కొడవలూరు:జిల్లా పరిషత్ ఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డిని వైయస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్‌గా నియమించడంపై కొడవలూరు జగన్ వర్గీయులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధికి, రాబోయే ఎన్నికల్లో గెలుపునకు కాకాణిని జిల్లా కన్వీనర్‌గా ఎంపిక చేయడం ఆయన సత్తాపై జగన్‌కు ఉన్న నమ్మకమేనన్నారు.అధికారపార్టీ టిడిపికి కడప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకుండా పోవడంపై జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ మందిపాటి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి జగన్ సత్తాను చాటుకున్నారన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి అందరూ కలసికట్టుగా పనిచేస్తామన్నారు. విడవలూరు జడ్పీటిసి వీరి చలపతిరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కడప ఎన్నికలు చర్చనీయాంశం అయినాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి జగన్‌మోహన్‌రెడ్దిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గండవరం ఎంపిటిసి మోహన్‌కృష్ణ, కొడవలూరు మండల సర్పంచ్‌లసంఘం అధ్యక్షుడు చిమటా శేషగిరి, నార్త్‌రాజుపాళెం ఉప సర్పంచ్ కొండా శ్రీనివాసులురెడ్డి, మైనారిటీ నాయకులు కరిముల్లా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Thursday, May 26, 2011
గుప్పెడు నీరు దొరికితే చాలు
ఉదయగిరి: మండల పరిధిలోని సున్నంవారిచింతలలో మంచినీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. మంచినీరు లేక ఎక్కడికో వెళ్లవలసిన పరిస్థితి నెలకొందని ఆగ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మంచి నీటి ట్యాంకు వున్నా నీరు అసలు రావటంలేదని సుమారు 150 కుటుంబాలకు పైగా వున్నాయని వారానికి ఒక్కరోజుకూడా నీరు రావటంలేదని మంచి నీటి ట్యాంకు వున్నా ఫలితంలేకపోయిందని ఆగ్రామ ప్రజలు తెలిపారు. ఇక్కడ ఒకే బోరింగు వుండటంవలన నీరు చాలక గుప్పెడు నీటికోసం దూరప్రాంతాలనుంచి తీసుకొని వస్తున్నారని మంచినీరు దొరక్క ఒక బిందెనీరు రూ.10లకు కొంటున్నామని మామల్ని పట్టించుకునే నాధుడే లేడని ఎన్నిసార్లు అధికారుల దెగ్గరలు ఈవిషయంపై వెళ్ళిన ఫలితం లేకపోయిందని మారోడును ఎవరికి చెప్పుకోవాలో అర్ధంకాక అయోమయ స్థితిలో వున్నారని ప్రజలు ఆరోపించారు. మంచినీటి ట్యాంకు కట్టి ఏడాది దాటుతున్నా ప్రజలకు మంచినీరు అందించలేకపోతుందని ఆగ్రామస్థులు పేర్కొన్నారు.మంచినీటి కోసం నానాకష్టలు పడుతున్నారని ఇప్పటికైన సంబంధిత అధికారులు చలించి మంచినీటి ఎద్దడిని తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.
రాపూరులో గ్రామసేవకుల నిర్వదిక సమ్మె
రాపూరు: రాపూరు ప్రభుత్వ రెవిన్యూ కార్యలయంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ సేవకుల సమ్మె ఒప్పందాలు వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామసేవకుల సంఘం పిలుపుమేరకు బుధవారం రాపూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట 36 మంది గ్రామ సేవకులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుకూలంగా నెలసరివేతనం రూ.5వేలు, టిఎ, డీఎలు రూ.50ల నుండి రూ.100ల వరకు పెంచాలన్నారు. అలాగే ఖాళీగా ఉన్న గ్రామసేవకుల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలన్నారు. ప్రస్తుతం గ్రామ సేవకులకు వేతనం రూపంలో నెలకు రూ.2500లు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
ఆశాకాన్నంటుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు ప్రభుత్వం చెల్లించే కొద్దిపాటి వేతనాలు సరిపోకపోవడంతో తమ కుటుంబాలు పస్తులు ఉంటున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వం హామీ ప్రకారం గ్రామసేవకులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. జీవో నంబర్ 1849 ప్రకారం గ్రామసేవకుల కుటుంబీకులకు వారసత్వంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించని పక్షంలో సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమ్మెలో రాపూరు పట్టంలోని 21 పంచాయితీలకు చెందిన 36 మంది గ్రామసేవకులు పాల్గొన్నారు.
ఆశాకాన్నంటుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు ప్రభుత్వం చెల్లించే కొద్దిపాటి వేతనాలు సరిపోకపోవడంతో తమ కుటుంబాలు పస్తులు ఉంటున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వం హామీ ప్రకారం గ్రామసేవకులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. జీవో నంబర్ 1849 ప్రకారం గ్రామసేవకుల కుటుంబీకులకు వారసత్వంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించని పక్షంలో సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమ్మెలో రాపూరు పట్టంలోని 21 పంచాయితీలకు చెందిన 36 మంది గ్రామసేవకులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)