What Is Meningitis?
Meningitis is an inflammation of the meninges, the lining that protects the brain and spinal cord.
It is almost always caused by an infection, usually by a bacteria (bacterial meningitis) or a virus (viral meningitis). In rare cases it can be triggered by a fungus or parasite.
Meningitis occurs most commonly in young children under 5, those aged 17-25 (who often live in close quarters like dormitories and barracks), and people over age 55. People with compromised immune systems, such as people with HIV or AIDS, are also at increased risk.
What Are The Meninges?
The meninges are composed of three layers of membranes enclosing the brain and spinal cord.
Pia mater is the innermost layer. It is akin to a tissue paper that closely adheres to the brain and spinal cord, dipping into the various folds and crevices.
Arachnoid mater is the middle layer. It is a filmy membrane that is joined to the pia mater by fine threads resembling a cobweb.
The dura mater, a parchment-like membrane, lies on the outermost part of the meninges and adheres to the skull and spinal canal.
The cerebral spinal fluid (CSF) is the fluid that circulates in the spaces in and around the brain and spinal cord.
What Happens When The Meninges Swell?
The most frequent cause of meningitis is the entry of a microorganism-such as a bacterium or a virus-from an infection elsewhere in the body. The microorganisms travel through the blood and into the meninges and cerebral spinal fluid.
In the bloodstream, infection-causing microorganisms are fought off by white blood cells, an important part of the immune system. However, there are no white blood cells in the cerebral spinal fluid to fight infectious agents.
Once infectious organisms have entered the cerebrospinal fluid, the body's defenses cannot control their rapid growth and the disease races through the delicate surfaces and fluids of the central nervous system.
As the immune system gears up to fight off the microorganisms, it sends out chemical signals that produce inflammation and interfere with the normal functioning of the central nervous system. That, in turn, causes swelling and increased pressure inside the skull, and disrupts the brain's normal functioning.
What Causes Meningitis?
There are two main forms of meningitis:
(a) bacterial meningitis, and
(b) viral meningitis.
Bacterial meningitis affects fewer people than the viral form, but it often results in more serious health consequences. Bacterial meningitis is fatal in 1 in 10 cases and leaves 1 in 7 survivors with a severe disability caused by brain injury.
Bacterial Meningitis
There are several types of bacterial meningitis. Two types represent the majority of bacterial meningitis cases:
meningococcal
pneumococcal
The bacteria that cause these cases are common and live in the back of the nose and throat, or in the upper respiratory tract.
The bacteria are spread among people by coughing, sneezing and kissing. These bacteria cannot live outside the body for long, so they cannot be picked up from water supplies, swimming pools, or a building's air-conditioning system.
Individuals can carry these bacteria for days, weeks, or months without becoming ill. In fact, about 25 percent of the population carries the bacteria. Only rarely do the bacteria overcome the body's defenses and invade the cerebra spinal fluid, causing meningitis.
Meningococcal meningitis accounts for more than half of all cases of bacterial meningitis in the United States. Meningococcal disease is caused by bacteria called Neisseria meningitidis. There are several strains of Neisseria meningitidis. Strain B causes about 75 percent of the meningococcal cases and has the highest fatality rate.
Pneumococcal meningitis is caused by pneumococcus bacteria, which also cause several diseases of the respiratory system, including pneumonia. It has a fatality rate of about 20 percent. It also results in a higher incidence of brain damage than other forms of the disease.
Other types of bacterial meningitis include:
Neonatal meningitis: This form affects mostly newborn babies and is caused by Group B streptococcus bacteria, commonly found in the intestines.
Staphylococcal meningitis: This is a rare, but deadly form caused by staphylococcus bacteria. It usually develops as a complication of a diagnostic or surgical procedure.
Haemophilus influenza type B (Hib): is caused by haemophilus bacteria. It was once the most common form of bacterial meningitis, and one of the deadliest childhood diseases. However, in 1985, an Hib vaccine was introduced into the routine immunization program for U.S. children and virtually eliminated Hib meningitis in the United States.
Viral Meningitis
Viral meningitis is far more common than the bacterial form and, in most cases, much less debilitating. Most people exposed to viruses that cause meningitis experience mild or no symptoms and fully recover without complications. '
The disease can be caused by many different viruses. Some of the viruses are transmitted by coughing or sneezing or through poor hygiene. Other viruses can be found in sewage polluted waters.
Occasionally, viral meningitis will develop following the mumps or chicken pox. Mosquito-born viruses also account for a few cases each year.
Approximately half of the viral cases in the United States are due to common intestinal viruses, or enteroviruses. These viruses are shed in the feces and in discharges from the mouth and nose. Most people who become infected with the virus contract it through hand-to-mouth contact.
Friday, December 11, 2009
జెఇ వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయాలి
నెల్లూరు, మేజర్‌న్యూస్: చిన్నారులకు మెదడువాపు వ్యాధిని రానీయకుండా చేసే జెఇ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వ్యాక్సినేటర్లు (ఎఎన్‌ఎంలు) అత్యంత శ్రద్ధ వహించి విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి.వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నుంచి జిల్లాలో తొలివిడతగా నెల్లూరు, గూడూరు డివిజన్లలో (గ్రామీణ ప్రాంతాలు) జెఇ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించబోవు సందర్భంగా సంబంధిత వ్యాక్సినేటర్లకు స్థానిక టౌన్‌హాల్‌లో బుధవారం మధ్యాహ్నం శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న డాక్టర్ వెంకటరమణారెడ్డి వైద్యాధికారులు, వ్యాక్సినేటర్లను ఉద్దేశించి మాట్లాడారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకోవద్దని, ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో అమలు జరిపి విజయవంతం చేయాలని సూచించారు. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడినవారిలో 70 శాతం మంది పిల్లలు చనిపోవడంగాని, పక్షవాతం వంటి వ్యాధుల బారిన పడతారని చెప్పారు. అందువల్ల ముందుగానే వ్యాధిని దరి చేరనీయకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా సంబంధిత వ్యాక్సిన్‌ను భ ద్రపరచే విషయంలో అత్యంత శ్రద్ధ వహించాలన్నారు. ఇటీవల కొన్నిచోట్ల పలు కారణాల వల్ల వ్యాక్సిన్ కొంత మేరకు దెబ్బ తిన్నప్పటికీ, వాటి స్థానంలో కొత్త వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు.
వ్యాక్సినేటర్లు, వైద్యాధికారులు ఆయా ప్రాంతాల అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, టీచర్ల సహకారం తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఆయా మండలాల విద్యాశాఖాధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం తీసుకోవాలన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒకచోట జెఇ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పోస్టర్లను అంటించాలని, వ్యాధి నివారణ పట్ల తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకుగాను విస్తృతంగా కరపత్రాలను పంచి పెట్టాలన్నారు. ముఖ్యంగా జ్వరం, టిబి, హెచ్‌ఐబి తదితర వ్యాధులు ఉన్నవారిని ముందుగా గుర్తించి అలాంటి వారికి ఈ వ్యాక్సిన్‌ను వేయాల్సిన అవసరం లేదని సూచించారు.
ప్రజల ఆరోగ్యంతో ఆడుకోబోము జెఇ వ్యాక్సిన్ వేయగానే కొందరికి సాధారణంగా జ్వరం వస్తుందని దానిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అదేవిధంగా ప్రజలకు ఆరోగ్యసేవలు అందించే విషయంలో అత్యంత శ్రద్ధ వహిస్తామని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడడంతోపాటు వారి ఆరోగ్యంతో ఆటలాడబోమని డాక్టర్ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ వెంకటాద్రి మాట్లాడుతూ 1 నుంచి 15 ఏళ్ల లోపు చిన్నారులకు టీకాలు (జెఇ వ్యాక్సినేషన్) వేసే విషయంలో వ్యాక్సినేటర్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఉంటే వ్యాక్సిన్ వికటించే ప్రమాదముందని హెచ్చరించారు. పిహెచ్‌సిల నుంచి వ్యాక్సిన్‌ను తీసుకెళ్లేటప్పటి నుంచి చిన్నారులకు వ్యాక్సిన్ వేసేంతవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వారికి క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దశరధరామయ్య, క్షయ నివారణాధికారి డాక్టర్ సురేష్‌కుమార్, జిల్లా లెప్రసీ నివారణాధికారి డాక్టర్ సివి.రమాదేవి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జయసింహ, జిల్లాలోని పలువురు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అర్హులందరికీ రుణాలుమాఫీ : డీసీసీబీ ఛైర్మన్
మహబూబ్‌నగర్‌టౌన్, మేజర్‌న్యూస్ : కేంద్ర ప్రభుత్వ రుణ విముక్తి పథ కం వర్తించే అర్హులైన రైతులకు రుణాలు మాఫీచేసే అవకాశం కల్పించి నట్లు డీసీసీ బ్యాంకు చైర్మన్ వీరారెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రం లోని డీసీసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ ఈ అవకాశం డిసెంబర్ చివరి వరకు మాత్రమే ఉన్న ట్లు తెలిపారు. ఐదు ఎకరాలలోపు ఉండి 20వేల లోపు రుణం ఉన్న రైతు లకు పూర్తి మాఫీ చేయబడినట్లు తెలిపారు. ఐదు ఎకరాలకుపై బడి 20 వేల ఆదాయంపై రుణం ఉన్న రైతులకు ఆప్‌కాబ్ నుంచి 25 శాతం డీసీసీబీ నుంచి 25 శాతం మాఫీ వర్తింపజేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కరవు జిల్లాగా ఎంపికచేయడంతో కరవు మాఫీగా 20వేలు ప్రభుత్వం నిర్ణయించగా ఆపై ఉన్న రుణాలకు తమ బ్యాంకు తరపున 25 శాతం మా ఫీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉదాహరణకు ఒక రైతు 30వేల రుణం పొం దితే అందులో నుంచి కరవు మాఫీ క్రింద 20వేలు డీసీసీబీ నుంచి ఇచ్చే 25 శాతం మాఫీ పోగా కేవలం రైతు2,500 రూపాయలు మాత్రమే చెల్లి స్తే సరిపోతుందని వివరించారు. ముఖ్యంగా 80వేల లోపు రుణాలు పొందిన రైతులకు 50 నుంచి 100 శాతం మాఫీ వర్తిస్తున్నట్లు తెలిపారు. ఒక లక్ష రూపాయలు రుణం పొం దిన రైతుకు 50వేలు మాఫీ కానున్నట్లు ఈ అవకాశాన్ని రైతులు సద్విని యోగపర్చుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ విముక్తి పథకం క్రింద మొత్తం 16,225 రైతులు లబ్ధిపొందనున్నట్లు తెలిపారు. గతంలో జిల్లాలో 51 కోట్లు రైతుల నుంచి వసూళ్లు చేస్తే 35 కోట్లు వచ్చేవని వీటిని తగ్గించడం వల్ల కేవలం 12.50కోట్లు మాత్రమే రైతుల నుంచి రికవరీ చేసేవీలుందని వివరించారు. ప్రస్తుతం 26 కోట్లు వసూళ్లు చేస్తే రాయితీ పూర్తిగా వర్తి స్తుందన్నారు. ఆర్థికంగా చితికిన రైతులకు ప్రభుత్వం చక్కటి రాయితీ అ వకాశం కల్పించినట్లు తెలిపారు. రుణ మాఫీ అయిన రైతులకు కూడా తి రిగి దీర్ఘకాలిక, స్వల్పకాలిక, పంటరుణాలు చెల్లించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీసీసీబీ ఉపాధ్యక్షులు రాంమోహన్‌రావ్, బ్యాంక్ సీఇఓ. టిఎన్. మధుసూదన్ పాల్గొన్నారు.
Wednesday, December 9, 2009
రూ1.49 కోట్లు హ డ్కో నిధులు :గురుకుల కార్యదర్శి రాజు
నాయుడుపేట, మేజర్‌న్యూస్: జిల్లాలోని నాయుడుపేట, బుచ్చిరెడ్డిపాళెం సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలకు రూ1.49కోట్లు హడ్కో ద్వార నిధులు మంజూరైనట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయ సంస్థ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ శ్రీనివాసురాజు తెలిపారు. శనివారం నాయుడుపేట బాలికల గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి ప్రిన్సిపాళ్లు, అధికారులు సమీక్షసమావేశం జరిగింది అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమబాట రెండ వ విడతలో భాగంగా రూ88లక్షల మౌలిక వసతులుగాను రూ60లక్షలు నిధులు మంజూరు చేశామని వీటి ద్వార పనులు30రోజులలో ముమ్మరంగా చేయునట్లు వివరించారు.
11 పాఠశాలలో మరుగుదొడ్లు, నీటివసతికి గాను రూ8.5లక్షలు విడుదల అయినట్లు వివరించారు. సూళ్లూరుపేట గురుకుల పాఠశాలలో ఇటీవల ఒక విద్యార్థి మృతి చెందడం పై విలేకరులు ప్రశ్నించగా దానిపై నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అదే పాఠశాలలో అర్హతలేని ఉపాధ్యాయులు నియమించడంపై ప్రశ్నించగా అలాంటి వాటిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు గురుకుల విద్యాలయ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహమూర్తి, ప్రిన్సిపాళ్లు పెంచల లక్ష్మీ, వాసు తదితరులున్నారు.

ములుముడిపై అధికారుల డేగ కన్ను
నెల్లూరు రూరల్, మేజర్‌న్యూస్:జిల్లాలోని సమస్యాత్మక గ్రామాల్లో ఒకటైన ములుముడి పంచాయతీ సర్పంచ్ పదవికి ఈ నెల 23న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ గ్రామ పరిస్థితుల పట్ల అటు పోలీసు, ఇటు రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆది నుండి కమ్యూనిస్టులకు పట్టుగల ఈ గ్రామంలో గత సర్పంచ్ ఎన్నికల్లో సైతం సిపిఎం పార్టీకి చెందిన అట్ల నరసయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అయితే గ్రామ కక్షలు, వర్గ పోరాటాల్లో భాగంగా ఇటీవల కాలంలో అట్ల నరసయ్య హత్యకు గురి కావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
అయితే ఉప ఎన్నికలో ఇతర పార్టీలు పోటీలో ఉండవని భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టేందుకు ముందుకు రావడంతో ఇక్కడ వాతావరణం వేడెక్కుతుంది. తాము కోల్పోయిన సర్పంచ్ పదవిని తిరిగి చేజిక్కించుకునేందుకుగాను అట్ల నరసయ్య వర్గీయులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌కు సైతం ఈ గ్రామంలో అత్యధిక ఓట్లు ఉండడంతో ఈ సారి సర్పంచ్ పదవి తమదే అనే ధీమాను కాంగ్రెస్ వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యే అభ్యర్థికి అధిక సంఖ్యలో ఓట్లు వచ్చాయి. దీనిని బట్టి బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించలేకున్నా, తమ మనసుల్లోని అభిమానంతో ఓట్లు వేసే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. గ్రామంలో ప్రాబల్యం గల రెండు సామాజిక వర్గాలు, మైనారిటీ ఓట్లు సర్పంచ్ విజయాన్ని నిర్ణయించ గలుగుతున్నాయి. అయితే వీరిలో బహిరంగంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేవారికంటే ఎన్నికల రోజున తమ నిర్ణయాన్ని బ్యాలెట్ ద్వారా వ్యక్తపరిచేవారే అధికం. దీనిని బట్టి 23వ తేదీ మధ్యాహ్నం నుండి వెలువడనున్న ఫలితాల్లో మాత్రమే ఇక్కడి బలాబలాలు వ్యక్తం కావాల్సివుంది.
అయితే ఈ గ్రామంలో ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామంలో బెల్టుషాపులు, మద్యం విక్రయాలను పూర్తిగా నిరోధించారు. అదేవిధంగా గతంలో నేర చరిత్ర గలవారిని సైతం ముందుగా బైండోవర్ చేసుకునే ప్రయత్నాలు ఇప్పటి నుండే చేస్తున్నారు. ఇక్కడి ఎన్నికలు జిల్లాస్థాయిలో సమస్యాత్మకం అయ్యే నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులు సైతం ఈ ఎన్నికపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రూరల్ సిఐ వై.జయరామసుబ్బారెడ్డి నేతృత్వంలో ఎస్‌ఐ ఎం.రోశయ్య ఈ గ్రామంలోని శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా స్టేషన్‌కు ఈ గ్రామం 13 కి.మీటర్ల దూరంలో ఉన్నా కూడా తరచూ తాను పర్యవేక్షిస్తూ, ప్రతినిత్యం కానిస్టేబుళ్ల ద్వారా ఇక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అరాచక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించే దిశగా చర్యలు చేపట్టారు.

Tuesday, December 8, 2009
తెలంగాణపై కాంగ్రెస్ ద్వందవైఖరి
నెల్లూరు : తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలుఏర్పడుతున్నాయని మాజీ మంత్రి, జిల్లా తెలుగుదేశం పార్టీ కన్వీనర్ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేయడంవల్ల ప్రాంతీయ విభేదాలు ఏర్పడుతున్నాయని అన్నారు.
2004 ఎన్నికల్లో టిఆర్ఎస్తో చెట్టాపట్టాలు వేసి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ అంశమే మరిచిపోయారని అన్నారు. అదేవిధంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొదటివిడత పోలింగ్కు ముందు కాంగ్రెస్పార్టీ జాతీయ అధ్యక్షురాలుసోనియాగాంధీ స్వయంగా తెలంగాణకు మద్దతుగా ప్రకటన చేశారని చెప్పారు. అయితే రెండో విడత ఎన్నికల పోలింగ్కువచ్చే సరికి వైఎస్ రాజశేఖర్రెడ్డి తెలంగాణ ఏర్పాటుచేస్తే అక్కడి వెళ్లాలంటే పాస్పోర్టు తప్పనిసరిగా మారే దుస్థితిఆంధ్రావాసులకు తప్పదని హెచ్చరించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ దమననీతి అర్థం అవుతోందని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరిని అవలంభిస్తోందని సోమిరెడ్డి చెప్పారు. ఎన్టీరామారావు 610 జివోను ప్రవేశపెట్టి తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు న్యాయం చేశారని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో పలు అభివృద్ధికార్యక్రమాలను చేపట్టారని ఆయన వివరించారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమంలో ఎన్టీఆర్, పొట్టి శ్రీరాములు విగ్రహాలుధ్వంసం చేయడం తగదని ఆయన విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం ప్రాణాలు సమర్పించిన అమరజీవి పొట్టిశ్రీరాములని అన్నారు.
దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీజీని సైతం అవమానపరిచేవిధంగా ఆయన పేరును మార్చడం దురదృష్టకరమనిఅన్నారు. కాంగ్రెస్పార్టీలో ఒక వర్గమే ఇటువంటి విధానాలకు పాల్పడుతోందని ఆ పార్టీ నాయకులే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారని పేర్కొన్నారు. ఆనాడు చెన్నారెడ్డిని దింపేందుకు కాంగ్రెస్లో వ్యతిరేక వర్గం కూడా ఇటువంటి విధానాన్నిఅనుసరించిందని, ప్రస్తుతం కూడా రోశయ్యకు ముప్పు తీసుకురావడానికే తెలంగాణ ఉద్యమం వెనుక కాంగ్రెస్ పార్టీకిచెందిన మరో వర్గం నాయకులు కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్రతెలుగుయువత అధ్యక్షుడు బీద రవిచంద్ర, మాజీ మంత్రి రమేష్రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Monday, December 7, 2009
’దృష్టి’కి బొల్లినేని ‘షాక్’
నెల్లూరు:జిల్లాలో పనిచేసే ఉన్నతాధికారులు ముఖ్యంగా కలెక్టర్, ఎస్‌పి తదితరులు ఎంత కాలంపాటు పనిచేస్తారో ఖచ్చితంగా చెప్పలేని రోజులివి. పరిస్థితులన్నీ అనుకూలిస్తే సుమారు రెండు నుంచి నాలుగేళ్లపాటు పనిచేయగలిగితే అది విశేషమే. అయితే తాము పనిచేసిన కాలంలో జిల్లాలో ఏదోఒక ప్రజోపయోగ కార్యక్రమాన్ని చేపట్టి దానిని విజయవంతం చేసి తనదైన ముద్ర వేసుకునేందుకు అధికారులు కృషి చేయడం మామూలే. రాజకీయ నేతల జోక్యం కాని, స్వయంకృతాపరాధం, పదోన్నతులు రావడం, పనితీరు సక్రమంగా లేకపోవడం తదితర కారణాల వల్ల బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే వారు బదిలీలు అవుతుండడం జరుగుతూ వుంటుంది. అయితే పనితీరులో ఒక్కో అధికారిది ఒక్కో రకమైన స్టైల్. గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఎం.రవిచంద్ర ‘ప్రజ్వలిక’ పేరుతో చదువులో అత్యంత ప్రతిభ కనబరచిన పేద విద్యార్థులను ప్రత్యేకంగా ప్రోత్సహించి వారికి కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించేవారు.
ప్రస్తుత జిల్లా కలెక్టర్ కె.రాంగోపాల్ తనదైన శైలిలో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థుల విషయంతోపాటు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశా ల్లో 10వ తరగతి వరకు చ దువుతూ కంటిచూపుకు దూరమవుతున్న వారికి ‘దృష్టి’ కార్యక్రమం ద్వారా కంటి చూపును ప్రసాదించాలనే దృఢమైన సంకల్పంతో ఉన్నారాయన.
అయితే అక్టోబర్ నెల19,20వ తేదీల్లో నగరంలోని బొల్లినేని కంటి వైద్యశాలలో జరిగిన క్యాటరాక్ట్ ఆపరేషన్లు వికటించి 23 మంది శాశ్వతంగా కంటిచూపు కోల్పోయిన సంఘటన ఈ ‘దృష్టి’ కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేక్ పడేలా చేసింది. పెద్ద ఎత్తున ప్రజలు కంటిచూపును కోల్పోయిన ఈ సంఘటన రాష్ట్ర, దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరగకుండా ఉండివుంటే అక్టోబర్ 26 నుంచి డిసెంబర్ నెలాఖరులోపు కంటిలో శుక్లాలు, మెల్లకన్ను (స్కింట్), రెప్ప వాలిపోవడం (టోసిస్) ఆపరేషన్లు పూర్తయి ఉండేవి. ప్రస్తుతం వర్షాలు పడుతుండడం... చలికాలం కావడం.... పండుగలు.... పరీక్షలు... ఇలా పరిస్థితులు అనుకూలించక పోతుండడంతో ఇక ఈ కార్యక్రమం వచ్చే ఏడాది వేసవి సెలవుల తర్వాతేనని పలువురు విద్య, వైద్యాధికారులు చెబుతున్నారు.
వైద్యం ఎంతో ఖరీదవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న వయసులోనే కంటి చూపును కోల్పోతున్న విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించేందుకు జిల్లాలో రాజీవ్ విద్యామిషన్ ద్వారా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘దృష్టి’ కార్యక్రమానికి ఈ ఏడాది ఆగస్టు 1న కలెక్టర్ రాంగోపాల్ శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 10వ తరగతి వరకు చదివే 2.37 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. మరో 50 వేల మంది విద్యార్థులకు నిర్వహించాల్సివుంది.
ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా అంధత్వ నివారణ సంస్థ, గుంటూరులోని శంకర ఐ హాస్పిటల్, నగరానికి చెందిన మోడరన్, బొల్లినేని, నారాయణ, బాలాజీ ఐకేర్ వైద్య సంస్థలకు చెందిన కంటి వైద్య నిపుణులు జిల్లా వ్యాప్తంగా పర్యటించి విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించారు. జిల్లాలోని పెళ్లకూరు, వింజమూరు మండలాలకు చెందిన ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులను సైతం పరీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 328 మెల్లకన్ను (స్కిన్ట్), 51 క్యాటరాక్ట్ (శుక్లాలు), 32 రెప్పవాలిపోవడం (టోసిస్) కేసులను గుర్తించి వారికి ఆపరేషన్లు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకుగాను ముందుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆపరేషన్లు అవసరమైన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో అవగాహన కల్పించి తమ పిల్లలకు ఆపరేషన్లు చేయించేందుకు ఒప్పించారు.
అదేవిధంగా జిల్లాపరిషత్ సిఇఒ బి.రామిరెడ్డి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ ఎం.మంజులమ్మ, జిల్లా విద్యాశాఖాధికారి ఆంజనేయులు, జిల్లాలోని ఎంఇఒలకు అవగాహన సదస్సులను సైతం నిర్వహించారు. కంటి శుక్లాల ఆపరేషన్లు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో, స్కింట్, టోసిస్ ఆపరేషన్లను ఆరోగ్యశ్రీ పథకం కింద గుంటూరులోని శంకర ఐ ఆసుపత్రిలో నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ రాంగోపాల్ అన్నివిధాలా ఏర్పాట్లు సిద్ధం చేయించారు.
సరిగ్గా ఈ ఆపరేషన్లు మొదలు పెట్టే వారం రోజుల ముందు బొల్లినేని సంఘటన జరగడంతో అందుకు సంబంధించిన విచారణ పనుల్లో జిల్లా కలెక్టర్, అంధత్వ నివారణ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ మంజులమ్మ తీరికలేకుండా విధులు నిర్వహించే పనిలో ఉండగా అంతకు ముందుగానే ఈ ‘దృష్టి’ కార్యక్రమాన్ని చేపట్టిన రాజీవ్ విద్యామిషన్ పిడి డాక్టర్ యుగంధర్ కుమార్ గుంటూరు జిల్లాకు బదిలీ కావడంతో ఆపరేషన్లకు తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్టు అయింది. సాధారణంగా ప్రస్తుత చలికాలంలో కంటి ఆపరేషన్లు చేయించుకునేందుకు పెద్దలు సైతం ముందుకురాని పరిస్థితి. కారణం చలి, కన్ను మానదని, చీము పట్టడం, జలుబు, దగ్గు, తుమ్ములు వంటివి వస్తాయనే భీతి ప్రతి ఒక్కరిలో ఉండడం సహజం. ఇటీవల మెదడువాపు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై వైద్యాధికారులతో తన చాంబర్‌లో జిల్లా కలెక్టర్ రాంగోపాల్ చర్చిస్తూ ‘దృష్టి’ కార్యక్రమానికి బొల్లినేని సంఘటన ఇబ్బంది కలిగించిందని నిరాశగా చెప్పడం గమనార్హం.

ప్రేమ పేరుతో నయవంచన
నెల్లూరు:దేవదాసు-పార్వతి, లైలా-మజ్ను, అనార్కలి-సలీం... ఇలాంటి అమర ప్రేమికులు, ప్రేమజంటలు నేటి రోజుల్లో కనుమరుగయ్యాయనడం నగ్న సత్యాలు. ప్రస్తుతం సమాజంలో ప్రేమ పేరుతో ముక్కుపచ్చలారని, అభం శుభం తెలియని ఆడపిల్లలను వశపరచుకుని ఆ తర్వాత వారిని బ్లాక్‌మెయిలింగ్ చేయడం ఎక్కువైంది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారితో లైంగిక కార్యకలాపాలు సాగించి రహస్యంగా ఫొటోలు, వీడియో తీయించడం, ఆ తర్వాత డబ్బు కోసం వారిని మానసికంగా క్షోభకు గురి చేయడం, అడుగడుగునా బ్లాక్‌మెయిల్ చేయడం. అయితే తెలిసో తెలియకో ఇలాంటి మేకవన్నె పులుల చేతికి చిక్కిన ఆ బాలికలు ఈ విషయాన్ని ఇతరులతో చెప్పుకోలేక, పోలీసులకు ఫిర్యాదు చేయలేక, తమలో తామే కుంగిపోతూ నిత్యం చస్తూ బతుకుతున్నారు. కాస్త సున్నిత మనస్కులైన వారైతే ఈ హాలాహలం వంటి సత్యాన్ని తమలోనే దాచుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విషయం కాస్తా తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై విలపిస్తూ తమ బిడ్డ జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా తమ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్న నయవంచకులకు శాపనార్థాలు పెట్టడం మినహా మరో మార్గం లేని పరిస్థితి.
ఇటీవల కాలంలో నెల్లూరు నగర ంలో కొన్ని మానవ మృగాలు డబ్బు కోసం ఈ సరికొత్త పథకాన్ని రూపొందించుకుని అమలు జరుపుతున్నాయి. ముందుగా ఈ మానవ మృగాలు బాగా స్థితిమంతులైన స్కూల్, కళాశాలల్లో చదివే విద్యార్థినిలను ఎంపిక చేసుకుంటున్నాయి. ఆ తర్వాత మోటార్‌బైక్‌లు, కార్లలో నిత్యం వారి వెంట తిరుగుతూ ప్రేమ పేరుతో వారిని ఆకర్షించి ఆ తర్వాత చిన్నగా వారిని ముగ్గులోకి దింపడం మామూలైంది.
తాజాగా నగరానికి చెందిన ఒక మైనర్ బాలికను ఇదేవిధంగా ఒక మానవ మృగం ప్రేమ పేరుతో నమ్మించి వశపరచుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మపలికి ఆ బాలికతో లైంగిక కార్యక్రమాలకు పాల్పడి ముందుగా వేసుకున్న ఒక పథకం ప్రకారం సంబంధిత ఫోటోలు, వీడియోలను చిత్రీకరించాడు. ఆ తర్వాత నుంచి ఆమెను ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్ చేయనారంభించాడు. లేకపోతే ఈ ఫొటోలు, వీడియోను బహిర్గతం చేస్తానంటూ నిత్యం ఆమెను వేధించసాగాడు. దీంతో తాను చేసిన తప్పును తమ పెద్దల ముందు ఒప్పుకున్న ఆ బాలిక జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పడంతో వారు షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత తమకు తెలిసినవారి ద్వారా సంబంధిత యువకుడితో మధ్యస్తం నడిపారు.
ఎలాగోలా సమస్య పరిష్కారం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ నయవంచకుడి నుంచి ఫొటోలు, వీడియోలను మధ్యవర్తులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫొటోలు, వీడియోలను తమకు చూపించమని అడిగిన బాలిక తల్లిదండ్రులతో మధ్యవర్తులు ‘ఈ ఫొటోలు, వీడియో చూస్తే మీరు చనిపోతారు వద్దులే’ అనడం కొసమెరుపు. నగరంలో అనేకమంది మానవమృగాలు జల్సాలు, చెడు వ్యసనాలకు బానిసలు అవుతుండడంతో అందుకు కావాల్సిన డబ్బు కోసం ఇలాంటి అవతారాలు ఎత్తుతూ తమ పనులను చాపకింద నీరులా సాగిస్తున్నారు. అయితే వెలుగు చూస్తున్న ఇలాంటి సంఘటనలు ఏ ఒకటో రెండో. నగర పోలీసులు ఇలాంటి సంఘటనలపై నిఘా ఉంచి మానవ మృగాల పనిపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Subscribe to:
Posts (Atom)