టాలను అధిగమించండి

సంతపేట (నెల్లూరు) మేజర్‌న్యూస్‌:ఇటీవల రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల ప్రభావంతో ఆర్టీసి భారీస్థాయి నష్టాల్లో ఉందని, వాటిని అధిగమించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆర్టీసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌పి యాదవ్‌ ఆదేశించారు. నెల్లూరు ఆర్టీసి మెయిన్‌ బస్టాండును ఆదివారం ఆయన తనిఖీ చేశారు. అంతకు ముందు ఆర్టీసి 1 డిపో గ్యారేజిలో పనిచేస్తున్న మెకానిక్‌లను ఉద్దేశించి పని విధానం సక్రమంగా ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. అనంతరం టిక్కెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ను పరిశీలించి పలు సూచనలను చేశారు. అక్కడ నుంచి బయలుదేరి పడుగుపాడులో ఉన్న రీజనల్‌ వర్క్‌షాపును సందర్శించారు. ఆయనతోపాటు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎన్‌ఎస్‌సి. సాల్మన్‌రాజు, నెల్లూరు రీజనల్‌ మేనేజర్‌ పి.శేషగిరిరావు, ఛీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ఎంవి.ప్రభాకర్‌రెడ్డి, 1 డిపో మేనేజర్‌ ఈగా భాస్కర్‌రెడ్డి, 2 డిపో మేనేజర్‌ పి.శీనయ్య అధికారులు పాల్గొన్నారు.

వైభవంగా వైకుంఠ ద్వారదర్శనం

నెల్లూరు (కల్చరల్‌) మేజర్‌న్యూస్‌:వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం తెల్లవారుజాము నుంచి వైష్టవాలయాల్లో భక్తులు వైకుంఠద్వార దర్శనం చేసుకోడానికి బారులు తీరారు. నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ఇరువురు ఎమ్మెల్యేలతోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లను చేశారు. భక్తులు స్నానాలు ఆచరించేందుకు పెన్నానదిలో స్నానఘట్టాలను ఏర్పాటు చేశారు. భక్తులు దేవాలయంలోనికి వెళ్లడానికి, వెలుపలికి రావడానికి ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వారదర్శనం, అమ్మవారి దర్శనం, కల్యాణ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని వెలుపలికి రావడానికి ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల పై నుండి విఐపిలకు ప్రత్యేక దర్శనాలకు అనుమతించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి, దేవాలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు.

జిల్లాలో కరువైన శాంతి భద్రతలు

నెల్లూరు (క్రైం) మేజర్‌న్యూస్‌: ఏడాది కాలంలో జిల్లా వ్యాప్తంగా పోలీసుల పనితీరు నిర్వీర్యమైంది. అధికారులు గణాంకాల్లో మాత్రం గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖంలో ఉన్నాయని సొంతడబ్బా కొట్టుకుంటున్నారు. వాస్తవానికి జిల్లాలో శాంతి భద్రతలు విఘాతం కలిగి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అధికారులు మాత్రం రాజకీయ నాయకుల కనుసన్నలలో తమ ఉద్యోగాలను చేశారే తప్ప వాస్తవంగా చేయాల్సిన డ్యూటీలు చేయలేకపోయారు. కొద్దిమంది అధికారులు పూర్తిగా రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తడంలోనే మునిగి తేలారు. మరికొంతమంది అధికారులు అటు రాజకీయ నాయకుల, ఇటు తమ అధికారుల మన్ననలను పొందడానికి చేయలేని పనులు కూడా చేస్తూ మునిగి తేలారు. జిల్లాలో పేరుకుపోతున్న కేసులనుగాని, దొంగలను పట్టుకోవడంలో చూపించాల్సిన నైపుణ్యాన్ని ప్రదర్శించడంలేదు. విచ్చలవిడిగా జిల్లాలో పెరిగిపోయిన వైట్‌కాలర్‌ నేరాలను అసలు పట్టించుకోవడమే మానేశారు. దీనివలన స్టేషన్‌లలో మొక్కుబడిగా రిజిష్టర్‌ అవుతున్న దొంగతనాలు వంటి వాటిమీద మాత్రమే చర్యలుంటున్నాయి తప్ప, వైట్‌కాలర్‌ నేరగాళ్లను పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలకు అంతేలేదు. అవినీతి విపరీతంగా పెరగడంతో పోలీస్‌ శాఖలోని అధికారులు పలువురు ఏసీబీ అధికారులకు చిక్కి శాఖ పరువును వీధిన పెట్టారు. నగరంలోని పలు స్టేషన్‌లలో ఎస్‌ఐ, సిబ్బందికి మధ్య వివాదాలు చోటుచేసుకుని సిబ్బందిని, ఎస్‌ఐని బదిలీలు చేసే పరిస్థితి ఏర్పడడం చూస్తే క్రమశిక్షణ ఏపాటిదో అర్థమవుతుంది. ఒక స్టేషన్‌ నుంచి మరొక స్టేషన్‌కి బదిలీ అయ్యే ఎస్‌ఐ తనతోపాటు తన ఐడి పార్టీలను కూడా బదిలీ చేయించుకుని స్టేషన్‌కు పోవడం వంటి సంఘటనలు పలువురిని బాధ కలిగించాయి. గత ఏడాది డెకాయిటీలు నాలుగు ఉండగా, ఈ ఏడాది రెండుగా ఉన్నాయి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో జిల్లా పోలీసు ఎన్నికల బందోబస్తు నిర్వహణలో సత్ఫలితాలు సాధించారు. అక్కడక్కడా చిన్నపాటి సంఘటనలు తప్ప మరెక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.
పెరిగిన ఛీటింగ్‌ కేసులు, కిడ్నాప్‌లు, తగ్గిన చోరీలుజిల్లాలో ఛీటింగ్‌ కేసులు గత ఏడాది 127 నమోదు కాగా ఈ ఏడాది 155 నమోదైనాయి. అదేవిధంగా కిడ్నాప్‌లు గత ఏడాది 39 నమోదు కాగా, ఈ ఏడాది 53 కేసులు నమోదైనాయి. దొంగతనాలు దాదాపు గత ఏడాది 264 నమోదు కాగా, ఈ ఏడాది 179 నమోదైనాయి. గత ఏడాది చోరీ జరిగిన ఆస్తి రి వరీ విషయంలో పోలీసులు సరిగా స్పందించలేదు. గత ఏడాది సుమారు రూ.3 కోట్ల విలువైన సొమ్ము చోరీ కాగా ఈ ఏడాది కోటి రూపాయలు సొమ్మును రికవరీ చేయడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. ఇంటలిజెన్స్‌ ఎస్‌ఐ ఇంట్లోనే దాదాపు రూ.20 లక్షల వరకు మాగుంటలేఅవుట్‌లో చోరీ అయినా రికవరీలో ఇంతవరకు అతీగతీ లేదు.
పెండింగ్‌ కేసులు ముమ్మరం జిల్లాలోని పలు స్టేషన్లలో పెండింగ్‌ కేసులు ముమ్మరంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ ఏడాది 60కి పైనే మర్డర్‌ కేసులు నమోదయ్యాయి. బాలాజీనగర్‌ స్టేషన్‌ పరిధిలోని హైవేపై తల్లి, బిడ్డను హత్య చేసి గోనె సంచుల్లో పెట్టి పారవేసి నేటికి ఏడాది అయినా నిందితులను అరెస్ట్‌ చేయడంలో అతీగతీ లేదు. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండు వద్ద వివాహితను కిడ్నాప్‌ చేసి ఆటోలో తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌ చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగింది. దీనిపై హోం మంత్రి నుంచి అధికారులకు చీవాట్లు పడడంతో నిందితులను అరెస్ట్‌ చేసి జైలుకు పంపి అధికారులు కొద్దిపాటి ఉపశాంతిని పొందారు. ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదులో గత ఏడాది 102 నమోదు కాగా, ఈ ఏడాది 135 నమోదై ఫైళ్లు పెండింగ్‌లో పేరుకుపోయాయి. అదేవిధంగా వేధింపుల కేసులు విపరీతంగా జిల్లా వ్యాప్తంగా నమోదయ్యాయి. వీటిని పరిష్కరించడంలో స్టేషన్లలో పంచాయతీలు నిర్వహిస్తున్నారే తప్ప కేసులు పరిష్కరించడంలో సరైన నిర్ణయం తీసుకోలేదు.
రక్తం చిందిన హైవేగత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరిగాయి. గత ఏడాది సుమారు 1700 వరకు నమోదై 500 మంది దుర్మరణం చెందారు. ఈ ఏడాది 2000 పైచిలుకు రోడ్డు ప్రమాదాలు జరిగి సుమారు 600 మంది వరకు దుర్మరణం పాలయ్యారు. గత నెల చింతారెడ్డిపాళెం వెళ్లే హైవే క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది చిత్తూరు జిల్లాకు చెందిన డ్రైవర్‌ ఒకరు దుర్మరణం చెందడం పలువురిని కలచివేసింది. బిట్రగుంట వ ద్ద పోలీసులు దొంగలను పట్టుకోవడంలో జరిగిన ఛేజింగ్‌ సమయంలో హైవేపై పలువురు పోలీసులు దుర్మరణం చెందడం పోలీస్‌ శాఖలో బాధను కలిగించింది.
పెరిగిన ద్విచక్ర వాహనాల చోరీ, దొంగనోట్ల చెలామణిజిల్లాలోని పలు ప్రాంతాల్లో వాహనం నిలబెట్టి ఆదమరిస్తే వాహనం మాయం కావడం ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ ఏదో ఒక చోట ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నా వాటిని రికవరీ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. దీనికి తోడు పక్క రాష్ట్రాల నుంచి దొంగ నోట్లను తీసుకొచ్చి విచ్చలవిడిగా చలామణి చేస్తున్నప్పటికీ వాటిని అదుపు చేయలేకపోయారు. దీనికి తోడు బ్యాంకు ఎటిఎంలలో డబ్బులు డ్రా చేయాలంటేనే కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. అనేక బ్యాంకుల్లో దొంగనోట్లు ఎటిఎంల ద్వారా రావడంతో కస్టమర్లు భయపడ్డారు.

Friday, December 25, 2009

THE MOST THINGS TO KNOW

The most useless thing to do.......... ...... Worry

The greatest Joy......... ......... ......... ... Giving.

The greatest loss ............ ......... ..... Loss of self-respect.

The most satisfying work ............ ....... .Helping others.

The ugliest personality trait....... ......... .. Selfishness.

The most endangered species..... ......... Dedicated leaders.

The greatest "shot in the arm"............ .. Encouragement.

The greatest problem to overcome.... ...... Fear.

The most Effective sleeping pill........ .... Peace of mind.

The most crippling failure disease..... ... Excuses.

The most powerful force in life........ ..... Love.

The most dangerous pariah...... ......... ... A Gossiper.

The world's most incredible computer.... . The Brain.

The worst thing to be without..... ......... . Hope.

The deadliest weapon...... ......... ......... ... The tongue.

The two most power-filled words....... ... "I Can".

The greatest asset....... ......... ......... ......... Faith.

The most worthless emotion..... ......... ... Self-pity.

The most prized possession.. ......... ....... Integrity.

The most beautiful attire...... ......... ......... A Smile.

The most powerful channel of communication. ..... Prayer.

The most contagious spirit...... ......... .... Enthusiasm.

The most important thing in the life....... God.

క్రిస్మస్‌ కళకళలు


నెల్లూరు (కల్చరల్‌) మేజర్‌న్యూస్‌: క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో వివిధ ప్రాంతాలు క్రిస్మస్‌ కాంతులతో కళకళలాడుతున్నాయి. ఏసుక్రీస్తు జన్మించిన నాటి పరిస్థితులను ప్రతిబింబించే అలంకారాలతో, ఆధునిక విద్యుత్‌ దీపాల వెలుగులతో క్రిస్మస్‌ పండుగకు నగరంలో సంసిద్ధమైంది. అలంకరణకు ప్రాధాన్యతనిచ్చే ఈ పండుగలో స్టార్స్‌, శాంతాక్లాజ్‌, క్రిస్మస్‌ ట్రీలు, అలంకరణకు అవసరమైన బెలూన్స్‌, రంగు కాగితాలు, రంగురంగుల సీరియల్‌ సెట్స్‌, ఙ్ఞానులు, పశువుల కాపరుల బొమ్మలను కొనడానికి అధిక సంఖ్యలో ప్రజలు షాపింగ్‌ చేయడం గురువారం నగరంలో తారసపడింది. ఏసుక్రీస్తు జననానికి సూచనగా అరుదైన నక్షత్రం ఆకాశంలో వెలిగిందని, అందుకు సూచనగా ప్రతి క్రైస్తవుని ఇంటిపై నక్షత్రాన్ని వెలిగించడం ఆచారంగా క్రైస్తవులు భావిస్తారు. క్రీస్తు జననం పశువుల పాకలో జరిగినందుకు నిదర్శనంగా ప్రతి గృహంలో, పెద్ద పెద్ద సెంటర్లలో పశువుల పాకలను ఏర్పాటు చేసి మరియమ్మ, యోసేబు, ఙ్ఞానులు, గొర్రెల కాపరులు తదితర ప్రతిమలతో అలంకరించి విద్యుత్‌ దీపాల వెలుగులో క్రిస్మస్‌ సందేశాన్ని అందించడానికి భారీఎత్తున ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్‌కు ముందు రాత్రి నగరంలోని ప్రతి క్రైస్తవ మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యువతీ యువకులు పాటలతో నృత్యాలు చేస్తూ క్రిస్మస్‌ శుభాకాంక్షలను అందరికీ తెలిపే కేరల్స్‌ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంతో నిర్వహించారు. కేరల్స్‌లో శాంతాక్లాజ్‌ (క్రిస్మస్‌ తాత) వేషధారణ ప్రత్యేక ఆకర్షణ గా కేరల్స్‌లో ఉత్సాహాన్ని అందించడానికి దోహదం చేస్తుంది. క్రీస్తు జన్మించిన కొన్ని శతాబ్దాల తర్వాత క్రిస్మస్‌తాత వేషధారణతో ఓ వ్యక్తి నిరుపేద ప్రజలకు దానధర్మాలు చేస్తూ ఉండేవారని, ఆయనను స్మరించుకోవడం కోసం క్రిస్మస్‌ తాత ప్రాధాన్యతను సంతరించుకున్నాడు. పశువులపాకతో పాటు క్రిస్మస్‌ ట్రీ అలంకరణ ఎంతో ప్రాముఖ్యమైంది. పాశ్చాత్య దేశాల్లో ఈ ట్రీని క్రిస్మస్‌ బహుమతులతో అలంకరించి బహుమతులను అందజేయడం ఆనవాయితీ. స్థానికంగా ప్రతి ఇంట్లో ఈ ట్రీలకు దూతల, ఙ్ఞానుల, నక్షత్ర, శాంతాక్లాజ్‌, బెలూన్స్‌, గ్రీటింగ్‌ కార్డులతో అలంకరించడంతోపాటు పెద్ద పెద్ద కూడళ్లలో భారీస్థాయిలో ఏర్పాటు చేసి ప్రజలకు క్రిస్మస్‌ సందేశాన్ని అందించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరిగాయి. అలంకరణలతోపాటు ఆధ్యాత్మికంగా పండుగను జరుపుకోవడంలో భాగంగా నగరంలోని ప్రతి క్రైస్తవ దేవాలయాల్లో గురువారం అర్థరాత్రి నుండి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అద్వాన్నంగా అన్నారెడ్డిపాళెం


విడవలూరు, (మేజర్‌ న్యూస్‌) : ఆర్‌అండ్‌బి రహదారులు నరకానికి నకళ్ళుగా మారాయి. విడవలూరు మండలం అన్నారెడ్డిపాళెం గ్రామం నుండి అలగానిపాడు వెళ్ళే రోడ్లు భవనాలశాఖ రహదారి గుంటలమయమైంది. విడవలూరు - ఊటుకూరు ప్రధాన రహదారి నుండి వెళ్ళే అలగానిపాడు వరకు గల మూడు కిలో మీటర్ల రోడ్డు గతుకులమయమైంది. పలుచోట్ల గుంటలు ఏర్పడి వాహనాలు వెళ్ళలేని స్థితిలో వున్నాయి. అన్నారెడ్డిపాళెం గ్రామంలోని మండల ప్రజాపరిషత్‌ ప్రాధమికోన్నత పాఠశాల వద్ద రహదారి నీటిమడుగుగా తయారైంది.గుంటలమయంకావడంతో రోడ్డు మార్జిన్‌లో వాహనాలు వెళుతున్నాయి. ప్రజానీకం కూడా అద్వాన్నమైన రహదారిలో నడిచి వెళుతున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య మార్గ్‌గా వ్యవహరించే ఈ రహదారి అలగానిపాడు గ్రామం వరకు ఘోరంగా దెబ్బతినింది. గుంటలు పుడ్చడంకాని, ప్యాచ్‌వ ర్క్‌లు చేయడం కాని సంబందిత అధికారులు చేపట్టడంలేదు. వర్షాకాలం కావడంతో వర్షం వల్ల రహదారి దెబ్బతిని నీటి మడుగులైనాయి. ఊటుకూరు - వావిళ్ళ లింక్‌రోడ్డు వేస్తుండగా ట్రిప్పర్లు కంకర, ఎర్రమట్టి తోలుతుండగా రహదారి గోతులమయమైంది. రోడ్డు నిర్మించడ మో లేక గుంటలు అయినా పూడ్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.

హక్కులతో పాటు బాధ్యతలు గుర్తెరగాలి

నెల్లూరు, మేజర్‌న్యూస్‌: వినియోగదారులు తమ హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తెరిగితే వస్తువుల కొనుగోలు విషయంలో సమస్యలుండవని జడ్పీ ఛైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచించారు. గురువారం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జడ్పీ సమావేశమందిరంలో ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జడ్పీ ఛైర్మన్‌ మాట్లాడుతూ వస్తువుల ధర తక్కువగా ఉన్నదని కాకుండా, నాణ్యతను చూసి కొనుగోలు చేయాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే ఇటువంటి ఆలోచనలు రావాలన్నారు. వస్తువుల కొనుగోలు సమయంలో ఎంఆర్‌పీ ధరలను, ఎక్స్‌పైరీ తేదీలను గుర్తించడం లేదన్నారు. వినియోగదారులు సరైన అవగాహక కలిగి, చైతన్యంతో వ్యాపారస్తులను నిలదీయాలని సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్క వినియోగదారునికి కొన్ని హక్కులుంటాయనీ, వీటి గురించి అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఇందు కోసమే జిల్లాలో 99 ఉన్నత పాఠశాలలోనూ, 5 కళాశాలలోనూ వినియోగదారుల క్లబ్‌లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 25 వినియోగదారుల సంఘాలు ఎంతో చురుగ్గా పనిచేస్తున్నట్లు వివరించారు. జడ్పీ సిఇఓ రామిరెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల పరిరక్షణ చట్టం ఏర్పడి పాతికేళ్లవుతున్నప్పటికీ, ఇంకా పలుచోట్ల వినియోగదారులు మోసపోతూనే ఉన్నారన్నారు. డిఎస్‌ఓ జ్వాలాప్రకాష్‌ మాట్లాడుతూ ప్రతి వినియోగదారులు తన ఆర్థిక జ్ఙానాన్ని పెంపొందించుకుంటూ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందేలా సరియైన విలువగల వస్తువులను పొందామా లేదా అని చూసుకోవాలని సూచించారు. వినియోగదారుల ఫెడరేషన్‌ అధ్యక్షుడు జయరామరాజు మాట్లాడుతూ వినియోగదారుల చట్టంలో ఆరు హక్కులు పొందుపరచబడ్డాయనీ, వీటి సంరక్షణకు కోర్టులకురావడం కూడా జరిగిందన్నారు. అంతక్రితం ఇటీవల మరణించిన వినియోగదారుల సంఘ జిల్లా నేత జితేంద్రనాథ్‌బాబుకు కార్యక్రమంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర వినియోగదారుల సంఘ కార్యదర్శి కెవి సుబ్బారెడ్డి, జిల్లా ఫెడరేషన్‌ ప్రధానకార్యదర్శి ఎస్‌వి కృష్ణయ్య, డిఇఓ ఆంజనేయులు, డికెడబ్ల్యు కళాశాల అధ్యాపకురాలు కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.

రోశయ్యా...ఇక చాలు దిగవయ్యా...!

గూడూరు, (మేజర్‌న్యూస్‌) : రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి పరిస్థితి ఉద్రిక్తంగా మారి అగ్నిగుండంలా తయారైందనీ ఈ పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనలకు గురువుతున్నారనీ కావున గద్దె దిగి రాష్టప్రతి పాలన విధిస్తే పరిస్థితులు చక్కబడతాయని డిసిసి అధ్యక్షులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు. శుక్రవారం స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథిగృహం ఆధ్వర్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విషయమై చిదంబరం ప్రకటన వెలువడిన అనంతరం కోస్తాంధ్రలో జరిగిన ఉద్యమాలు శాంతియుతంగా జరిగాయని పేర్కొన్నారు. ప్రజలు ఎంతో సంయమనంతో వివిధ మార్గాల్లో ఆందోళన నిర్వహించారన్నారు. అదే తదుపరి ప్రకటన వెలువడిన అనంతరం తెలంగాణ వాసులు ప్రారంభించిన ఉద్యమాలు శాంతియుతంగా గాకుండా హింసాత్మకంగా మారడంతో ప్రజలు భయాందోళనలను చెందుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి భద్రతల పరిరక్షణకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాక్షాత్తూ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకే రక్షణ లేదు ఇక సామాన్య మానవుని పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చన్నారు. మావోయిస్టులు కూడా తెలంగాణ జెఎసికి ప్రత్యక్షంగా మద్దతు తెలపడం మరికాస్త భయాందోళన కలిగిస్తోందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులు ఎంతో నష్టపోతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా ఏ విధమైన చర్యలూ లేకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నట్లుందని ముఖ్యమంత్రి రోశయ్యను వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో నియంత్రించలేనందున గద్దె దిగి రాష్టప్రతి పాలన విధించడం ప్రజలకు శ్రేయస్కరమని సూచించారు.ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ యారం మంజుల, నెల్లూరు రమణారెడ్డి, కొణిదల మునిగిరీష్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు నాశిన నాగులు, బొమిడి శ్రీనివాసులు, జమళ్ల వాసు తదితరులున్నారు.

కొత్తపట్నం ‘సెజ్‌’లో అవినీతి బాగోతం

కోట, (మేజర్‌న్యూస్‌) : కోట చిల్లకూరు మండలాల్లో ప్రత్యేక ఆర్ధిక మండళ్లు (సెజ్‌)కు సేకరించిన భూమికి పరిహారంలో బినామీల పేర్లతో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై విచారిస్తున్న అధికారులను స్థానిక అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక అధికారులు, భూ స్వాములు కొందరు సాగించిన దుశ్చర్యలు వెలుగు చూస్తున్నా ఏమీ జరగలేదంటూ బుకాయిస్తున్నారంటూ ఆరోపణలున్నాయి.అవినీతి నిరోధక శాఖ అధికారులు సైతం కొత్తపట్నం, తూర్పు కనుపూరు సెజ్‌ల్లో చోటు చేసుకున్న అవతకవకలపై దర్యాప్తు చేస్తుండగా కొందరు అక్రమార్కులు అవకతవకలు బయట రానీయకుండా ఉండేందుకు రాజీ యత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్లు తెలిసింది. సెజ్‌ల కోసం సుమారు 6 వేల ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఇప్పటికే కొత్తపట్నం, కర్లపూడి, సిద్దవరం, తూర్పుకనుపూరు, వేళ్లపాళెం పరిధిలో సిజెఎఫ్‌ఎస్‌ భూములకు కూడా పరిహారం పంపిణీ చేసి ఉన్నారు. ఈ పంపిణీ చేసిన పరిహారంలో దాదాపు 5 కోట్ల రూపాయల మేర బినామి పేర్లతో అధికారులు, భూ స్వాములు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని పరిహారం చెల్లించిన దాదాపు 300 ఎకరాల్లో అసలైన పట్టాదారులు లేకపోవడంతో అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మకై్క భాగాలు పంచుకున్నట్లు తెలిసింది. పట్టాదారులు లేకుండా తమ రెవెన్యూ లోని భూములకు సంబంధించిన పరిహారాన్ని పరులు పంచుకునే ప్రయత్నాలపై స్థానికులు తిరగబడ్డంతో అధికారులే దగ్గరుండి మధ్యస్తాలు జరిపి పంపకాలు నిర్ణయించడం విశేషం. సెజ్‌ కోసం సేకరించిన భూమికి ఎకరాకు 1 లక్షా 90 వేల రూపాయల పరిహారంలో గ్రామానికి 30 వేల రూపాయలు మాత్రం మిగిలింది. మిగిలిన మొత్తాన్ని అధికారులు, రాజకీయ నాయకులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. కొత్తపట్నం గ్రామానికి చెందిన రేషన్‌ షాపు డీలర్‌ వెంకటాద్రి, అధికారులు, స్థానిక నాయకులు తమ ఖాతాల్లో జమ చేసుకుని తరువాత గ్రామంలో పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. బినామీల చెల్లింపు విషయంలో బ్యాంకర్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుండడం విశేషం. యమదిన్నెపాళెం, గున్నంపడియ, పోసినవారిపాళెం తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు తెలిసింది. కొత్తపట్నం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 595, 596, 597లలోని 19.62 ఎకరాలకు చెందిన పరిహారం దాదాపు 37 లక్షల రూపాయలు చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు స్వాహా చేశాడని తెలిసింది. 1963 ప్రాంతంలో అసైన్‌మెంట్‌ భూములను గిరిజనులైన గడ్డం పోలయ్య, గడ్డం రామయ్య, మానికల పోలయ్య, చింతపూడి సుబ్బయ్యలు పట్టాలు కలిగి ఉన్నారు. కానీ ప్రస్తుతం ఎన్నో ఏళ్లుగా ఊర్లో లేకపోవడంతో బల్లవోలు గ్రామానికి చెందిన కొందరు గిరిజనులకు బ్యాంకులో వలలకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి వారి వద్ద నుండి సంతకాలు సేకరించి ఖాతాలు తెరిచారు. అనంతరం ఆ గిరిజన లబ్ధ్దిదారులు వీరే అని బ్యాంక్‌ అధికారులకు చూపి డబ్బులు డ్రా చేసి ఒక గిరిజనుడికి 1900 రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే చిల్లకూరు మండలం వేళ్లపాళెం గ్రామంలో మల్లిగుంట చిన్నయ్యకు చెందిన 260/1, 2, 262/1, 275/2 సర్వే నెంబర్ల లోని 4.53 ఎకరాల భూమికి పరిహారంగా 8 లక్షలా 60 వేల 760 రూపాయలు చెక్కు చిన్నయ్య పేరున రాగా సదరు వ్యక్తి దీర్ఘకాలంగా గ్రామంలో లేకపోవడంతో వారసులు కూడా అక్కడ లేకపోవడంతో బినామి వ్యక్తిని సృష్టించి ఆ పరిహారం మొత్తాన్ని బల్లవోలు రాజకీయ నాయకులు స్వాహా చేశారని తెలిసింది. పాలు గంగయ్య అనే వ్యక్తికి సర్వే నెంబరు 268/4లో 1.24 ఎకరాలు, 268/2లో 63 సెంట్లు 263/1లో 50 సెంట్లు భూమికి గాను దాదాపు 3 లక్షలా 80 వేల రూపాయలకు సంబంధించిన పరిహారం మొత్తాన్ని కూడా స్వాహా చేసినట్లు తెలిసింది. ఇలా ఎన్నో రకాలుగా అవకతవకలకు పాల్పడి కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యక్షంగా అధికారుల దృష్టికే ఈ అవకతవకలు వచ్చినా కూడా వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోకుండా కాలం వెళ్లదీస్తుండడంతో మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇకనైనా ఉన్నతాధికారులు నిజాయితీ కలిగిన అధికారులచేత సమగ్ర విచారణ జరిపిస్తే అసలు దోషులు బయటపడతారని స్థానికులు కోరుతున్నారు

Tuesday, December 22, 2009

భూస్వాముల చేతిలో ప్రభుత్వ భూమి

భక్తవత్సలనగర్‌ (నెల్లూరు) మేజర్‌న్యూస్‌:చిల్లకూరు మండలంలోని బల్లవోలు గ్రామంలో సుమారు 300 ఎకరాలు ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన భూస్వాములు ఆక్రమించుకున్నారని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు కెఆర్‌.దాసరి ఆధ్వర్యంలో బల్లవోలు గ్రామస్తులు సోమవారం గ్రీవెన్స్‌డేలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో చాలా కాలం నుండి ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నది. ఈ భూమిని అదే గ్రామంలో నివసిస్తున్న హరిజన, గిరిజన, వెనుకబడిన తరగతులకు ఇవ్వాలని కోరారు. గతంలో ఆక్రమణ విషయమై సంబంధిత తహసిల్దార్‌కు తెలపగా ఆయన తలారిచే దండోరా వేయించిని ఫలితం లేకపోగా ఆక్రమణ చేశారన్నారు. ప్రభుత్వ భూమిని నిరుపేదలైన తమకు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దామవరపు బాబు ఎం.వెంకారామయ్య, కె.ఏడుకొండలు, ఆర్‌ .శివయ్య, ఎం.చిరంజీవి, కె.ఆదినారాయణ, సి.సుబ్బయ్య, అమర్‌నాధ్‌ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకం పనిని ఇప్పించండిబాలాయపల్లి మండలంలోని జయంపు గ్రామంలో నివసిస్తూ గతంలో మధ్యాహ్న భోజన పథకం పనిని నిర్వహించిన ఎం. రాజేశ్వరికి ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్‌ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్‌ కార్యదర్శి ప్రజావిఙ్ఞప్తుల దినంలో జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు టైఫాయిడ్‌ జ్వరం వచ్చినందున ఆ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడిని, మండలాధికారిని అనుమతితో విశ్రాంతి తీసుకున్నామన్నారు. ఆ సమయంలో పొదుపులక్ష్మి నాయకురాలైన ఒక మహిళకు ఆ పనిని ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం తమ ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని, తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉందని తమకు గతంలో తాము చేసిన పనిని ఇప్పించాలని కోరారు. కుటుంబాన్ని ఆదుకోండి గత ఆరు నెలల క్రితం విద్యుత్‌ వైర్లు తగిలి మృతి చెందిన రియాజ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకోవాలని స్టూడెంట్‌ ఇస్లామిక్‌ ఆర్గనైజింగ్‌ నగర అధ్యక్షులు ముజహిద్‌ సోమవారం గ్రీవెన్స్‌డేలో జిల్లా కలెక్టర్‌ను కోరారు. మృతి చెందిన కుటుంబం కూలి పని చేసుకుంటూ చాలీచాలని జీతంతో జరుగుబాటు కష్టంగా ఉందని, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని పేర్కొన్నారు.

జనవరిలో ప్రధానిచే బిహెచ్‌ఈఎల్‌ శంఖుస్థాపన:

వెంకటగిరి,మేజర్‌న్యూస్‌:వచ్చే ఏడాది జనవరిలో భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌చే బిహెచ్‌ఈఎల్‌ కర్మాగారం శంకుస్థాపన జరుగుతుందని తిరుపతి ఎంపి డాచింతామోహన్‌ తెలిపారు. ఈమేరకు ఆయన ఢిల్లీ నుండి స్థానిక విలేకరులకు సోమవారం సమాఛారం తెలిపారు. బిహెచ్‌ఈఎల్‌ కర్మాగారాన్ని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్ర్తి సమీపంలోని మన్నవరం వద్ద ఏర్పాటుచేస్తున్న ప్రాజెక్టుపై ఢిల్లీలో ప్రధానమంత్రిని కలువగా ఆయన సానుకూలంగా సమాధానమిచ్చారని, జనవరిలో తప్పక శంకుస్థాపన జరుగుతుందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా సమైక్యాంధ్ర కోసం రాష్టమ్రంతటా జరుగుతున్న పరిస్ధితులను ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయంపై ఆలోచించి త్వరలోనే నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తామన్నట్లు ఆయన వివరించారు

మధ్యాహ్న భోజన నిర్వాహకులకు బిల్లులు చెలిస్తాం:డిఇవో

నాయుడుపేట, మేజర్‌న్యూస్‌: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్నం భోజన బిల్లులను మార్చి ఆఖరులోపు చెలిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి ఆంజనేయులు తెలిపారు. సోమవారం మండలంలోని నరసారెడ్డి కండ్రిగ పాఠశాలను తనిఖి చేసిన ఆయన ఆపాఠశాలలో మధ్యాహ్న భోజనంలో వివక్ష ఉందన్న విషయం సరికాదన్నారు. అక్కడున్న పిల్లలు, విద్యార్ధుల తల్లిదండ్రులను ఈ విషయమై ప్రశ్నించారు. ఈ సందర్భంగా విలేకర్లుతో మాట్లాడుతూ గత ఏడాదిగా మధ్యాహ్న భోజన పథకంకు నిర్వాహకులకు రూ5కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా డిశంబర్‌1నుంచి బిల్లులు కూడా పెంచినట్లు తెలిపారు. అదే విధంగా 25మంది విద్యార్ధులు పై బడిన పాఠశాలలో అదనపు కుక్‌ కోసం రూ1000చెల్లించనున్నట్లు చెప్పారు. ఆయనతో పాటు ఎంఇవో అజయ్‌కుమార్‌, ఎంఆర్‌పిలు శరత్‌, రజనీబాబు తదితరులున్నారు.

రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించం

వెంకటగిరి,మేజర్‌న్యూస్‌:సోనియా గాంధీ రాష్ట్రాన్ని బర్తడే కేకులాగా ముక్కలు చేసే ప్రతిపాదనను మానుకోవాలని పుత్తూరు ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు వెల్లడించారు. సోమవారం స్థానిక పట్టణంలో ఎమ్మెల్యే కురుగొండ్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆమరణ నిరాహారదీక్ష వద్ద ఆయన పాల్గొని ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్‌ లాంటి కుహనా రాజకీయవాదికి భయపడి తెలంగాణాను ప్రకటించాలనుకోవడం అర్ధరహితమని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలు చేస్తే సోనియాగాంధీ తనంతట తానే దిగివచ్చి సమైక్యాంధ్రకే మద్దతు పలుకుతుందన్నారు. తెలంగాణాను వేరుపరిస్తే అక్కడవున్న నీటి వనరుల నుంచి ఒక బొట్టు కూడా నీరు కోస్తా, రాయలసీమలకు అందవని అన్నారు. దీంతో ఈ ప్రాంతమంతా ఎడార్లుగా మారుతాయని చెప్పారు. టిడిపి బస్సు యాత్ర ఈనాడు సమైక్యాంధ్ర కోసం రాష్ట్రం యావత్తు జరుపుతుందన్నారు. ఆనాడు ఎన్టీరామారావు ఢిల్లీ వీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవం నిలబెడితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు 9ఏళ్ల పాలనలో హైదరాబాద్‌ను ప్రపంచస్ధాయిలో గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేశారన్నారు. అలాంటి హైదరాబాద్‌ను దోచుకునే ప్రయత్నంలో కెసిఆర్‌ కుట్ర పన్నుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని వేరుచేసే విషయం ఆశామాషి కాదని, అలా చిన్నచిన్న ముక్కలైతే అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. కురుగొండ్ల చేపడుతున్న దీక్ష ఆయన ధైర్యానికి నిదర్శనం: మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి సమైక్యాంధ్ర నినాదంతో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గత మూడు రోజుల నుండి చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష ఆయన ధైర్యానికి నిదర్శనమని శ్రీకాళహస్ర్తి ఎమ్మెల్యే మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. ఆయన శిబిరం వద్ద మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చిన్న ప్రకటనతో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారని ఆయన ఆరోపించారు. కెసిఆర్‌ దీక్షకు భయపడి కేంద్రహోం మంత్రి చిదంబరం ప్రకటన చేయడం దారుణమైన విషయమని ఆయన అన్నారు. కావలి ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర విషయంలో ఢిల్లీ పెద్దలను ఒప్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. ప్రముఖ మహిళా న్యాయవాది ఎంవిఎస్‌ గిరిజాకుమారి మాట్లాడుతూ రాష్ట్రంముక్కలు చేయాలనుకోవడం సరైన చర్య కాదన్నారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే పరసారత్నం మాట్లాడుతూ ఇది ఒక తెలంగాణాకు సంబంధించిన విషయం మాత్రమే కాదని, యావత్తు రాష్ట్రానికి సంబంధించిన విషయమని, రాష్ట్ర ప్రజల మనోభావాలను గుర్తించి సమైక్యాంధ్ర నినాదానికే కేంద్రప్రభుత్వం మద్దతు పలకాలని కోరారు. కురుగొండ్లకు సంఘీభావం ప్రకటించిన పలువురు నాయకులు:స్ధానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మూడురోజులుగా చేపడుతున్న ఆమరణ నిరాహారదీక్షలకు పలువురు జిల్లా, మండలస్థాయి నాయకులు సోమవారం తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రముఖ విద్యాసంస్ధల అధినేత వంకి పెంచలయ్య, జిఎన్‌ఆర్‌ ట్రస్ట్‌ అధినేత గంగోటి నాగేశ్వరరావు, గూడూరు- వెంకటగిరి నాయకులు, స్ధానిక పాన్‌బ్రోకర్స్‌ అసోసియేషన్‌, నాయిబ్రహ్మణ అసోసియేషన్‌ ర్యాలీగా మంగళవాయిద్యాలతో వచ్చి వారు ఆయనకు తమ సంఘీభావాన్ని ప్రకటించి సమైక్యాంధ్ర నినాదం చేశారు.

సాహిత్య రంగంలో వర్థమాన సమాజం ఆదర్శం

నెల్లూరు (కల్చరల్‌) మేజర్‌న్యూస్‌:సింహపురిలో సాహిత్య సేవా ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసిన శ్రీ నెల్లూరు వర్థమాన సమాజం నేటికీ ఆదర్శమని విక్రమసింహపురి వైస్‌ చాన్సలర్‌ సి.విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం నగరంలోని టౌన్‌హాల్‌లో నిర్వహించిన శ్రీ నెల్లూరు వర్థమాన సమాజం శతజయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ బెజవాడ గోపాలరెడ్డి, మరుపూరు కోదండరామిరెడ్డి, దువ్వూరు రామిరెడ్డి తదితర సాహిత్య ఉద్దండులు వర్థమాన సమాజం ద్వారా సింహపురి నగరానికి ఎనలేని కీర్తిని ఆపాదించారని అన్నారు. తెలుగు సాహిత్య రంగంలో వర్థమాన సమాజం ఒక ప్రత్యేక ఒరవడిని రూపొందించుకుని వందేళ్లకు పైగా సేవలందించడం ఆదర్శమని ఆయన అన్నారు.నెల్లూరు జిల్లా సెషన్స్‌ జడ్జి గణేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ 45 వేల గ్రంధాలతో ఇన్నేళ్లుగా సాహిత్య సేవలు అందించడం విశేషమని అన్నారు. భావితరాలకు సాహిత్య సేవలను అందించడానికి వర్థమాన సమాజం దినదిన ప్రవర్థమానం చెందాలని ఆకాంక్షించారు. ప్రధాన వక్తగా పాల్గొన్న మైసూర్‌ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు శ్రీమద్భగవద్గీతను ప్రేక్షకులకు వివరించారు. అనంతరం వర్థమాన సమాజం సభ్యులు ఆయనను సన్మానించారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు, ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు అతిధులు బహుమతులను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్థమాన సమాజం అధ్యక్షులు మలుచూరు ధర్మారెడ్డి, కార్యదర్శి మజ్జిగ ప్రభాకర్‌రెడ్డి, పురమందిర ప్రతినిధి పొన్నాల రామసుబ్బారెడ్డి, బివి.నరసింహం ఎం.బలరామనాయుడు, సుభద్రాదేవి, సాహిత్య ప్రియులు తదితరులు పాల్గొన్నారు.

లింగ నిర్థారణల వల్లే స్ర్తీ, శిశు మరణాలు

నెల్లూరు, మేజర్‌న్యూస్‌:గర్భిణీ స్ర్తీలు ముందుగానే వివిధ వైద్యశాలలకు వెళ్లి స్కానింగ్‌ ద్వారా ఆడ, మగ లింగ నిర్థారణ తెలుసుకుంటున్నందువల్లే స్ర్తీ, శిశు మరణాలు సంభవిస్తున్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ టి.వెంకటరమణారెడ్డి తెలిపారు. గర్భిణీ స్ర్తీ, శిశు మరణాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సోమవారం ఆయన తన చాంబర్‌లో లింగ నిర్థారణ కమిటీ (పిఎన్‌డిటి) అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కానింగ్‌ ద్వారా పుట్టబోయేది ఆడబిడ్డ అయితే అబార్షన్‌ చేయించుకోవడం పరిపాటైందన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ ప్రక్రియపై వివిధ ప్రైవేటు హాస్పిటల్స్‌లో తగిన విధంగా తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.స్ర్తీ,శిశు మరణాలు జరగకుండా అంగన్‌వాడీ, ఆశ వాలెంటీర్లతో అవగాహన సదస్సులు నిర్వహించి వారి ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సదస్సుల్లో స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు అయ్యేలా చూడాలన్నారు. నాలుగు లేదా ఐదు మాసాలు పూర్తయిన గర్భిణీ స్ర్తీలు ఎవరైనా స్కానింగ్‌ తీసుకుని ఉంటే అలాంటి వివరాలను సేకరించాలన్నారు. దీనిపై ప్రధానంగా డివిజన్‌ స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసి దీనికనుగుణంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రతి డాక్టర్‌ రోగులకిచ్చే మందుల చీటీపై ఖచ్చితంగా లింగ నిర్ధారణ నిషిద్ధమని విధిగా ముద్రించాలన్నారు.సాధారణంగా పరిసర ప్రాంతాల్లో మురుగునీరు, గృహాలలో పూలకుండీల వద్ద నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువై చికున్‌గున్యా తదితర విషజ్వరాలు సోకే ప్రమాదముందని, అందువల్ల గృహాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలను నివారించవచ్చన్నారు. దీనిపై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు వైద్యాధికారులు, మున్సిపల్‌ శాఖాధికారుల సమన్వయంతో నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు ఇవిఎస్‌.నాయుడు, అదనపు పిపి అయ్యప్పరెడ్డి, న్యాయవాది రమణమ్మ, మెటర్నిటీ వైద్యశాల ఆర్‌ఎంఒ డాక్టర్‌ తిరుపాల్‌, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ జయసింహ, డిపిఆర్‌ఒ జెయుకె.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మతాలు ఉద్యానవనంలో పుష్పాలు

నెల్లూరు (కల్చరల్‌) మేజర్‌న్యూస్‌:ప్రపంచమనే ఉద్యానవనంలో మతాలు పుష్పాలని కరుణామయి విజయేశ్వరీదేవి అభివర్ణించారు. ఆదివారం నగరంలోని విఆర్‌.కళాశాల మైదానంలో నిర్వహించిన విజయోత్సవ అభినందన సభలో ఆమె మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ మతాలన్నీ శాంతిని కాంక్షిస్తాయని అన్నారు. పుష్పాలు వేరైనప్పటికీ సౌరభం వాటి లక్షణమని, అలాగే మతాలు మానవాళి శ్రేయస్సు కోసమేనని ఆమె పేర్కొన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాలోని మెల్‌బోన్‌ నగరంలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న కరుణామయి విజయేశ్వరిదేవి తన అనుభవాలు గూర్చి భక్తులకు వెల్లడించారు.ప్రపంచ దేశాల్లో ప్రస్తుతమున్న సమస్యలను, అలజడులను మతం ద్వారా వాటిని పరిష్కరించడానికి ఉపయోగపడే అనేక అంశాలను ఆమె వివరించారు. గ్రామస్థాయి నుండి ప్రపంచస్థాయి వరకు శాంతియుత సహజీవనం చేయడానికి ఐకమత్యం అవసరమని ఆమె ఉద్బోధించారు. చదువు ద్వారా దేశంలో అభివృద్ధిని సాధించవచ్చునన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలకున్న గొప్ప పేరును ప్రపంచ వ్యాప్తంగా పలు మత గురువుల అభిప్రాయలను ఆమె విశదీకరించారు. సమాజంలో పేద ప్రజల ఆకలి తీర్చడానికి, నివాసం కల్పించడానికి ఆధ్యాత్మిక చింతన పెంపొందించి మానవాళిలో అశాంతిని తొలగించడానికి తాను అన్ని విధాలా కృషి చేస్తున్నానని తెలిపారు. భగవంతుడు తనకిచ్చిన స్థానం ద్వారా సమాజ సేవ చేయాలనే దృక్పథంతో ఆసుపత్రులను, పాఠశాలలను, వృద్ధాశ్రమాలను, యోగా కేంద్రాలను, వేద పాఠశాలలను నిర్వహిస్తున్నామన్నారు. నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించే ఏకైక ఆధ్యాత్మి కేంద్రం శ్రీమాతృదేవి విశ్వశాంతి ఆశ్రమమని అన్నారు. తాను పర్యటించిన 20 దేశాల్లో పాశ్యాత్యులను సైతం ప్రభావితం చేసిన భారతజాతి ఔన్నత్యాన్ని ప్రజలు పరిరక్షించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ముర ళీకృష్ణ 70 అధినేత వీరిశెట్టి హజరత్‌బాబు, కళాబంధు కొండా బలరామిరెడ్డి, సేవారత్న ఒమ్మిన సుబ్రహ్మణ్యం, తెలుగు సమాఖ్య జిల్లా అధ్యక్షులు ఎన్‌.బలరామయ్యనాయుడు, విద్యాదాత ఆనందరావు, కాంగ్రెస్‌ నాయకులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, కావలి కోటారెడ్డి, కవి ఆలూరు శిరోమణి శర్మ, తల్పగిరి ఆలయ ఛైర్మన్‌ పత్తి రవీంద్రబాబు తదితర పుర ప్రముఖులు వేద మంత్రోచ్ఛారణల నడుమ విజయేశ్వరిదేవిని ఘనంగా సన్మానించారు. సభాసింమం బివి.నరసింహం వ్యాఖ్యానం అశేష భక్తజనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన కరుణామయి భక్తులతోపాటు భారీ సంఖ్యలో స్థానిక భక్తులు పాల్గొన్నారు.

నగరంలో తీవ్రమవుతున్న చికున్‌గున్యా జ్వరాలు

నెల్లూరు, మేజర్‌న్యూస్‌:ఓ వైపు నగరపాలక సంస్థ, మరో వైపు వైద్య ఆరోగ్య శాఖలు దోమల నివారణకు తీవ్రంగా చర్యలు చేపడుతున్నా, మీ చర్యలు తమనేమీ చేయలేవంటూ నగరంలో దోమలు నిరాటంకంగా తమ పని తాము చేసుకుంటున్నాయి. ఫలితంగా చికున్‌గున్యా, డెంగ్యూ తదితర విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. చికున్‌గున్యా బాధితులైతే తమ ఇళ్లలోనే ఉండి నానా అవస్థలు పడుతుండగా డెంగ్యూ బాధితులు చెనై్న నగరాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే చెనై్న నగరంలోని జనరల్‌ హాస్పిటల్‌, విజయ, అపోలో, కంచికామకోటి ట్రస్ట్‌ తదితర వైద్యశాలలు నెల్లూరు జిల్లాకు చెందిన వందలాదిమంది రోగులతో కిటకిటలాడుతున్నట్లు సమాచారం.అంతేకాకుండా నగరంలోని డాక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల, నారాయణ, బొల్లినేని, జయభారత్‌, నెల్లూరు వైద్యశాల, జిల్లా ప్రభుత్వ వైద్యశాలలతోపాటు అనేక నర్సింగ్‌ హోమ్‌లు విషజ్వరాలతో బాధపడుతుండేవారితో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా స్థానిక జూబ్లీ వైద్యశాల (మెటర్నిటీ) మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సీతాలక్ష్మి గత నాలుగైదు రోజులుగా చికున్‌గున్యా వ్యాధితో బాధ పడుతున్నారు. జూబ్లీ వైద్యశాల సమీపంలోనే ఎసి.కూరగాయల మార్కెట్‌ ఉండడంతో ఆ ప్రాంతంలో కుళ్లిపోయిన కూరగాయలు, ఇతర వ్యర్థ పదార్థాలు పెద్ద ఎత్తున నిల్వ ఉండ డం, ఇటీవల వర్షాలు కురవడంతో ఆ ప్రాంతమంతా దుర్గంధమై వాసనతో భయంకరంగా తయారైంది. సమీపంలోనే బాలికల హాస్టల్‌ ఉండడంతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు స్పందించిన జూబ్లీ వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సీతాలక్ష్మి ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ విషయాన్ని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఆయన ఆ హాస్టల్‌ను సందర్శించి దోమల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను సైతం ఆదేశించారు.నగరంలో దోమల పెరుగుదల కారణంగా చిన్న, పెద్ద, స్ర్తీ, పురుష వంటి తేడాలు లేకుండా నగరవాసులు విషజ్వరాల బారినపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగానపడ్డ ప్రజలను తమ వైద్యసేవలతో బాగుచేసే వైద్యులు సైతం ఈ వ్యాధుల బారిన పడుతుండడం విశేషం. పైగా విషజ్వరాల వల్ల రోగులకు ప్లేట్‌లెట్ల సంఖ్య భారీగా తగ్గిపోతుండడంతో అందుకు అవసరమైన రక్తాన్ని ఇస్తుండే దాతలు సైతం చికున్‌గున్యా బారినపడి మంచాన పడుతుండడం గమనార్హం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషజ్వరాలను తీవ్రంగా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Monday, December 21, 2009

ట్రాక్‌పై విద్రోహ చర్యకు యత్నం

కావలి రూరల్‌, మేజర్‌న్యూస్‌: పట్టణంలోని రైల్వే స్టేషన్‌కు ఉత్తరాన ట్రాక్‌కు అమర్చిన క్లిప్పింగ్‌లు దుండగులు శుక్రవారం రాత్రి తొలగించి విద్రోహ చర్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. నెల్లూరు రైల్వే డిఎస్పీ భాస్కర్‌నాయుడు, ఇన్‌స్పెక్టర్‌ విజయకుమార్‌ల ఆధ్వర్యంలో రైల్వే పోలీసులు శనివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం రాత్రి ట్రాక్‌మెన్‌ బి కొండయ్య స్టేషన్‌ నుంచి మొదటి దఫా రౌండ్‌కు చెకింగ్‌కు వెళ్లాడు. కావలికి ఉత్తరం వైపు ఊరి చివరన ఐదుమంది గుర్తు తెలియని దుండగులు ట్రాక్‌కు అమర్చిన క్లిప్పింగ్‌లను తొలగించడాన్ని గమనించి వారి వద్దకు వెళ్లాడు. ఎందుకు తొలగిస్తున్నారని ట్రాక్‌మెన్‌ అడగడంతో అతనిపై దాడి చేశారు.222/5/3కి.మీ వద్ద చెనై్న వైపు వెళ్లే అప్‌లైన్‌ నుంచి 13క్లిప్పింగ్‌లను తొలగించి అపహరించారు. అనంతరం కొండయ్య విషయాన్ని హుటాహుటినా స్థానిక రైల్వే పోలీసులకు సమాచారమందించారు. లైన్‌కు నూతన క్లిప్పింగ్‌లను అమర్చి ముప్పు నుంచి తప్పించినట్లు పోలీసులు తెలిపారు. క్లిప్పింగ్‌లను అపహరించాలనుకుంటే అవి దుండగులకు ఎక్కడయినా దొరుకుతాయన్నారు. కానీ పథకం ప్రకారమే పట్టాలకు ఉన్న క్లిప్పింగ్‌లను తొలగించి రైలు ప్రమాదాలు చేసేందుకే వాటిని తొలగించినట్లు పేర్కొన్నారు. పోలీసులు సకాలంలో స్పందించడం వల్లే విద్రోహ చర్యను భగ్నం చేసినట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో వారితోపాటు బిట్రగుంట రైల్వే ఎసై్స సత్తార్‌, సిబ్బంది ఉన్నారు.

కొనసాగుతున్న ఉద్యమాలు

నెల్లూరు, మేజర్‌న్యూస్‌ ప్రతినిధి : జిల్లావ్యాప్తంగా సమైక్య ఆంధ్ర ఉద్యమాలు కొనసాగుతున్నాయి. సీనియర్‌ కాంగ్రెస్‌నేత, నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి నగరంలో పర్యటించి అన్ని పార్టీలకు చెందిన శిబిరాలను సందర్శించి మద్దతు ప్రకటించారు. రాష్ట్రం ముక్కలు కాబోదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అవసరమైతే తాను రాజీనామాకు సిద్ధమని ఆయన ప్రకటించారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌, ప్రజారాజ్యం పార్టీలు ఉద్యమ కార్యక్రమాలను కొనసాగించాయి. వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ ఆమరదీక్షకు శ్రీకారం చుట్టారు. జనజీవనానికి ఇబ్బందికలగని రీతిలో వివిధ పార్టీలో ఉద్యమాలు కొనసాగిస్తున్నాయి. దుకాణాలబంద్‌, రాస్తారోకోలు, విద్యాసంస్థల మూసివేత వంటి ఉద్యమాలకు దూరంగా ఉండటంతో జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు. ఉద్యమాలు కూడా పూర్తి శాంతియుతంగా జరగడంతో పోలీసులు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే ముందుజాగ్రత్త చర్యగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటుచేశారు. నెల్లూరు నగరంలో రాజీవ్‌గాంధీభవన్‌ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ వద్ద ఆటోలను రివర్స్‌గేర్‌లో నడిపించి నిరసన వ్యక్తం చేశారు. వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ ఆమరణదీక్ష చేపట్టడంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.సమైక్య ఆంధ్ర ప్రకటన చేసే వరకూ నిరాహారదీక్షను కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు. నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరులలో నిరాహార దీక్షా శిబిరాలు కొనసాగాయి. గూడూరులో కాంగ్రెస్‌ నాయకుడు పనబాక కృష్ణయ్య, జిల్లా తెలుగుదేశం పార్టీ కన్వీనర్‌, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు నిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావాన్ని ప్రకటించారు. నెల్లూరు గాంధీబొమ్మ వద్ద మైనారిటీ నేతలు, నాయుడుపేటలో మహిళలు, కావలిలో విద్యార్థులు నిరాహారదీక్షలో పొల్గొన్నారు.

దట్టంగా కమ్మిన పొగమంచు-అవస్థల్లో వాహన చోదకులు

పెళ్లకూరు, మేజర్‌న్యూస్‌: మండలంలోని పూతలపట్టు జాతీయరహదారిపై శనివారం ఉదయం 8గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారిపై ప్రయాణించే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 10అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా పొగమంచు కారణంగా కనిపించని పరిస్థితి ఏర్పడంది. దీంతో ఎక్కడ ప్రమాదాలు సంభవిస్తాయని వాహన చోదకులు తమ వాహనాలను అతి జాగ్రత్తగా నడపవలసి వచ్చింది. కొన్ని చోట్ల రహదారిపై ఈ మంచు కారణంగా వాహనాలను నిలిపివేయగా మంచు కారణంగా పెన్నేపల్లి సమీపంలో లారీ, ఆటో డీ కొన్నాయి. గ్రామాలలోని ప్రజలు దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం 8గంటల వరకు ఇళ్లలోనుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

బాల్యం బందీ - సంక్షేమం ఖైదీ

ఇందుకూరుపేట, మేజర్‌న్యూస్‌:అంచనాలకు అందని రీతిలో పశువులశాలను తలపించే ఓ రేకుల షెడ్డులో నడుస్తున్న ఆ ప్రభుత్వ వసతి గృహంలో భావిభారత పౌరులు బాధామయ జీవితాన్ని గడుపుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన వసతి గృహాలు వారి పాలిట బందిఖానాలుగా మారాయనేందుకు ఆ హాస్టల్‌ దర్పణం పడుతోంది.గాలి, వెలుతురు సరిగా సోకని రేకుల షెడ్లు, శిథిలావస్థకు చేరి నేడో రేపో కూలే స్థితిలోవున్న ఇరుకైన పురాతన అద్దె భవనాలు అపురూపమైన బాల్యం ఇక్కడ బందీగా మారిపోయింది. అన్నెం పున్నెం, ప్రపంచ ఙ్ఞానం తెలియని ఆ చిన్నారులు ఏంపాపం చేశారని వారికీ శిక్ష విధించారు. ఎంత తరచి చూసినా ఓ పట్టాన బోధపడటంలేదు. బాల నేరస్తులకందించే సౌకర్యాలు సైతం ఈ బాలురకు కల్పించడంలేదంటే అతిశయోక్తి కాదు. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం వల్ల జైలును తలపించే ఆ వసతి గృహం అడ్రసు కోల్పోతోంది. జిల్లా సాంఘిక సంక్షేమశాఖకే తలవంపులు తెస్తూ జైలును తలపించే ఈ హాస్టల్‌ మండల కేంద్రమైన ఇందుకూరుపేట ఎంకెఆర్‌ హైస్కూల్‌ వెనుకభాగంలో దర్శనమిస్తోంది. ఆ భవనంలోని చీకటి గదుల్లో సంక్షేమం ఖైదీగా మారింది. బాలుర హాస్టల్‌ కోసం అర్థశతాబ్దం కిందట నిర్మించిన ఈ రేకుల షెడ్డులో వసతుల ప్రసక్తి ఎత్తడం పొరపాటే అవుతుంది. నెలకు సుమారు మూడువేల రూపాయల వంతున ప్రభుత్వం అద్దె చెల్లిస్తున్న ఈ భవనంలో మరుగుదొడ్లు, బాత్‌రూంలు లేనేలేవు.విద్యార్థుల కాలకృత్యాలన్నీ ఆరుబయటే. ఒకేఒక పెద్ద హాలు, వరండాలోనే వంద మంది వరకు విద్యార్థులు సర్దుకోవాల్సిందే. భవనంలోని మూడు గదుల్లో ఒకదానిని వంట కోసం, మరోదానిని స్టోర్‌రూంగా, ఇంకోగదిని ఆఫీస్‌గా ఉపయోగిస్తున్నారు. ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఈ హాస్టల్‌ భవనానికి చుట్టూ ప్రహరీ కూడా లేదు. తలుపులు, కిటికీలు అంతంత మాత్రమే. వర్షం వస్తే భవనంలో కురవని ప్రదేశమే లేదు. వసతిగృహం పరిసరాలను మహిళలు బహిర్భూమిగా ఉపయోగిస్తుంటారు. హాస్టల్‌కు ఒకవైపు దట్టంగా పెరిగిన కంపచెట్లు, మరోవైపు పొలాలు ఉండడంతో విషసర్పాల బెడద ఎక్కువగా ఉంది. ఏళ్లతరబడి చిన్నారులు బందిఖానాలోనే మగ్గుతున్నప్పటికీ అధికారుల్లో ఏమాత్రం చలనం కలగడంలేదు.

విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని రాస్తారోకో

గాంధారి , మేజర్‌న్యూస్‌:ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఆందోళనల్లో విద్యార్థులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తు శనివారం గాంధారిలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి రాస్తారోకో, ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో విద్యార్థులతో పాటు టిఆర్‌ఎస్‌ నాయకులు ముకుందర్‌రావు, సత్యం, సాయిలు, దీలీప్‌రావు, భాస్కర్‌, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Thursday, December 17, 2009

SALTY COFFEE

He met her on a party. She was so outstanding, many guys chasing after her, while he was so normal, nobody paid attention to him. At the end of the party, he invited her to have coffee with him, she was surprised, but due to being polite, she promised. They sat in a nice coffee shop, he was too nervous to say anything, she felt uncomfortable, she thought, please, let me go home.. Suddenly he asked the waiter:

"Would you please give me some salt? I'd like to put it in my coffee."

Everybody stared at him, so strange! His face turned red, but, still, he put the salt in his coffee and drank it.

She asked him curiously: why you have this hobby?

He replied: "when I was a little boy, I was living near the sea, I liked playing in the sea, I could feel the taste of the sea, just like the taste of the salty coffee. Now every time I have the salty coffee, I always think of my childhood, think of my hometown, I miss my hometown so much, I miss my parents who are still living there".

While saying that tears filled his eyes. She was deeply touched.

That's his true feeling, from the bottom of his heart. A man who can tell out his homesickness, he must be a man who loves home, cares about home, has responsibility of home.. Then she also started to speak, spoke about her faraway hometown, her childhood, her family.

That was a really nice talk, also a beautiful beginning of their story. They continued to date. She found that actually he was a man who meets all her demands; he had tolerance, was kind hearted, warm, careful. He was such a good person but she almost missed him!

Thanks to his salty coffee! Then the story was just like every beautiful love story, the princess married to the prince, then they were living the happy life... And, every time she made coffee for him, she put some salt in the coffee, as she knew that's the way he liked it.

After 40 years, he passed away, left her a letter which said: "My dearest, please forgive me, forgive my whole life lie. This was the only lie I said to you---the salty coffee. Remember the first time we dated? I was so nervous at that time, actually I wanted some sugar, but I said salt It was hard for me to change so I just went ahead.

I never thought that could be the start of our communication! I tried to tell you the truth many times in my life, but I was too afraid to do that, as I have promised not to lie to you for anything..
Now I'm dying, I afraid of nothing so I tell you the truth: I don't like the salty coffee, what a strange bad taste.. But I have had the salty coffee for my whole life! Since I knew you, I never feel sorry for anything I do for you. Having you with me is my biggest happiness for my whole life. If I can live for the second time, still want to know you and have you for my whole life, even though I have to drink the salty coffee again".

Her tears made the letter totally wet.

Someday, someone asked her: what's the taste of salty coffee? It's sweet. She replied.

**********

Love is not 2 forget but 2 forgive

Not 2 c but 2 understand

Not 2 hear but 2 listen

Not 2 let go but HOLD ON !!!!

రాజకీయ సంక్షోభానికి టిడిపి, కాంగ్రెస్సే కారణం

కట్టంగూర్‌ మేజర్‌న్యూస్‌ : రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షో బానికి అధికార కాంగ్రెస్‌ పార్టి, ప్రతి పక్ష పార్టి టిడిపి, ప్రజారాజ్యం పార్టి లే ప్రధాన కారణమని జిల్లా బిజెపి అధ్యక్షుడు గోలి మదుసూధ న్‌రెడ్డి ఆరోపించారు. కట్టంగూర్‌ మం డల కేంద్రంలో బుధవారం మండల బిజెపి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పా ల్గోని ఆయన మాట్లాడు తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయం లో రాష్ట్ర కాంగ్ర ెస్‌ ప్రభుత్వం, కేంద్ర యుపిఎ ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదన్నా రు. రాష్ట్ర శాస నసభలో ఒక నిర్ణిత కాల వ్యవది నిర్ణయించకుండా జాప్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర శాసనసభలో తీర్మాణం లేకుండా నేరుగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి వెంటనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని బిజెపి డిమాం డ్‌ చేస్తుందన్నారు.కోస్తా, ఆంధ్ర, ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయడం కాంగ్రెస్‌, టిడిపి, పిఆర్పీ అధినేతలు అడించే నాటకమన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి లిఖిత పూర్వకమైన విధివిధానాలతో రూపొందించిన ఉత్వర్వులును జారి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ పార్టిలు కలిసి పొటిచేసి అధి కారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తు ప్రజలను మభ్యపెడుతూ కాలం గడిపిందన్నారు.కేంద్రంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం త్వరితగతిన పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మాణం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కోరుతూ జిల్లాలో ఈ నెల 18, 19, 20వ తేదిలలో బిజెపి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌, టిడిపి, పిఆర్‌పి అడే నాట కాలను ప్రజలకు తెలియచేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమివే శంలో రాష్ట్ర బిజెపి దళిత మోర్చా కార్యవర్గ సభ్యులు నకిరేకంటి మొగి లయ్య, బిజెపి దళిత మోర్చా అధ్యక్షులు గోలి ప్రభాకర్‌, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ పాల్వాయి బాస్కర్‌, గాదగోని శ్రీనివాస్‌గౌడ్‌, కొమటి బాస్కర్‌, ముడుగు రామ లింగయ్య, యాదగిరి, రాజు, బిక్షపతి, యాదయ్య పాల్గోన్నారు.

బాంబ్‌దాడులతో దద్దరల్లిన బాల్నేపల్లి

దామరచర్ల, మేజర్‌న్యూస్‌: రాజకీయ కక్షలతో అటు ్టడుకుతున్న మండలంలోని బాల్నే పల్లి గ్రామం బాంబు దాడులతో గు రువారం దద్దరిల్లింది. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు బాంబులు, రా ళ్ళు విసురుకుంటూ సుమారు రెం డు గంటలపాటు దాడులకు పాల్ప డ్డారు. ఈ సంఘటనకు సంబంధిం చిన పుర్వాపరాలు ఇలా ఉన్నాయి. గ్రామ సమీపంలో కృష్ణానదిపై నిర్మి స్తున్న టెయిల్‌పాండ్‌కు కంకరను తరలిస్తున్న ఒక టిప్పర్‌ గ్రామంలో ఒక కుక్కను ఢీ కొనడంతో అది అక్క డికక్కడే మృతిచెందింది. తమ కు క్కను చంపేశారంటూ ఒక వర్గం వారు టిప్పర్‌ను రోడ్డుపైనే నిలిపివే శారు.పొలంనుంచి పత్తిబస్తాలను ఎడ్లబండిపై గ్రామంలోకి తీసుకు వస్తున్న మరోవర్గంవారు రోడ్డుపైగల టిప్పర్‌ను పక్కకుతీయాలని కోర డం తో అందుకు వారు నిరాక రించడంతో ఘర్షణ నెలకొన్నది. దీంతో ఒక వర్గంవారు మరొక వర్గం వారిపై బాంబులు, రాళ్ళతో దాడుల కు పాల్పడ్డారు. గ్రామం మొత్తం బాంబుదాడులతో మార్మోగింది, బాంబులు ఎవరిమీద పడుతాయో ఏం జరుగుతుందోనని... ప్రజలు ఇళ్ళల్లోకి దూరి పిల్లలతో గొళ్ళాలు పెట్టుకున్నారు. పాత కక్షలే కారణం: బాల్నేపల్లి గ్రా మంలో ఎంతోకాలంగా వర్గపోరు కొనసాగుతుంది. పార్టీలవారు వర్గా లుగా ఏర్పడి దాడులకు పాల్పడటం జరుగుతుంది. ఈ నేపధ్యంలో ఆగ ష్టు 3వతేధీన గ్రామ సర్పంచ్‌ కె. హరినారాయణ, నీటి సంఘం చైర్మ న్‌ తావూర్యాలను గ్రామంలోని ప్ర త్యర్థివర్గం దారుణంగా నరిి చం పారు. ఇటీవల బైల్‌పై నిందితులు విడుదల కావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కుక్కను అడ్డుపెట్టు కొని ఒకరిపై ఒకరు బాంబులతో దా డులు చేసుకున్నారు.
పోలీసుల తనిఖీలు...బాంబుదాడుల నేపధ్యంలో గ్రా మంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ లు నిర్వహిస్తున్నారు. ఇళ్లు.. ఇళ్ళు తిరుగుతూ బాంబులు, ఇతరత్రా మారణాయుదాలు ఏవైనా ఉన్నాయే మోనని పరిశీలిస్తున్నారు. మిర్యాల గూడ డిఎస్పీ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యం లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బందోబస్తు... బాంబుదాడుల నేప ధ్యంలో గ్రామంలో ఎలాంటి అ వాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వాడపల్లి ఎస్‌ఐ. నాగదుర్గాప్రసాద్‌, మిర్యాలగూడ రూరల్‌ ఎస్‌.ఐ రవీందర్‌, హాలియా ఎస్‌ఐల ఆధ్వర్యంలో గ్రామంలో బందోబస్తు నిర్వహిస్తున్నారల్లి

తెలంగాణ కోసం న్యాయవాది ఆత్మహత్య

మోత్కూరు, మేజర్‌న్యూస్‌ : తెలంగాణప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుకు సమైక్యాంధ్ర ఉద్యమం ఆటంకం అవుతుందనే మనస్తాపంతో మం డలంలోని దాచారం గ్రామానికి చెం దిన రంగారెడ్డిజిల్లా ఎల్‌బినగర్‌ కో ర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న తెలంగాణవాది ఎండ్లపల్లి దయాకర ్‌రెడ్డి (40)తననివాసంలో ఉరివేసు కొని ఆత్మహత్యకు పాల్పడడంతో మండలంలో విషాదచ్ఛాయలు అలు ముకున్నాయి.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం జరిగే పోరాటా లలో తెలంగాణ న్యాయవాదుల సం ఘం నుంచి ప్రధానపాత్ర పోషిస్తు న్నట్లు సమాచారం. కెసిఆర్‌ ఆమ రణ దీక్షతో కేంద్రప్రభుత్వం స్పం దించి ప్రత్యేకతెలంగాణ రాష్ట్ర ఏర్పా టుపై స్పష్టమై ప్రకటన చేయడంతో రంగారెడ్డి జిల్లా ఎల్‌బినగర్‌ కోర్టు న్యాయ వాదులతో దయాకర్‌రెడ్డి విజ యోత్సవర్యాలీని ఆనందోత్సవా లతో నిర్వహించినట్లు సమాచారం. ఇటీవల సీమాంద్రనాయకులు, ప్ర జాప్రతినిధులు సమైక్యాంధ్ర కోసం చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసం హరించుతాయనే భాద దయాకర్‌ ్‌రెడ్డిలో కల్గి మనోవేధనగా ఉన్నట్లు తెలిసింది.తనఆత్మహత్య కొంతవరకైనా తెలంగాణప్రజలలో ఉన్న బల మైన ఆకాంక్షను ప్రభుత్వానికిచూపి మే ల్కొల్పుతుందనే ఉద్ధేశ్యంతో మరణ వాంగ్మూలాన్ని రాసుకుని తమ జేబు లో పెట్టుకొని బుధవారం రాత్రి తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మ హ త్యకు పాల్పడినట్లు బందువులు తెలి పారు. దయాకర్‌రెడ్డి మరణ వా ర్తతో స్వగ్రామం దాచారంలో విషాద చ్ఛాయలు అలుముకున్నాయి. ద యాకర్‌రెడ్డికి ఇద్దరు పిల్లలు ఉన్నా రు. భార్యవాసవి తల్లిదండ్రు లు కొండల్‌రెడ్డి, లక్ష్మమ్మలు కన్నీరు మున్నీరుగా విలపించడం ప్రజలను కంట తడిపెట్టించింది.
దాచారంలో అంత్యక్రియలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంగా ప్రాణత్యాగంచేసిన న్యాయ వాది దయాకర్‌రెడ్డి అంత్యక్రియలు గురువారం మండలంలోని స్వగ్రా మమైన దాచారంలో నిర్వహించా రు. టిఆర్‌ఎస్‌ శాసనసభపక్ష నాయ కుడు ఈటలరాజేందర్‌, పార్టీపోలిట్‌ బ్యూరో సభ్యుడు గుంతకళ్ళ జగదీ శ్వర్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ నాయకులు కల్వల ప్రకాష్‌రాయుడు, జిలా ్లప్ర దాన కార్యదర్శి కంచర్ల రామ కృష్ణా రెడ్డి, మంచగోవర్ధన్‌, యాకూబ్‌రెడ్డి, శ్రీనివాస్‌తో పాటు తదితరులు పా ల్గొని మృతదేహానికి పూలమాలలు వేసి సంతాపాన్ని ప్రకటించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఉప్పెనలా ఉద్యమం

నెల్లూరు: సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్యేల మొదలు స్థానిక ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజానీకం వరకూ అందరూ తరతమ బేధాలు మరచి చేపట్టిన ఉద్యమం రోజురోజుకీ ఉధృతమై ఉప్పెనలా మారుతోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ రాజకీయ పక్షాల, విద్యార్థి సంఘాల ఆందోళన, నిరసన కార్యక్రమాలు గురువారం కూడా కొనసాగాయి. నగరంలోని కెవిఆర్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన ఏడుగురు ఎంపీలతో పాటు కేంద్ర మంత్రి చిదంబరం, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డిల తొమ్మిది తలల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వీరంతా వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్‌ చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారం కూడా కొనసాగాయి. ఎప్పుడూ ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరుకునే ప్రత్యర్థి పార్టీల నేతలు తమ ప్రత్యర్థి పార్టీ చేపట్టే నిరాహారదీక్షలకు హాజరై తమ సంఘీభావం తెలపడం విశేషం. ఈనెల 21, 22, 23 తేదీలలో సీమాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేల బృందం నెల్లూరు జిల్లాలో పర్యటించనుంది.

గ్రామస్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లడమే తమ ధ్యేయమని మాజీ మంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు. పార్టీలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు సైతం తమ మద్దతు తెలపడం విశేషం. ముఖ్యంగా ఆటో, టాక్సీ డ్రైవర్లు తమ వాహనాల ముందు భాగంలో సమైక్యాంధ్ర కావాలనే బ్యానర్లను ప్రదర్శిస్తున్నారు. కళాకారులు సైతం ఉద్యమంలోకి అడుగుపెట్టారు. నగరంలో 5గురు కార్పొరేటర్లు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీవ్‌ భవన్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నగరంలో వినూత్న నిరసనలు చేపడుతున్నట్లు డిపిసి సభ్యుడు వైవి రామిరెడ్డి ప్రకటించారు. టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌ వద్ద టీడీపీ కార్యకర్తలు పొర్లుదండాలు పెడుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

ఈనెల 25న జిల్లాకు చిరంజీవి

ఫత్తేఖాన్‌పేట: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఈనెల 25వ తేదీ జిల్లాకు రానున్నారు. సమైక్యాంధ్రకు మద్దతు పలికిన చిరంజీవి తదుపరి కార్యాచరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు నిర్ణయించారు. తొలుత తిరుపతిలో తన పర్యటనను ప్రారంభించే ఆయన ఈనెల 25న నెల్లూరుజిల్లాలో పర్యటించనున్నట్లు పిఆర్‌పీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే జిల్లాలో సమైక్యవాదన ఉద్యమరూపంలో ఉధృతంగా జరుగుతున్న తరుణంలో ఆ వాదనకు మద్దతు తెలిపేందుకు వస్తున్న చిరంజీవికి భారీ స్థాయిలో స్వాగత ఏర్పాట్లు చేసేందుకు పిఆర్‌పీ వర్గాలతో పాటు సమైక్యవాదులు సిద్ధమవుతున్నారు.

సమాజంతోపాటు కుటుంబాన్ని గుర్తుంచుకోండి

భక్తవత్సలనగర్‌ (నెల్లూరు):సమాజం కోసం జర్నలిస్టులు కలం పట్టి పనిచేయడమే కాకుండా స్వయంగా ఆరోగ్య పరిరక్షణకు, కుటుంబ సభ్యుల పోషణ పట్ల కూడా శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్‌ కె.రాంగోపాల్‌ జర్నలిస్టులకు సూచించారు. బుధవారం ఉదయం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ఇటీవల దివంగతులైన ఆంధ్రజ్యోతి విలేకరి హనీఫ్‌, చైతన్యజ్యోతి సాయంకాల దినపత్రిక ఎడిటర్‌ కె.చెంగళరాజుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో జిల్లా కలెక్టర్‌ కె.రాంగోపాల్‌ అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జర్నలిస్టులనుద్దేశించి మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం కలంపట్టి పనిచేసే జర్నలిస్టులు వారి ఆరోగ్యం గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచన చేయాలని పేర్కొన్నారు. జర్నలిస్టులు 24 గంటలు శ్రమిస్తూ తరచూ అనేక వత్తిడులకు గురవుతున్నారని, దాని నుండి బయటపడి ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఒక గంటసేపు యోగా, కాలి నడక, వ్యాయామాలను చేయడానికి సమయాన్ని కేటాయించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు దివంగత విలేకరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమం ఎపియుడబ్ల్యుజె ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, అధ్యక్షులు ఎ.జయప్రకాష్‌, భాస్కర్‌రెడ్డిల అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటసుబ్బయ్య, శ్రీరామచంద్రమూర్తి, చలపతి, కృష్ణాపత్రిక రిపోర్టర్‌ సుధాకర్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, ప్రింట్‌ మీడియా పాత్రికేయులు, సభ్యులు పాల్గొన్నారు.

Wednesday, December 16, 2009

ఆ బడికి.... నలుగురే విద్యార్థులు

ఆత్మకూరు:ప్రభుత్వం ఓ వైపు సంపూర్ణ అక్ష్యరాస్యత కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆ లక్ష్యం నీరుగారిపోతోంది. మండలంలోని వెన్నవాడ గ్రామ దళితవాడలో పాఠశాలను చూస్తే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది. వివరాల్లోకి వెళ్లితే.... వెన్నవాడ దళితవాడలోని సామాజిక భవనంలో విద్యాభ్యాసం కొనసాగుతోంది. అక్కడ 20 కుటుంబాలు దళితులు జీవనం గడుపుతున్నారు. అయితే అక్కడ పని చేసే ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేయకపోవడమే నేడు ఆ పాఠశాల కేవలం నలుగురి విద్యార్థులకే పరిమితమైందని చెప్పవచ్చు. గతంలో పని చేసే ఉపాధ్యాయుడు సక్రమంగా పని చేయలేదని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం నూతన పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే ఆ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. స్థానికంగా ఓ వ్యక్తి భవనాన్ని నిర్మిస్తూ అనారోగ్యానికి గురై అక్కడ పని చేసే ఉపాధ్యాయునికి బాధ్యతలు అప్పగించారు.

అయినా ఆ భవనం పూర్తి కాలేదు. దీంతో కాలనీకి అవసరమైన సామాజిక భవనమే పాఠశాలగా మారింది. వర్షం వస్తే నిలిచే పరిస్థితి లేదు. కేవలం పది మంది విద్యార్థులు అక్కడ హాజరవుతున్నట్లు రికార్డులు చెబుతుంటే కేవలం ఐదుగురు ప్రతి రోజు బడికి వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓ ఉపాధ్యాయుడు అక్కడ పని చేస్తున్నాడు. విద్యార్థులు ఎందుకు లేరని ప్రశ్నిస్తే ఉండేది పది మందే, నేడు వచ్చింది ఐదుగురు మాత్రమేనని తాను వచ్చిన తర్వాత సామాజిక భవనంలో విద్యాబోధనకు అవసరమైన సమాచారాన్ని ఏర్పాటు చేయించానని ఉపాధ్యాయుడు వివరించారు. ప్రతి నెలలో విద్యాశాఖాధికారి కొన్ని పాఠశాలలను తనిఖీ చేయాలి. ఎమ్మార్పీలు కొన్నిపాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉంది. అయితే ఆ గ్రామంలో దళితకాలనీలో చిన్నారుల అగచాట్లను ఏ అధికారి పరిశీలించినట్లు లేదు.



నిరుపయోగంగా మరుగుదొడ్లు

అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనానికి మరుగుదొడ్లు మంజూరయ్యాయి. పనులు పూర్తి చేశారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే పాఠశాల భవనాన్ని పట్టించుకున్న దాఖల్లేవు. మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన అధికారులు సమీపంలో ఉండే పాఠశాల కనిపించకపోవడం అధికారుల పనితీరును ప్రశ్నిస్తుంది.


ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి

మండలంలో విద్యాబోధనపై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. గతంలో అక్కడ పని చేసే ఉపాధ్యాయుడు పనితీరు ఇందుకు కారణమని స్థానికులు అంటున్నారు. మరి వేలకువేలు ప్రభుత్వ సొమ్మును జీతాలుగా తీసుకుంటూ కేవలం నాలుగైదుగురికి చదువు చెబుతూ ఉపాధ్యాయులు కాలం గడుపుతున్నారు. మరి ఇలా అయితే ప్రభుత్వ లక్ష్యం ఎలా నెరవేరుతుంది. ఇకనైనా స్పందించి అసంపూర్తి భవనాన్ని పూర్తి చేయాలి. ఆ కాలనీలో చిన్నారులందరు బడికి వచ్చేలా అవగాహన కల్పించాలి. మరి ఎప్పటికి ఇలా జరుగుతుందో చూడాల్సి ఉంది

సమైక్యాంధ్రే ధ్యేయం

నెల్లూరు: సమైక్యాంధ్రే ధ్యేయంగా ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌లో రిలే నిరాహారదీక్షా శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరంలో దీక్షకు పాల్గొన్న సోమిరెడ్డి మాట్లాడుతూ అనాలోచిత నిర్ణయం తీసుకోవడంలో తొందరపాటుగా వ్యవహరించిన కేంద్రప్రభుత్వం ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతున్నా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తోందని ధ్వజమెత్తారు. అన్ని రాజకీయ పక్షాల నేతలు పార్టీలకతీతంగా సమైక్యాంధ్రే ఉండాలంటూ తెలంగాణాను విభ జనను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తమ పార్టీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాలలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతాయని, ఒక్కో రోజు ఒక్కో అనుబంధ సంఘ నేతలు ఈ దీక్షలో పాల్గొంటారని అన్నారు.

ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ద్విగుణీకృతం చేసిన దివంగత నందమూరి తారక రామారావు ఎప్పుడూ ఆంధ్రులంతా సమైక్యంగా ఉండాలనే కోరుకున్నారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత టీడీపీ కార్యకర్తలతో పాటు ఆయన అభిమానులపైనా ఉందన్నారు. ఈ శిబిరంలో టీడీపీ నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నూనె మల్లికార్జునయాదవ్‌, తాళ్లపాక అనూరాధ, వై.వి.సుబ్బారావు, మండవ రామయ్య, అంచెల వాణి, కె.వి.శేషయ్య, బొమ్మి సురేంద్ర, కోడూరు కమలాకర్‌రెడ్డి, సోమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tuesday, December 15, 2009

ఐరన్‌ఓర్‌లారీలతో హడలిపోతున్న డ్రైవర్లు

రాపూరు: రాపూరు-చిట్వేల్‌ ఘాట్‌రోడ్డులో ఐరన్‌ఓర్‌లారీల జోరుతో ఆర్‌టీసి డ్రైవర్లు హడలిపోతున్నారు. నిత్యం రాపూరు నుండి కడపజిల్లాకు చిట్వేల్‌ మీదుగా పెద్దసంఖ్యలో ఈ వాహనాలు తరలిపోతున్నా వాటికి కళ్ళెం వేయలేకపోతుండటం గమనార్హం. అయితే ఈ వాహనదారులవల్ల నిత్యం రాపూరు-చిట్వేల్‌ ఘాట్‌లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ లారీలు ఇష్టానుసారం అతివేగంగా తిరుగుండటంతో వాటిని ఆపి కంట్రోల్‌ చేసేవారులేక పోవడం విశేషం. రాపూరు-చిట్వేల్‌ ఘాట్‌లో ముందే ప్రమాకర మలుపు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని డ్రైవర్లు ఆప్రమత్తమంగా వ్వవహరిస్తున్నారు. అయితే ఆర్‌అండ్‌బిశాఖ ఇక్కడ మాత్రం ప్రమాద సూచిక బోర్డులు, జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టకపోవడంతో డ్రైవర్లు అల్లాడిపోతున్నారు.

భారీ వాహనాలు ఈ మార్గాన్ని ఎన్నుకోవడంతో ఈ ప్రాంతంలో వాహనదారుల వేగానికి అడ్డుకట్ట వేయలేకోయింది. రాపూరు-చిట్వేల్‌ ఘాట్‌లో ఏదైన ప్రమాదాలు జరిగిన స్పందించేవారు లేకుండా ఉన్నారు. అలాగే ఎదైన ప్రమాదం జరిగినా అక్కడ సెల్‌టవర్లుకూడా పనిచేయకుండా ఉన్నాయి. ఈ విధంగా అనేక సమస్యలు ఘాట్‌లో ఉన్నాయి. రోడ్డుకూడా సక్రమంగాలేకపోవడంతో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలు ఘాట్‌లో విలయతాండవం చేస్తుంటే అధికారులు మాత్రం వీటిపై దృష్టిపెట్టేవారు లేరని ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు దీనిపై దృష్టిపెట్టవలసిన అవసరం ఎంతైనావుంది.

పెచ్చులూడి టీచరు, విద్యార్థినికి గాయాలు

రాపూరు: మండల కేంద్రమైన రాపూరులోని హింధూ ప్రాధమిక పాఠశాల భవనం ఒరండా పెచ్చులూడి పఠాన్‌ గౌస్‌మెహిద్దీన్‌ అనే ఉపాధ్యాయునిి , 1వ తరగతి చదివే ఉప్పలపాటి అనిత అనే విద్యార్థినికి తలకు గాయాలైనాయి. వివరాల్లోనికి వెళితే. హింధూ ప్రాధమిక పాఠశాల భవనాలు శిధిలావస్థకు చేరుకున్నాయి. దీనికి తోడు భవనాలపైన వర్షపునీరు చేరివుంది. దీంతో అక్కడక్కడా పెచ్చులూడ సాగాయి. 1వ తరగతి ఒరండాలో జరుగుతుండగా ఒక్కసారిగా పెచ్చులూడి ఆ ఉపాధ్యాయుని తలపై పడటంతో అతనికి తీవ్రగాయంకాగా, పక్కనేవున్న అనితకు స్వల్పగాయమైంది.

దీంతో మరో టీచర్‌ నాదానందరావు అతన్ని రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తీసుకెళ్ళారు. సమాచారం తెలుసుకున్న రాపూరు ఎంపిడిఒ ఇ వాణి సంఘటన స్థాలనికి చేరుకొని జరిగిన సంఘటనపై ఆ స్కూల్‌ హెచ్‌ఎం వై నాగభూషణంను అడిగి తెలుసుకున్నారు. వెంటనే విద్యార్థులను ప్రశ్నించగా హెచ్‌ఎం అక్కడ క్లాసులు నిర్వహించవద్దని చెప్పారని తెలిపారు. అయితే ప్రత్యాన్మాయం లేకపోవడంతో అక్కడ క్లాసులు నిర్వహించినట్లు వారు తెలిపారు.

ఆమె జడ్పీ సిఇఒ రామిరెడ్డికి జరిగిన సంఘటనపై తెలిపింది. అనంతరం ఆయన జిల్లా విద్యాశాఖాధికారి ఆంజనేయుల దృష్టికి తీసుకొని పోవడంతో ఆయన ఎంఇఒ కె జగదీశ్వర్‌ను జరిగిన సంఘటనపై ప్రశ్నించారు. సమాచారం తెలుసుకున్న ఎంఇఒ జరిగిన సంఘటనపై ఉపాధ్యాయులను అడిగి తెలుకున్నారు. అనంతరం గాయపడ్డ బాలికను పరిశీలించారు. గురువారం నుండి ఆ పాఠశాలలో ప్రత్యాన్మాయ చర్యలు తీసుకొని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎంఇఒ తెలిపారు. గాయపడిన టీచరు మెరుగైన వైద్యంకోసం నెల్లూరు తరలించారు. ఈ కార్యక్రమంలో రాపూరు విఆర్‌ఒ ఎం రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు

ద్విచక్ర వాహనాల చోరీలకు అంతేది?

నెల్లూరు(క్రైం) : నగరంలో రోజు రోజుకూ ఏ మూల చూసినా ద్విచక్ర వాహనాల చోరీలు ఎక్కువైనాయి. వీటిని అరికట్టడానికి అంతే చిక్కడం లేదు. ప్రతి రోజూ నగరంలోని పోలీస్‌ స్టేషన్‌ పరిధుల్లో ద్విచక్ర వాహనాలు పోయినాయని కేసులు నమోదు కావడం పరిపాటైపోయింది. కొంతమంది వాహనాలు పోగొట్టుకున్నవారు నిరాశతో కేసు పెట్టకుండా మానుకుంటున్నారు. ఒకవేళ వాహనం పోయిన వ్యక్తి కేసు పెట్టడానికి క్రైం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే వచ్చిన వ్యక్తిని ఏదో క్రైం చేసినవాడిలాగా చూస్తున్నారని పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.

4వ నగర పరిధిలో గత ఏడాది మోటార్‌ సైకిల్‌ పోగొట్టుకున్న వ్యక్తి దొంగను పట్టించి వాహనం ఎక్కడున్నది కూడా వివరాలు అందజేస్తే దాని విషయంలో అధికారి ఒకరు చొరవ చూపించి ఆమ్యామ్యాలతో కేసును మాఫీ చేసినట్టు సమాచారం. నగర పరిధిలో ఐదు లా అండ్‌ ఆర్డర్‌, క్రైం పోలీస్‌ స్టేషన్‌లతోపాటు బాలాజీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లలో పనిచేస్తున్న మొత్తం సిబ్బంది వందల సంఖ్యలో ఉన్నారు. అయితే ఈ స్టేషన్ల పరిధుల్లో ఎవరైనా చోరీ చేస్తూ అతని దురదృష్టవశాత్తు పోలీసులకు చిక్కితే ఆ స్టేషన్‌ అధికారులు అతన్ని ఏమీ అనకుండా నేరుగా సిసిఎస్‌ స్టేషన్‌కు హ్యాండ్‌ఓవర్‌ చేసి తమ పనైపోయింది బాబు అంటూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ స్టేషన్‌లలో సీనియర్‌ పోలీస్‌ సిబ్బందేగాక, అత్యధిక విద్యావంతులు, తెలివిగలవారు ఉన్నప్పటికీ వారి పనితీరు బాగుండదనా లేక వారి సేవలు అనవసరం అన్నట్లుగా ఉంటున్నది. కేవలం నగరాన్ని శాసిస్తూ సిసిఎస్‌లో ఏళ్లతరబడి పాతుకుపోయిన ఆ నలుగురూ... చేసే సేవలే తప్ప మిగిలినవారివి తీసుకోవడంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో గొప్పగొప్ప చదువులు చదివి పోలీసు ఉద్యోగంలో చేరినటువంటి యువతకు తమ ప్రతిభా పాటవాలను చూపించుకునే అవకాశాన్ని సిసిఎస్‌ ఇవ్వడం లేదు.

కేవలం అప్పుడెప్పుడో చేసిన రికవరీలు ఆధారంగా వారే గొప్ప అన్నట్లు, వారు లేందే మాకు దిక్కెవరు అంటున్న అధికారులు సైతం సిసిఎస్‌లో చూడవచ్చు. సినిమాల్లో ఎవరైనా ఒక పాత్ర వేస్తే ఆ పాత్రే వారికి జీవితాంతం దిక్కన్నట్లు సిసిఎస్‌లో కొలువుదీరివున్న సీనియర్‌ పోలీస్‌ సిబ్బంది బదిలీపై నగరంలోనే ఏదో ఒక స్టేషన్‌కు వె ళ్లినా, వారి కొలువులు మాత్రం సిసిఎస్‌లోనే చేయడం ఆనవాయితీ. ఇప్పటికే ఉడుకు రక్తానికి క్రైం ఇన్వెస్టిగేషన్‌ చేయడానికి అవకాశం ఇవ్వడంలేదని విమర్శలు ఉన్నాయి. నగరంలో ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా చోరీలు చేస్తూ ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ తమ చేతి వాటాన్ని ప్రదర్శించుకుంటున్న చోరీగాళ్లను పట్టుకోవడంలో విఫలమవుతున్న క్రైం పోలీసులు పాత పద్ధతులు వదలి నూతన ఒరవడికి అవకాశం ఇస్తే బాగుంటుందని పలువురి అభిప్రాయం.

28 నుంచి రొట్టెల పండుగ

నెల్లూరు : నెల్లూరు నగరంలో ముస్లింలు, ముస్లిమేతరులు మతసామరస్యానికి ప్రతీకగా ఆచరించే రొట్టెల పండుగ ఈ నెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. స్థానిక బారాషాహిద్‌ దర్గా వద్ద ఆదివారం ఉదయం వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం మెరుగైన సదుపాయాలతో, అంకిత భావంతో భక్తులకు సేవలు కల్పించి రొట్టెల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆయన అన్నారు. దర్గా ఆవరణంలో లే అవుట్‌ ప్రకారం 293 అంగళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేలంద్వారా పొందిన షాపులను నిర్ణీత స్థలాల్లోనే ఏర్పాటు చేసుకోవాలన్నారు.

ఖాళీ ప్రదేశాన్ని ఆక్రమించకూడదని ఆయన పేర్కొన్నారు. 24 గంటలూ భక్తులకు తాగునీటి వసతి సదుపాయం, ఉచిత వైద్యసేవలు, విద్యుత్‌ దీపాలు, పారిశుద్ధ్య చర్యలు, గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సౌకర్యాలు తదితర అంశాల ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులతో సమాలోచనలు చేశారు. నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నగరానికి ప్రత్యేకతను సంతరింపచేసిన రొట్టెల పండుగకు దేశ, విదేశాల నుండి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదని వివిధ శాఖల అధికారులను కోరారు.

డిఎస్‌పి రాధిక మాట్లాడుతూ రొట్టెల పండుగ జరిగే రోజుల్లో అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా భారీ పోలీసు బలగంతో రక్షణ, ట్రాఫిక్‌ నియంత్రణ, నేరాలను అదుపు చేయుట తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపడుతున్నామన్నారు. వాహనాల పార్కింగ్‌కు పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇద్దరు సిఐలు, నలుగురు ఎస్‌ఐలు, 40 మంది సబ్‌ఇన్స్‌పెక్టర్లు, 180 మంది ఎఎస్‌ఐలు, 500 మంది పోలీస్‌ కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులు, 40 మంది ఆర్మ్‌డ్‌ పోలీసులను నియమిస్తున్నట్లు తెలిపారు. మేయర్‌ భానుశ్రీ మాట్లాడుతూ లక్షలాదిమంది భక్తులు పాల్గొనే ఈ రొట్టెల పండుగకు ఒక రోజు ముందునుండే మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బందితో పారిశుద్ధ్య కార్యక్రమాలను 24 గంటలూ చేపడతామన్నారు. సిబ్బంది మూడు షిఫ్ట్‌లుగా విధులు నిర్వహిస్తూ ప్రతి షిఫ్ట్‌లోనూ 150 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేసే విధంగా ప్రణాళికను రూపొందించామన్నారు.



హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక ఆహ్వానితులు

ఈ ఏడాది రొట్టెల పండుగ వేడుకలకు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షులు చిరంజీవి, మజ్లిస్‌ పార్టీ ఎమ్మెల్యే అసుదుద్దీన్‌ ఓవైసి, వక్ఫ్‌ బోర్డు రాష్ట్ర నాయకులు, బారాషాహిద్‌ దర్గాకు సంబంధించిన పలువురు ప్రముఖులు పాల్గొంటారు. నెల్లూరు డివిజనల్‌ రెవెన్యూ అధికారి ఎం.వేణుగోపాల్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ టిఎస్‌ఆర్‌.ఆంజనేయులు, ఎంఆర్‌ఒ భక్తవత్సలం, వివిధ శాఖల ప్రభుత్వాధికారులు, పలువురు మున్సిపల్‌ కార్పొరేటర్లు, వక్ఫ్‌బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

విజయేశ్వరిదేవికి ఘనస్వాగత

రాపూరు: రాపూరు మండలం పెంచలకోనలోని భగవతి శ్రీశ్రీశ్రీ విజయేశ్వరిదేవి 5వ పార్లమెంట్‌ ఆఫ్‌ వరల్డ్‌ రిలీజియన్‌ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ సిటీ మహాసభలో భారతదేశం తరపున తొలి మహిళా భారతీయురాలిగా ప్రసంగించి తిరిగి రావడంతో ఆదివారం ఆమెకు గూడూరు నుండి భారీ ర్యాలీతో రాపూరుకు చేరుకున్నారు. అడుగడుగా ఆమెకు విద్యార్థులు ప్లే కార్డులతో ఘనస్వాగతం పలికారు. అలాగే ఆమెను చూసేందుకు మహిళలు పెద్దసంఖ్యలో రాగ ఈప్రాంతమంతా మేళతాళాలతో కోలాహలం నెలకొంది. ఆమె స్థానిక సిద్దలయ్య దేవాలయ సెంటర్లో ప్రసంగించారు. వందకోట్ల భారతీయుల తరపున తొలి ఇండియా మహిళగా ప్రసంగించడం జరిగిందన్నారు. హిందూ మతానికి సంబంధి స్ర్తీల గురించి వివరించానన్నారు. తాను చేసిన ప్రసంగంపై విశేషస్పందన లభించిందన్నారు. అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆమె కోరారు. ఆమె ప్రసంగించిన కొద్ది సమయానికి పెద్దసంఖ్యలో జనం గుమికూడినారు. పట్టణంలో ఆమెకు స్వాగతం పలుకుతున్న ఫ్లెక్సీబోర్డులు ఆకర్షణగా నిలిచాయి.

కండలేరు జలాశయం వద్ద ఉద్రిక్తత

రాపూరు‌: కేసీఆర్‌, చిదంబరం, పిళ్లైలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, టిడిపి నాయకులు మరికొందరు శనివారం చెనై్నకు గంగ నీటిని నిలుపుదల చేసిన కొన్ని గంటల్లోనే అధికారులు చెనై్నకు గంగ నీటిని విడుదల చేయడంతో కండలేరు జలాశయం వద్ద ఉద్రక్తత వాతావరణ నెలకొంది. సమైక్య నినాదంతో ఆందోళనకారులు ఆదివారం ఉగ్రరూపం దాల్చారు. కండలేరు జలాశయం హెడ్‌రెగ్యలేటర్‌ నుండి సాయిగంగ కాలువ ద్వారా 2వేల క్యూసెక్కుల నీటిని శనివారం రాత్రి 8గంటలకు గంగ అధికారులు గుట్టచప్పుడు కాకుండా విడుదల చేశారు. ఆదివారం సమాచారం తెలుసుకున్న రాపూరు ఎంపిపి సూర్యప్రకాష్‌యాదవ్‌, కాంగ్రెస్‌ నాయకులు ఎస్‌కె ముక్తియార్‌, తెలుగుదేశం నాయకులు దందోలు వెంకటేశ్వర్లురెడ్డి, ఆర్‌ రామచంద్రయ్య, మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకోసం తాము పోరాడుతుంటే అధికారులు నిర్లక్ష్యంగా మళ్ళీ చెనై్నకు గంగ నీటిని తరలించడమేమిటని ప్రశ్నించారు. హెడ్‌రెగ్యులేటర్‌ వద్దగల డోమ్‌లైట్లు, కిటికీ అద్దాలు పగులకొట్టారు. సిబ్బంది మంచాలను ధ్వంసం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో వాగ్వివాదానానికి దిగారు. ఆందోళనకారులు నీరు విడుదలచేసే యంత్రాలను నిలిపివేశారు. సమాచారం తెలుసుకున్న పొదలకూరు సిఐ అబ్దుల్‌ కరీమ్‌, రాపూరు, కండలేరు డ్యామ్‌ ఎస్‌ఐలు జయరావు, చంద్రశేఖర్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన కారులకు సర్థిచెప్పారు. గంగను చెనై్నకు నిలిపివేయడంతో శాంతించారు. అయితే అధికారులు ఉత్తర్వుల మేరకు ఆదివారం నుండి చెనై్నకు కండలేరు నుంటి నీటి విడుదల నిలిపివేస్తామని డిఇ ఎంఎ సుబ్రహ్మణ్యం తెలిపారు.

మార్మోగిన ఘంటానాదం

భక్తవత్సలనగర్‌ (నెల్లూరు):ప్రత్యేక తెలంగాణా పట్ల కేంద్ర ప్రభుత్వ హామీని తక్షణమే ఉపసంహరించుకోవాలని జడ్పీ చైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. నగరంలోని గాంధీబొమ్మ వద్ద సోమవారం ఎన్‌ఎస్‌యుఐ, యూత్‌ కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఘంటానాదంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య ఆంధ్రాను సాధించుకోడానికి అందరిపై బాధ్యత ఉందని తెలిపారు. తెలుగుభాష మాట్లాడేవారి కోసమే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కొందరు విచ్ఛిన్న శక్తులు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని, విద్యార్థి లోకం తరలి వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తమ ప్రాంతాల ప్రజల మనోభావాలను అధిష్టానం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. విద్యార్థి సంఘాలు శాంతియుతంగా ఉద్యమాలకు ఊపిరి పోయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని వెనక్కు తీసుకునేంతవరకు ఈ ఉద్యమం ఆగదని ఆయన పేర్కొన్నారు. అన్ని రాజీకీయ పార్టీలకు అతీతంగా అందరూ సమైక్య ఆంధ్రా కోసం పోరాడాలని ఆయన కోరారు. సిటీ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలలో ఎక్కువశాతం సమైక్య ఆంధ్రానే కోరుకుంటున్నారన్నారు. తెలంగాణాలోని రెండు, మూడు జిల్లాలకు మాత్రమే ఈ తెలంగాణా వాదన పరిమితమైందని అన్నారు. ఈ ఘంటానాదం ఉద్యమంతో రోజు రోజుకూ ప్రజలను చైతన్యపరుస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మంత్రులు రాజీనామా చేయాలి-పిసిసి కార్యదర్శి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిసమైక్య ఆంధ్రా కోసం సిఎంతో సహా ఇంకా కొనసాగుతున్న మంత్రులు రాజీనామా చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఆయన కోరారు. కెసిఆర్‌ నిరాహారదీక్ష చేస్తుంటే పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం నేడు ఎంపి లగడపాటి ఆమరణ నిరాహారదీక్షను అడ్డుకోవడం ఎంతవరకు న్యాయమని విమర్శించారు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు కావాలనే తెలంగాణా నినాదాన్ని అంటిపెట్టుకుని వేలాడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళికా మండలి సభ్యులు వైవి.రామిరెడ్డి, కార్పొరేటర్లు స్వర్ణా వెంకయ్య, మదన్‌మోహన్‌రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, రూప్‌కుమార్‌ యాదవ్‌, జడ్పీటిసి సభ్యులు, వీరి చలపతి, యూత్‌కాంగ్రెస్‌ నాయకులు శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌యుఐ నగర అధ్యక్షులు జివి.ప్రసాద్‌, విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సముద్రంలో విద్యార్థి గల్లంతు

వాకాడు:సముద్ర స్నానానికై వెళ్లి తూపిలిపాళెం వద్ద సముద్రంలో బట్టా సునీల్‌ (20) అనే విద్యార్థి సోమవారం గల్లంతయ్యాడు. వాకాడు దళితవాడకు చెందిన బుజ్జమ్మ, బాలయ్యల మూడవ కుమారుడైన సునీల్‌ స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లాడు. సునీల్‌, ఈశ్వరయ్యలు సముద్రంలో దిగగా సముద్రం అలల తాకిడికి ఇద్దరు లోపలకెళ్లారు. దీనిని గమనించిన స్నేహితులు కస్తూరయ్యను మాత్రం రక్షించగలిగారని, సునీల్‌ గల్లంతయ్యాడు. మృతదేహం కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

ఆగని సమైక్య జ్వాలలు

నెల్లూరు,: రాష్ట్ర విభజనను నిరసిస్తూ జిల్లాలో కొనసాగుతున్న ఆందోళన, నిరసన కార్యక్రమాలు రోజురోజుకీ ఊపందుకుంటున్నాయి. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ సంపూర్ణంగా, స్వచ్ఛందంగా జరిగింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం విద్యార్థి సంఘాలు ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలను మూయించారు. ఇప్పటివర కూ చట్టసభల ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్ల, మున్సిపల్‌ కౌన్సిలర్ల రాజీనామాలకే పరిమితమైన నెల్లూరుజిల్లాలో జడ్పీటీసీ, ఎంపీపీల రాజీనామాలకు తెలుగుదేశం పార్టీ సోమవారం శ్రీకారం చుట్టింది.

ఆ పార్టీకి చెందిన 5గురు జడ్పీటీసీ సభ్యులు,ఆరుగురు ఎంపీపీలు సోమవారం తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. నాయుడుపేటలో సమైక్యవాదులు పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి రైల్‌రోకో నిర్వహించారు. ఐదవ నెంబరు జాతీయ రహదారిని కోవూరు, కావలి, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట తదితర జాతీయ రహదారి వెంబడి ప్రాంతాల్లో అఖిలపక్ష నేతలు, సమైక్య వాదులు దిగ్బంధనం చేయడంతో వాహనాలు బారులు తీరాయి. నగరంలోని విఆర్‌సీ, ఆర్టీసీ బస్టాండ్‌ల వద్ద విద్యార్థి సంఘాలు నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో నగర మేయర్‌ ఎన్‌.భానుశ్రీ పాల్గొని తమ మద్దతు పలికారు. గాంధీబొమ్మ సెంటర్‌లో రాజీవ్‌భవన్‌ ఆధ్వర్యంలో జరిగిన వినూత్న నిరసన కార్యక్రమంలో భాగంగా జడ్పీ ఛైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమైక్య ఘంటానాదాన్ని మోగించారు.

ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో నగరంలో సమైక్యాంధ్రను కోరుతూ భారీ స్కూటర్‌ ర్యాలీ జరిగింది. నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిఆర్‌పీ కార్యకర్తలు, సమైక్యవాదులు పాల్గొన్నారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం అన్ని నియోజకవర్గ కేంద్రాలలలో అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించేంత వరకూ తమ ఉద్యమం ఆగబోదని వివిధ సందర్భాలలో అన్ని రాజకీయ పార్టీల నేతలు పేర్కొనడం గమనార్హం.

Friday, December 11, 2009

MENINGITIS

What Is Meningitis?

Meningitis is an inflammation of the meninges, the lining that protects the brain and spinal cord.

It is almost always caused by an infection, usually by a bacteria (bacterial meningitis) or a virus (viral meningitis). In rare cases it can be triggered by a fungus or parasite.

Meningitis occurs most commonly in young children under 5, those aged 17-25 (who often live in close quarters like dormitories and barracks), and people over age 55. People with compromised immune systems, such as people with HIV or AIDS, are also at increased risk.

What Are The Meninges?
The meninges are composed of three layers of membranes enclosing the brain and spinal cord.
Pia mater is the innermost layer. It is akin to a tissue paper that closely adheres to the brain and spinal cord, dipping into the various folds and crevices.

Arachnoid mater is the middle layer. It is a filmy membrane that is joined to the pia mater by fine threads resembling a cobweb.

The dura mater, a parchment-like membrane, lies on the outermost part of the meninges and adheres to the skull and spinal canal.

The cerebral spinal fluid (CSF) is the fluid that circulates in the spaces in and around the brain and spinal cord.

What Happens When The Meninges Swell?
The most frequent cause of meningitis is the entry of a microorganism-such as a bacterium or a virus-from an infection elsewhere in the body. The microorganisms travel through the blood and into the meninges and cerebral spinal fluid.

In the bloodstream, infection-causing microorganisms are fought off by white blood cells, an important part of the immune system. However, there are no white blood cells in the cerebral spinal fluid to fight infectious agents.

Once infectious organisms have entered the cerebrospinal fluid, the body's defenses cannot control their rapid growth and the disease races through the delicate surfaces and fluids of the central nervous system.

As the immune system gears up to fight off the microorganisms, it sends out chemical signals that produce inflammation and interfere with the normal functioning of the central nervous system. That, in turn, causes swelling and increased pressure inside the skull, and disrupts the brain's normal functioning.

What Causes Meningitis?
There are two main forms of meningitis:
(a) bacterial meningitis, and
(b) viral meningitis.

Bacterial meningitis affects fewer people than the viral form, but it often results in more serious health consequences. Bacterial meningitis is fatal in 1 in 10 cases and leaves 1 in 7 survivors with a severe disability caused by brain injury.

Bacterial Meningitis
There are several types of bacterial meningitis. Two types represent the majority of bacterial meningitis cases:
meningococcal
pneumococcal
The bacteria that cause these cases are common and live in the back of the nose and throat, or in the upper respiratory tract.
The bacteria are spread among people by coughing, sneezing and kissing. These bacteria cannot live outside the body for long, so they cannot be picked up from water supplies, swimming pools, or a building's air-conditioning system.
Individuals can carry these bacteria for days, weeks, or months without becoming ill. In fact, about 25 percent of the population carries the bacteria. Only rarely do the bacteria overcome the body's defenses and invade the cerebra spinal fluid, causing meningitis.
Meningococcal meningitis accounts for more than half of all cases of bacterial meningitis in the United States. Meningococcal disease is caused by bacteria called Neisseria meningitidis. There are several strains of Neisseria meningitidis. Strain B causes about 75 percent of the meningococcal cases and has the highest fatality rate.
Pneumococcal meningitis is caused by pneumococcus bacteria, which also cause several diseases of the respiratory system, including pneumonia. It has a fatality rate of about 20 percent. It also results in a higher incidence of brain damage than other forms of the disease.
Other types of bacterial meningitis include:
Neonatal meningitis: This form affects mostly newborn babies and is caused by Group B streptococcus bacteria, commonly found in the intestines.
Staphylococcal meningitis: This is a rare, but deadly form caused by staphylococcus bacteria. It usually develops as a complication of a diagnostic or surgical procedure.
Haemophilus influenza type B (Hib): is caused by haemophilus bacteria. It was once the most common form of bacterial meningitis, and one of the deadliest childhood diseases. However, in 1985, an Hib vaccine was introduced into the routine immunization program for U.S. children and virtually eliminated Hib meningitis in the United States.
Viral Meningitis
Viral meningitis is far more common than the bacterial form and, in most cases, much less debilitating. Most people exposed to viruses that cause meningitis experience mild or no symptoms and fully recover without complications. '
The disease can be caused by many different viruses. Some of the viruses are transmitted by coughing or sneezing or through poor hygiene. Other viruses can be found in sewage polluted waters.
Occasionally, viral meningitis will develop following the mumps or chicken pox. Mosquito-born viruses also account for a few cases each year.
Approximately half of the viral cases in the United States are due to common intestinal viruses, or enteroviruses. These viruses are shed in the feces and in discharges from the mouth and nose. Most people who become infected with the virus contract it through hand-to-mouth contact.

జెఇ వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయాలి

నెల్లూరు, మేజర్‌న్యూస్‌: చిన్నారులకు మెదడువాపు వ్యాధిని రానీయకుండా చేసే జెఇ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో వ్యాక్సినేటర్లు (ఎఎన్‌ఎంలు) అత్యంత శ్రద్ధ వహించి విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ టి.వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నుంచి జిల్లాలో తొలివిడతగా నెల్లూరు, గూడూరు డివిజన్లలో (గ్రామీణ ప్రాంతాలు) జెఇ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించబోవు సందర్భంగా సంబంధిత వ్యాక్సినేటర్లకు స్థానిక టౌన్‌హాల్‌లో బుధవారం మధ్యాహ్నం శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న డాక్టర్‌ వెంకటరమణారెడ్డి వైద్యాధికారులు, వ్యాక్సినేటర్లను ఉద్దేశించి మాట్లాడారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకోవద్దని, ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో అమలు జరిపి విజయవంతం చేయాలని సూచించారు. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడినవారిలో 70 శాతం మంది పిల్లలు చనిపోవడంగాని, పక్షవాతం వంటి వ్యాధుల బారిన పడతారని చెప్పారు. అందువల్ల ముందుగానే వ్యాధిని దరి చేరనీయకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా సంబంధిత వ్యాక్సిన్‌ను భ ద్రపరచే విషయంలో అత్యంత శ్రద్ధ వహించాలన్నారు. ఇటీవల కొన్నిచోట్ల పలు కారణాల వల్ల వ్యాక్సిన్‌ కొంత మేరకు దెబ్బ తిన్నప్పటికీ, వాటి స్థానంలో కొత్త వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందన్నారు.

వ్యాక్సినేటర్లు, వైద్యాధికారులు ఆయా ప్రాంతాల అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, టీచర్ల సహకారం తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఆయా మండలాల విద్యాశాఖాధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం తీసుకోవాలన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒకచోట జెఇ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పోస్టర్లను అంటించాలని, వ్యాధి నివారణ పట్ల తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకుగాను విస్తృతంగా కరపత్రాలను పంచి పెట్టాలన్నారు. ముఖ్యంగా జ్వరం, టిబి, హెచ్‌ఐబి తదితర వ్యాధులు ఉన్నవారిని ముందుగా గుర్తించి అలాంటి వారికి ఈ వ్యాక్సిన్‌ను వేయాల్సిన అవసరం లేదని సూచించారు.
ప్రజల ఆరోగ్యంతో ఆడుకోబోము జెఇ వ్యాక్సిన్‌ వేయగానే కొందరికి సాధారణంగా జ్వరం వస్తుందని దానిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అదేవిధంగా ప్రజలకు ఆరోగ్యసేవలు అందించే విషయంలో అత్యంత శ్రద్ధ వహిస్తామని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడడంతోపాటు వారి ఆరోగ్యంతో ఆటలాడబోమని డాక్టర్‌ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ వెంకటాద్రి మాట్లాడుతూ 1 నుంచి 15 ఏళ్ల లోపు చిన్నారులకు టీకాలు (జెఇ వ్యాక్సినేషన్‌) వేసే విషయంలో వ్యాక్సినేటర్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఉంటే వ్యాక్సిన్‌ వికటించే ప్రమాదముందని హెచ్చరించారు. పిహెచ్‌సిల నుంచి వ్యాక్సిన్‌ను తీసుకెళ్లేటప్పటి నుంచి చిన్నారులకు వ్యాక్సిన్‌ వేసేంతవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వారికి క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ దశరధరామయ్య, క్షయ నివారణాధికారి డాక్టర్‌ సురేష్‌కుమార్‌, జిల్లా లెప్రసీ నివారణాధికారి డాక్టర్‌ సివి.రమాదేవి, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ జయసింహ, జిల్లాలోని పలువురు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అర్హులందరికీ రుణాలుమాఫీ : డీసీసీబీ ఛైర్మన్‌

మహబూబ్‌నగర్‌టౌన్‌, మేజర్‌న్యూస్‌ : కేంద్ర ప్రభుత్వ రుణ విముక్తి పథ కం వర్తించే అర్హులైన రైతులకు రుణాలు మాఫీచేసే అవకాశం కల్పించి నట్లు డీసీసీ బ్యాంకు చైర్మన్‌ వీరారెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రం లోని డీసీసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ ఈ అవకాశం డిసెంబర్‌ చివరి వరకు మాత్రమే ఉన్న ట్లు తెలిపారు. ఐదు ఎకరాలలోపు ఉండి 20వేల లోపు రుణం ఉన్న రైతు లకు పూర్తి మాఫీ చేయబడినట్లు తెలిపారు. ఐదు ఎకరాలకుపై బడి 20 వేల ఆదాయంపై రుణం ఉన్న రైతులకు ఆప్‌కాబ్‌ నుంచి 25 శాతం డీసీసీబీ నుంచి 25 శాతం మాఫీ వర్తింపజేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కరవు జిల్లాగా ఎంపికచేయడంతో కరవు మాఫీగా 20వేలు ప్రభుత్వం నిర్ణయించగా ఆపై ఉన్న రుణాలకు తమ బ్యాంకు తరపున 25 శాతం మా ఫీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉదాహరణకు ఒక రైతు 30వేల రుణం పొం దితే అందులో నుంచి కరవు మాఫీ క్రింద 20వేలు డీసీసీబీ నుంచి ఇచ్చే 25 శాతం మాఫీ పోగా కేవలం రైతు2,500 రూపాయలు మాత్రమే చెల్లి స్తే సరిపోతుందని వివరించారు. ముఖ్యంగా 80వేల లోపు రుణాలు పొందిన రైతులకు 50 నుంచి 100 శాతం మాఫీ వర్తిస్తున్నట్లు తెలిపారు. ఒక లక్ష రూపాయలు రుణం పొం దిన రైతుకు 50వేలు మాఫీ కానున్నట్లు ఈ అవకాశాన్ని రైతులు సద్విని యోగపర్చుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ విముక్తి పథకం క్రింద మొత్తం 16,225 రైతులు లబ్ధిపొందనున్నట్లు తెలిపారు. గతంలో జిల్లాలో 51 కోట్లు రైతుల నుంచి వసూళ్లు చేస్తే 35 కోట్లు వచ్చేవని వీటిని తగ్గించడం వల్ల కేవలం 12.50కోట్లు మాత్రమే రైతుల నుంచి రికవరీ చేసేవీలుందని వివరించారు. ప్రస్తుతం 26 కోట్లు వసూళ్లు చేస్తే రాయితీ పూర్తిగా వర్తి స్తుందన్నారు. ఆర్థికంగా చితికిన రైతులకు ప్రభుత్వం చక్కటి రాయితీ అ వకాశం కల్పించినట్లు తెలిపారు. రుణ మాఫీ అయిన రైతులకు కూడా తి రిగి దీర్ఘకాలిక, స్వల్పకాలిక, పంటరుణాలు చెల్లించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీసీసీబీ ఉపాధ్యక్షులు రాంమోహన్‌రావ్‌, బ్యాంక్‌ సీఇఓ. టిఎన్‌. మధుసూదన్‌ పాల్గొన్నారు.

Wednesday, December 9, 2009

రూ1.49 కోట్లు హ డ్కో నిధులు :గురుకుల కార్యదర్శి రాజు

నాయుడుపేట, మేజర్‌న్యూస్‌: జిల్లాలోని నాయుడుపేట, బుచ్చిరెడ్డిపాళెం సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలకు రూ1.49కోట్లు హడ్కో ద్వార నిధులు మంజూరైనట్లు ఆంధ్రప్రదేశ్‌ సాంఘీక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయ సంస్థ రాష్ట్ర కార్యదర్శి కెఎస్‌ శ్రీనివాసురాజు తెలిపారు. శనివారం నాయుడుపేట బాలికల గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి ప్రిన్సిపాళ్లు, అధికారులు సమీక్షసమావేశం జరిగింది అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమబాట రెండ వ విడతలో భాగంగా రూ88లక్షల మౌలిక వసతులుగాను రూ60లక్షలు నిధులు మంజూరు చేశామని వీటి ద్వార పనులు30రోజులలో ముమ్మరంగా చేయునట్లు వివరించారు.

11 పాఠశాలలో మరుగుదొడ్లు, నీటివసతికి గాను రూ8.5లక్షలు విడుదల అయినట్లు వివరించారు. సూళ్లూరుపేట గురుకుల పాఠశాలలో ఇటీవల ఒక విద్యార్థి మృతి చెందడం పై విలేకరులు ప్రశ్నించగా దానిపై నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అదే పాఠశాలలో అర్హతలేని ఉపాధ్యాయులు నియమించడంపై ప్రశ్నించగా అలాంటి వాటిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు గురుకుల విద్యాలయ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ నరసింహమూర్తి, ప్రిన్సిపాళ్లు పెంచల లక్ష్మీ, వాసు తదితరులున్నారు.

ములుముడిపై అధికారుల డేగ కన్ను

నెల్లూరు రూరల్‌, మేజర్‌న్యూస్‌:జిల్లాలోని సమస్యాత్మక గ్రామాల్లో ఒకటైన ములుముడి పంచాయతీ సర్పంచ్‌ పదవికి ఈ నెల 23న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ గ్రామ పరిస్థితుల పట్ల అటు పోలీసు, ఇటు రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆది నుండి కమ్యూనిస్టులకు పట్టుగల ఈ గ్రామంలో గత సర్పంచ్‌ ఎన్నికల్లో సైతం సిపిఎం పార్టీకి చెందిన అట్ల నరసయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అయితే గ్రామ కక్షలు, వర్గ పోరాటాల్లో భాగంగా ఇటీవల కాలంలో అట్ల నరసయ్య హత్యకు గురి కావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

అయితే ఉప ఎన్నికలో ఇతర పార్టీలు పోటీలో ఉండవని భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టేందుకు ముందుకు రావడంతో ఇక్కడ వాతావరణం వేడెక్కుతుంది. తాము కోల్పోయిన సర్పంచ్‌ పదవిని తిరిగి చేజిక్కించుకునేందుకుగాను అట్ల నరసయ్య వర్గీయులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌కు సైతం ఈ గ్రామంలో అత్యధిక ఓట్లు ఉండడంతో ఈ సారి సర్పంచ్‌ పదవి తమదే అనే ధీమాను కాంగ్రెస్‌ వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యే అభ్యర్థికి అధిక సంఖ్యలో ఓట్లు వచ్చాయి. దీనిని బట్టి బహిరంగంగా కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించలేకున్నా, తమ మనసుల్లోని అభిమానంతో ఓట్లు వేసే అవకాశం ఉన్నందున కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. గ్రామంలో ప్రాబల్యం గల రెండు సామాజిక వర్గాలు, మైనారిటీ ఓట్లు సర్పంచ్‌ విజయాన్ని నిర్ణయించ గలుగుతున్నాయి. అయితే వీరిలో బహిరంగంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేవారికంటే ఎన్నికల రోజున తమ నిర్ణయాన్ని బ్యాలెట్‌ ద్వారా వ్యక్తపరిచేవారే అధికం. దీనిని బట్టి 23వ తేదీ మధ్యాహ్నం నుండి వెలువడనున్న ఫలితాల్లో మాత్రమే ఇక్కడి బలాబలాలు వ్యక్తం కావాల్సివుంది.

అయితే ఈ గ్రామంలో ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామంలో బెల్టుషాపులు, మద్యం విక్రయాలను పూర్తిగా నిరోధించారు. అదేవిధంగా గతంలో నేర చరిత్ర గలవారిని సైతం ముందుగా బైండోవర్‌ చేసుకునే ప్రయత్నాలు ఇప్పటి నుండే చేస్తున్నారు. ఇక్కడి ఎన్నికలు జిల్లాస్థాయిలో సమస్యాత్మకం అయ్యే నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులు సైతం ఈ ఎన్నికపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రూరల్‌ సిఐ వై.జయరామసుబ్బారెడ్డి నేతృత్వంలో ఎస్‌ఐ ఎం.రోశయ్య ఈ గ్రామంలోని శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా స్టేషన్‌కు ఈ గ్రామం 13 కి.మీటర్ల దూరంలో ఉన్నా కూడా తరచూ తాను పర్యవేక్షిస్తూ, ప్రతినిత్యం కానిస్టేబుళ్ల ద్వారా ఇక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అరాచక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించే దిశగా చర్యలు చేపట్టారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh