online marketing

Saturday, February 4, 2012

రాపూరు లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు స్థల పరిశీలన

రాపూరు లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్  విగ్రహం ఏర్పాటుకు స్థల పరిశీలన : మండల కేంద్రమైన రాపూరు లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు రెవెన్యూ  అధికారులు స్థల పరిశీలన జరిపారు. రాపూరు ఆర్ ఐ శరత్ , విఆఓ రాఘవ రెడ్డి విగ్రహ ఏర్పాటు కమీటీ సభ్యులతో కలసి స్థాలాన్ని  పరిశీలించారు. ఈ సందర్భంగా వారు లైబ్రరీలో, కోరా సెంటర్, రెవెన్యూ కార్యాలయం ముందు భాగంలో వున్న స్థలాలను పరిశీలించారు

కోవూరు ఉప ఎన్నిక నిర్వహణకు సమాయతం కండి సమీక్షా సమావేశంలో - సి ఇ ఓ భన్వర్ లాల్

కోవూరు ఉప ఎన్నిక నిర్వహణకు సమాయతం కండి  సమీక్షా సమావేశంలో సి ఇ ఓ భన్వర్ లాల్ . నియోజకవర్గ ఓటరు నమోదు తుది జాబితా తయారీ. కోవూరు ఉప ఎన్నికలకు అధికారులు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారని ఛీప్‌ ఎన్నికల కమిషనర్‌ బన్వర్‌లాల్‌ తెలిపారు. స్థానిక గోల్డెన్‌జూబ్లీహాల్లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, అందులో కోవూరు ఒకటన్నారు. ఈ ఏడాది జనవరి పదో తేదీ వరకూ ఓటర్ల లిస్టు పూర్తయిందన్నారు. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్‌ ప్రకటిస్తే అప్పుడు పూర్తి జాబితా సిద్ధమవుతుందన్నారు. జిల్లాలో 63శాతం కాగా ఒక్క కోవూరులోనే 67 శాతం ఓటర్ల నమోదు జరిగిందన్నారు. వివిధ రాజకీయపార్టీల సూచనల మేరకు కోవూరు నియోజకవర్గంలో ఈ నెలాఖరు దాకా ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతుందన్నారు. 18 ఏళ్లు నిండిన యువకులందరూ ఓటర్లుగా చేరాలన్నారు. ఓటర్ల చేర్పులు, మార్పులు నిరంతరంగా ఉంటుందని తెలిపారు. ఈనెలాఖరువరకు నకిలీ ఓటర్ల గుర్తింపు, కొత్త ఓటర్ల చేర్పు విషయమై ఇంటింటి వెళ్లి తనిఖీలు చేస్తారని చెప్పారు. అలాగే పోలింగ్‌ స్టేషన్‌ విషయం కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఎక్కువ, తక్కువ మంది ఓటర్లున్న కేంద్రాలను గుర్తించి అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. ఈ రోజ జరిగిన సమావేశానికి అన్ని రాజకీయపార్టీలు హాజరయ్యాయని తెలిపారు. మద్యం, డబ్బు, క్రైం విషయాలు చర్చకు వచ్చాయన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించిన వెంటనే నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు. పత్రికలు, టివిల్లో అభ్యర్థుల తరపున ప్రచురించే ప్రకటనల నియంత్రణకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో రెండు కమిటీలుంటాయన్నారు. ఇద్దరు పత్రికా ప్రతినిధులతోపాటు, అధికారులు అందులో సభ్యులుగా ఉంటారన్నారు. ప్రతి నాలుగు గంటల సమయంలో కమిటీ విశ్లేషించి అది పెయిడ్‌ న్యూస్‌ అయితే ఆ ప్రకటన ఖర్చును అభ్యర్థుల జాబితాలో చేర్చతామని తెలిపారు. నెల్లూరు నగరంలో డోర్‌నెంబర్లు సరిగాలేవని కొందరు నాయకులు తన దృష్టికి తీసుకొచ్చారనన్నారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో సరిచేస్తామని తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. సమావేశంలో కలెక్టర్‌ బి. శ్రీధర్‌, ఎస్‌పి బి.వి. రమణకుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌, డిఆర్‌ఓ బి.రామిరెడ్డి, కావలి, నెల్లూరు ఆర్‌డిఓలు సుబ్రమణ్యేశ్వర రెడ్డి, మాధవీలత, జడ్‌పి సిఇఓ జి.వి. జయరామయ్య, మాజీ ఎంఎల్‌ఎ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, సిపిఎం ప్రతినిధి జి. శ్రీనివాస్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి పముజుల దశరథరామయ్య, బిజెపి ప్రతినిధి కాళేశ్వరరావు, టిడిపి ప్రతినిధులు చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, భువనేశ్వర్‌,కోవూరు, విడవలూరు, ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాళెం మండలాల తహశీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.

25 రూపాయల వంతున తెచ్చి. ఇక్కడ వంద రూపాయలకు పుచ్చకాయ

పుచ్చకాయల సీజన్ రానే వచ్చింది . అయితే పుచ్చకాయల ధరలు మాత్రం ఆకాశాన్నటుతు న్నాయు. ఒక్కొక్క పుచ్చ కాయను వంద రూపాయలకు పైగానే విక్రయుస్తున్నారు . రైతుల వద్ద ఒక్కో కాయను 25 రూపాయల వంతున తెచ్చి. ఇక్కడ వంద రూపాయలకు పైగానే విక్రయుస్తున్నారు

Friday, February 3, 2012

వివాహితపై ఓ కామాంధుడు భర్తలేని సమయంలో

జలదంకి  : వివాహితపై ఓ కామాంధుడు భర్తలేని సమయంలో అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన గత నెల 30న జలదంకి మండలం కమ్మవారిపాలెంలో జరిగింది. ఈ ఘటనపై గురువారం జ లదంకి పోలీసులకు బాధితురాలు ఫి ర్యాదు చేసింది. ఏఎస్సై వెంకటేశ్వరరా జు నిందితుడిపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన వివాహిత ఇంటిలో ఒంటరిగా ఉండగా అదే గ్రామానికి చెందిన కరియావుల వెంకటేశ్వర్లు అత్యాచారయత్నానికి పాల్పడా ్డడు.

బాధితురాలు బయటకు పరుగుపెట్టి కేకలువేయగా నిందితుడు పరారయ్యాడు. ఆమె అవమానభారంతో పు రుగు మందు తాగింది. బంధువులు కా వలిలోని ప్రైవేటు వైద్యశాలలో చే ర్పించారు. పరిస్థి తి విషమించడం తో నెల్లూరులోని బొల్లినేని వైద్యశాలకు తరలించా రు. ప్రస్తుతం ఆ మె కోలుకుంటోంది. జరిగిన ఘటనపై గురువారం నెల్లూరు నుంచి జలదంకి పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. ఏఎస్సై వెంకటేశ్వరరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అమ్మా.. నీకెందుకింత కష్టం.. ఈ వయసులో కూలి పనులు చేయాలా..

సంగం  : " అమ్మా.. నీకెందుకింత కష్టం.. ఈ వయసులో కూలి పనులు చేయాలా.. నిన్ను చూసుకునేవారు లేరా?. పింఛను అందుతోందా.. తెల్లరేషన్‌కార్డు ఉందా.. ఎన్నికేజీల బియ్యం ఇస్తున్నారు?'' అంటూ ఓ వృద్ధురాలితో కలెక్టర్ శ్రీధర్ అన్నారు. గురువారం ఉదయం సంగం మండలం గాంధీజనసంఘంలో 'ఉపాధి' పథకం ద్వారా జరుగుతున్న కాలువపూడికతీత పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పొలం గెనాల మీద నడిచి కూలీల వద్దకు వెళ్లారు. పొలం పనిలో నిమగ్నమై ఉన్న ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. "ఏమ్మా నేనెవరో నీకు తెలుసా'' అన్ని ప్రశ్నించారు.

దీంతో ఆ వృద్ధురాలు "తెలియదయ్యా..''అని సమాధానం ఇచ్చారు. ఇంతలో అక్కడే ఉన్న అధికారులు 'ఈయన కలెక్టర్' అని చెప్పడంతో ఆమె "నమస్కారమయ్యా'' అంటూ కలెక్టర్ వద్దకు వచ్చింది. దీంతో ఆయన "ఏమ్మా నీకెందుకు ఇంత కష్టము.. పిల్లలు లేరా?'' అని ఆ వృద్ధురాలితో సంభాషించారు. "ఉన్నారు నా యనా..వారు వేరే కాపురం పెట్టుకున్నారు.. నేను ఒక్కదాన్నే ఉన్నా.. కూలి పనులు చేస్తూ పొట్ట నింపుకుంటున్నా'' అని సమాధానం చె ప్పారు. వృద్ధురాలితోపాటు అక్కడున్న వారితో క లెక్టర్ మాట్లాడారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ యుగంధర్, డీపీఆర్‌వో కమలాకర్‌రెడ్డి, ఎమ్పీడీ వో జేవీ రమణయ్య, ఏపీవో మీరయ్య ఉన్నారు

పొదలకూరు, చేజర్ల, కలువాయి, రాపూరు, ఆత్మకూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల నుండి

పొదలకూరు: నిమ్మకాయలధరలు ఇటీవల కాలంలో తక్కువగావుండి ధరలు లేకపోవడంతో నిమ్మరైతులు చెట్లపైనే కాయలువదిలేశారు. ఉన్నట్టుండి అమాంతం ఒక్కసారిగా నిమ్మధరలు పెరగడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. రాబోయే రోజుల్లో నిమ్మ ధరలకు గిరాకి పెరగడంతో దిగుబడి గణనీయంగా తగ్గుతోంది. పొదలకూరు నిమ్మమార్కెట్‌యార్డ్‌లో గురువారం లావులు లూజు బస్తా రూ.2వేలు నుంచి రూ.2700ల వరకు, సన్నాలు రూ.15వందలనుంచి రూ.2500ల వరకు ధర పలికింది. ఒక్కో దుకాణానికి పదికి మించి లూజు బస్తాలు రావడం లేదు. ఒకవేళ వచ్చినా నిమ్మకాయలు పండిపోయి ఉంటున్నాయి. నిమ్మరైతులకు ధరలు ఊరట కల్గిస్తున్నా ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడంతో వారికి నష్టం తప్పడంలేదు. గత ఏడాది లూజు బస్తా రూ.700ల నుండి వెయ్యి రూపాయల వరకు ఉండేది. కానీ ఈ ఏడాది లూజుబస్తా సన్నాలు రూ.2500లు పలుకుతున్నాయి. గూడూరు, వెంకటగిరి మార్కెట్‌లతో పోల్చితే ఇక్కడ ధరలు బాగా పెరిగాయని చెప్పవచ్చు. 

పొదలకూరు నిమ్మయార్డ్‌ నుండి ఢిల్లీ, కోల్‌కత్తా, ఘోరక్‌పూర్‌, లక్నో, మధురై, కేరళ, బీహార్‌, పట్నా, కర్నాటక, చెనై్న, రాంచి, గయ, పట్టణ, రాష్ట్రాలకు నిమ్మకాయలను ఎగుమతి చేస్తుంటారు. పొదలకూరు, చేజర్ల, కలువాయి, రాపూరు, ఆత్మకూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల నుండి పొదలకూరు నిమ్మయార్డ్‌కు రోజుకు 12వందల బస్తాలు వస్తుంటాయి. ఈ ప్రాంత నిమ్మరైతులు గతంలో 18వేల ఎకరాల వరకు నిమ్మసాగు చేపట్టి యార్డ్‌కు నిమ్మకాయలు తరలించేవారు. ప్రస్తుతం 6వేల ఎకరాల్లో కూడా నిమ్మసాగు లేకపోవడంతో యార్డ్‌కు కాయలు రావడంలేదు. ఈ నేపథ్యంలో ధరలు పెరగడంతో రైతులకు ఆనందం వచ్చినా, దిగుబడిలేని కారణంగా ఆవేదన చెందుతున్నారు. పలు రకాల తెగుళ్లతో చెట్లు చనిపోయి మరికొన్ని చెట్లు నీరు సరిపడినంతలేక ఎండుకొమ్మలు ఏర్పడటంతో దిగుబడి తగ్గుతుంది. కావున ఉధ్యానవనశాఖ అధికారులు నిమ్మరైతులకు సూచనలు, సలహాలు అందించి నిమ్మదిగుబడికి కృషిచేయాలని రైతులు కోరుతున్నారు.

ప్రాచీన కళ్యాణ మండపం కూల్చి వేసిన సంఘటన

ఉదయగిరి  : ఒకరు ప్రజా నాయకుడు... మరోకరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లీడరు వీరిద్దరూ స్థానిక శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి ముఖ్య అనుచరులే... వారే కొట్టాలపల్లి సొసైటీ అధ్యక్షుడు అక్కి భాస్కర్‌రెడ్డి మరోకరు వాటర్‌ ప్లాంట్‌ అధినేత బొందగుల రమణారెడ్డిలు గుప్త నిధుల కోసం గత నెల 13 వతేది కృష్ణాలయం కళ్యాణ మండపం కూలి వేసిన సంఘటనలో ప్రధాన ముద్దాయిలుగా పోలీసులు నోరుతెరచారు. ఈ సందర్భంగా కావలి డిఎస్పీ పి,ఇందిర గురువారం స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెళ్లడించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత నెల 13వ తేదిన గుప్త నిధులుంటాయని అత్యంత ప్రాచీన కళ్యాణ మండపం కూల్చి వేసిన సంఘటన పై తాము చేసిన దర్యాప్తులో 11 మంది సభ్యులుగా గుర్తించి వారిపై ఐపిసి 379, 511 తోపాటు సెక్షన్‌ 31 క్రింద కేసు నమోదు చేశామని తెలిపారు. పదకొండు మంది ముఠాసభ్యులతో నలుగురు స్థానికులని వారు అక్కి భాస్కర్‌రెడ్డి (సొసైటి అధ్యక్షులు) బందుగుల రమణారెడ్డి (గంగా వాటర్‌ యజమాని) వింజమూరుకు చెందిన రామిరెడ్డి వాటర్‌ ప్లాంట్‌ మేనేజర్‌ అయిన కప్పా శ్రీనివాసరాజులుగా గుర్తించామని కప్పా శ్రీనివాసరాజును అరెస్టు చేశామని మిగిలిన వారు పొరుగు జిల్లాలకు చెందిన వారిగా గుర్తించామని తొందరిలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. గుప్త నిధుల కేసులో ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు కావడం ఉదయగిరి స్టేషన్‌ పరిధిలో ప్రధమమని నాలుగురోజుల క్రిందటే కలిగిరి సర్కిల్‌ పరిధిలోని వింజమూరులో కూడా నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. రాజకీయ ఒత్తిడులు ఏమిలేవని అలాంటివి ఎదురైనా రాజీపడేది లేదని స్పష్టం చేశారు.

పౌరులకు భధ్రత ఉంది:
రాజ్యాంగం చెప్పిన ఆర్టికల్‌ 51 అ ప్రకారం ప్రాచీన సంపద కాపాడే హక్కు ప్రతి పౌరుడికి ఉందని మూఢనమ్మకాల వల్ల నిధులు ఉంటాయని నిర్మాణాలు కూల్చివేయడం అవివేకం అని ఆమె అన్నారు. ఈమెతోపాటు సీఐ కళ్యాణరాజు, ఎస్‌ఐ రమేష్‌లు కూడా ఉన్నారు.

పోలీసులకు స్థానికుల ప్రశంశలు:
ఉదయగిరి చరిత్రలో ఇంత పెద్ద సంఘటన జరగలేదని జరిగిన అనతి కాలంలోనే పోలీసులు ఛేదించడం పెద్ద మనుషులు అయినప్పటికి కేసు నమోదుచేయడం పై స్థానిక పోలీసులను డిఎస్పీని ఉదయగిరి ప్రాంత ప్రజలు ప్రశంశిస్తున్నారు. పెద్ద మనుషుల ముసుగులో ఉండి ఆలయాల పునరుద్ధరణ పేరుతో అవతారాలెత్తిన నాయకులే నిందితులు కావడం విషేషంగా మారింది.

హాట్ టాపిక్ గా మారింది అతను సిఎం రాజన్న

గతంలో నేను ముఖ్యమంత్రి అయితే అనే టైటిల్ తో ఓ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో నటించి,డైరక్ట్ చేసిన మందలపు వెంకట నరేంద్ర(42)అనే అతను గుంటూరులోలో దారణ హత్యకు గురి అవటం..ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అతను సిఎం రాజన్న అనే టైటిల్ తో ఓ చిత్రం కూడా ప్లాన్ చేసాడు. అయితే ఆ సినిమా మెటిరియలైజ్ కాలేదు. అమ్మాయిలను పెళ్లి చేసుకుని మోసం చేయటం,సినిమాలు ప్లాన్ చేయటం వృత్తిగా పెట్టుకున్న ఇతనకి ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయాలే ఉన్నాయని తెలుస్తోంది. అయితే నరేంద్ర ఇలాంటి వాడని ఎవరూ ఊహిచంలేదని వారంతా మాట్లాడుకుంటున్నారు. అలాగే నరేంద్ర తీసిన సినిమా కూడా ఆడలేదు. అయినా తాను కంటిన్యూగా సినిమాలు తీస్తానని చెప్పేవాడని,ఆ పిచ్చే ఇలా మోసాలు చేసే స్ధితికి దిగజార్చిందా అని అంతా మాట్లాడుకుంటున్నారు.

ఇక నరేంద్ర నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందినవాడు. అతని మేనమామ అని చెప్పే ఓ వ్యక్తి తప్ప మిగతా కుటుంబ సభ్యులెవరో కూడా తెలియదు. ఓ కేసులో అమెరికాలో నరేంద్రకు 20 నెలల జైలు శిక్ష పడింది. పైకోర్టుకు వెళ్లడంతో దాన్ని పది నెలలకు కుదించింది. ఆ తర్వాత ఇండియాకు పంపించేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లిళ్లు చేసుకుని మోసాలు చేయడం ప్రారంభించాడు. నరేంద్ర ఇప్పటి వరకు పంజాబ్‌కు చెందిన ఓ యువతిని, తెనాలికి చెందిన డాక్టర్‌ను, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను, గుంటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్నాడు. గుంటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హైదరాబాదులో ఉంటోంది. అమెరికాలో పంజాబ్‌కు చెందిన యువతిని నరేంద్ర పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నరేంద్ర తీరు నచ్చక ఆమె విడాకులు ఇచ్చేసి పంజాబ్‌కు చేరుకుంది. ఆ గొడవల్లోనే అతన్ని చంపేసారు.

శంకర్రావుకు నోటి దూల ఎక్కువ.

శంకర్రావుకు నోటి దూల ఎక్కువ.. ఆ దూలతో వళ్లంతా గీక్కుని పదవి పోగొట్టుకున్నారని నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. శంకర్రావు నోటిదూల మనిషైనప్పటికీ మంచివారేనని చెప్పారు. 
నోటి దూల ఎక్కువైతే ఎవరి పరిస్థితైనా ఇలాగే ఉంటుందన్నారు. శంకర్రావు పదవి పోయేందుకు ఎవరూ కారకులు కారనీ, ఆయన నోటి దూలే దానికి కారణమైందని అన్నారు.
ఇక చిరంజీవి వర్గం ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కడంపై ఆనం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందనేందుకు ఇది నిదర్శనమన్నారు

నారా చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 6న జిల్లాకు

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 6న జిల్లాకు వస్తున్నారు. రైతు పోరు బాటలో భాగంగా ఆయన జిల్లాలోని దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. ఇప్పటికే 21 జిల్లాల్లో రైతు పోరుబాటను పూర్తి చేసిన చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 6న జిల్లాకు వచ్చి ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలంలో రైతు పోరు బాటను నిర్వహించనున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి శుక్రవారం జిల్లా నేతలకు సమాచారం అందింది. అధినేత పర్యటన ఖరారు కావడంతో రైతు పోరుకు సంబంధించిన రోడ్డు మ్యాప్‌ను తయారు చేసేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు బీద రవిచంద్ర, నాయకులు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, బొల్లినేని రామారావు తదితరులు శనివారం ప్రత్యేక సమావేశం కానున్నారు.

టీడీపీ శ్రేణుల్లో ఆనందం... పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 15 రోజుల వ్యవధిలో రెండో సారి జిల్లాకు వస్తుండడంతో పార్టీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రకాశం జిల్లాలో రైతు పోరు బాట సందర్భంగా ఈనెల 20న చిత్తూరు నుంచి వెళుతూ కావలి నియోజకవర్గంలో చంద్రబాబు రైతుపోరు బాట నిర్వహించిన విషయం తెలిసిందే. కావలి ప్రాంతంలో దెబ్బతిన్న పుచ్చ, శెనగ పంటలను చంద్రబాబు పరిశీలించి రైతులతో మాట్లాడడం, కోవూరు ఉప ఎన్నికలపై పార్టీ నేతలతో చర్చిచడంతో పార్టీ కార్యకర్తల్లోనూ ఉత్సాహాన్ని నింపింది. రెండో దఫా ఫిబ్రవరి 6న వస్తుండడం ఒక రోజు పాటు రైతు పోరు బాట నిర్వహిస్తుండడంతో పార్టీ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

Thursday, February 2, 2012

అపరిచితులను రక్తం వచ్చేలా పొడిచేస్తున్న రౌడీ చికెన్

ఇంటికి కాపలా కోసం అందరూ కుక్కను పెంచుకుంటారు. ఇది అందరూ చేసే పనే. అయితే ఆ ఇంటికి మాత్రం కోడి సెక్యూరిటీ గార్డుగా వ్యవహరిస్తోంది. అపరిచితులు ఇంట్లోకి ప్రవేశిస్తే రక్తం వచ్చేలా పొడిచి తరుముతున్న రౌడీ కాపలా కోడిపై ప్రత్యేక కథనం. సాధారణంగా ఎవరైన ఇంటి కాపలా కోసం కుక్కను పెంచుకుంటారు. కొంచెం ఆర్థికంగా బాగున్నవారు సెక్యూరిటీగార్డును నియమించుకుంటారు. కానీ వీరికి మాత్రం కోడి ఇంటి కాపలా కాస్తూ ఇంటి దరిదాపులకు వచ్చే వారికి చుక్కలు చూపిస్తోంది.

నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం బూదూరు గ్రామానికి చెందిన జగన్నాధం, బుజ్జమ్మలు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కోడి ఇంటికి కాపలా కాస్తోంది. పౌరుషం ఎక్కువైన కోడి యజమాని లేకుండా ఇంట్లోకి ఎవరైనా ప్రవేశిస్తే కుళ్ల పొడిచేస్తోంది. గేటు దాటేంత వరకు తరిమి కొడుతోంది. ప్రహరీ గోడపై పహారా కాస్తోంది. కోడి చేష్టలు సరదాగా ఉన్నా... రక్తం వచ్చేలా దాడి చేయడంతో గ్రామస్తులు ఆ ఇంటి వైపు చూసేందుకు జంకుతున్నారు.

కృష్ణపట్నం అల్ట్రామెగా విద్యుత్‌ ప్రాజెక్టును 3960 మెగావాట్ల

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం అల్ట్రా మెగా విద్యుత్‌ ప్రాజెక్టుపై ఎపి జెన్‌కో దృష్టి మళ్లినట్లు తెలుస్తోంది. వాడరేవు 4000 మెగావాట్ల అల్ట్రామెగా విద్యుత్‌ ప్రాజెక్టుల విషయమై స్థానికుల నుంచి నిరసనలు పెద్ద ఎత్తున తలెత్తడంతో దాదాపు అంతే సామర్థ్యంగల కృష్ణపట్నంపై దృష్టి సారించాలని యోచించిన ఇంధనశాఖ అధికారులు ఇందుకోసం కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ అనుమతిని కోరినట్లు సమాచారం. కృష్ణపట్నం అల్ట్రామెగా విద్యుత్‌ ప్రాజెక్టును 3960 మెగావాట్ల (6×660) సామర్థ్యంతో అనిల్‌ అంబానీ గ్రూపునకు చెందిన రిలయన్స్‌ సంస్థ ఏర్పాటు చేయటానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, స్థానిక బొగ్గు ఉత్పత్తిదారులు మార్కెట్‌ ధర ప్రకారం బొగ్గు సరఫరా చేయాలనే ఇండోనేషియా చట్టంలో తీసుకొచ్చిన మార్పులు, ఇతర కారణాల వల్ల రిలయన్స్‌ సంస్థ ఆ ప్రాజెక్టు ప్రతిపాదనను పక్కన పెట్టింది. ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్‌ సంస్థ ఇండోనేషి యాలో మూడు బొగ్గు గనులను సేకరించింది. ఏటా 15మిలియన్‌ టన్నుల బొగ్గు కృష్ణపట్నం ప్రాజెక్టుకు అవసరం కాగలదు. దాదాపు ఐదు సంవత్సరాల క్రితమే ఈ ప్రాజెక్టును రిలయన్స్‌ సంస్థకు అప్పగించినప్పటికీ బొగ్గు సరఫరా విషయంలో ఇండోనేషియా చట్టంలో మార్పులు తేవడంతో కృష్ణపట్నం ప్రాజెక్టు ముందడుగు వేయలేకపోతుంది. పైగా ఐదు రాష్ట్రాలు మన రాష్ట్రంతో సహా మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడులు రిలయన్స్‌ సంస్థతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నుంచి రిలయన్స్‌ సంస్థ తప్పుకోవటంతో కృష్ణపట్నం ప్రాజెక్టును తమకు అప్పగించాలని కేంద్రాన్ని కోరుతూ ఇంధన శాఖ అధికారులు లేఖ కూడా రాశారు. ప్రస్తుతం కేంద్రం నుంచి సమాధానం కోసం వేచిచూస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ప్రకాశం జిల్లా, నాగులప్పడపాడు మండలం, కనుపర్తి గ్రామంలో రూ.24,000 కోట్ల వ్యయంతో 2,043 ఎకరాల స్థలంలో వాడరేవు థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టును చేపట్టాలని ఎపిజెన్‌కో యోచించింది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల కాలుష్యంతో తమ జీవితాలు పాడవుతాయన్న భయంతో గ్రామస్తులు ఈ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వాడరేవు ప్రాజెక్టు కోసం దశలవారీగా జెన్‌కో ప్రణాళికను రూపొందించుకుని ముందుకు వెళ్లాలని సిద్ధపడింది. కానీ, స్థానికంగా నిరసనలు, వ్యతిరేకత కారణంగా వాడరేవు ప్రాజెక్టుకు బదులుగా కృష్ణపట్నం ప్రాజెక్టుపై దృష్టిని సారించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేరు తెరపైకి

రాష్ట్ర మంత్రి వర్గం విస్తరణ చర్చకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ నెల్లూరు జిల్లా నుంచి సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేరు తెరపైకి వస్తోంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ఆదాల పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆదాల పేరు ప్రముఖంగా వినిపిస్తూ వస్తోంది. ముఖ్యమంత్రికి, జిల్లాకు చెందిన ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి లకు మధ్య సఖ్యత కొరవడిందనే ప్రచారం నేపథ్యంలోనూ ఆదాల పేరు తెరపైకి వచ్చింది.

గతంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం హయాంలోనూ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్న సందర్భాలు అనేకం వున్నాయి. ఆదాలకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తే ఆనం రామనారాయణరెడ్డిని తప్పిస్తారనే ఊహాగానాలకు బలం చేకూరడం లేదు. ఆనంను కొనసాగిస్తూనే ఆదాలకు చోటు కల్పించే అవకాశాలే కనిపిస్తున్నాయి. జిల్లాలో కోవూరు ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో, ఉదయగిరి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఆదాలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయని కాంగ్రెస్‌లో ఒక వర్గం భావిస్తోంది. కడప, చిత్తూరు జిల్లాల నుంచి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఆదాలకు చోటు ఎలా దక్కుతుందని మరో వర్గం అంటోంది.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.
రాజశేఖర్‌రె డ్డి మరణం తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో మారిన సమీకరణాల నేపథ్యంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వైపు వెళ్తారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అనేక పరిణామాల నేపథ్యంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వైపు వెళ్లకపోవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో కాంగ్రెస్‌పార్టీని మరింత బ లోపేతం చేసేందుకు ఆదాలకు ప్రాధాన్యం ఇవ్వడం సముచితమేననే భావన కాంగ్రెస్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పెద్ద కాంట్రాక్టర్‌ అయిన ఆదాల ప్రభాకర్‌రెడ్డికి రాజకీయాల్లో ప్రత్యేకమైన శైలివుంది. ఆయన నిరంతరం రాజకీయాలు చేయరు. ప్రత్యర్థులను సైతం విమర్శలు చేయరు. ఎన్నికలప్పుడే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి ప్రత్యర్థులను మట్టికరిపిస్తుంటారు. ఆర్థికంగా బలం కలిగిన ఆదాల సేవలు ఉప ఎన్నికల నేపత్యంలో కీలకమైన నేపథ్యంలో, కాంగ్రెస్‌లో గ్రూపుల రాజకీయాలు ఊపందుకున్న తరుణంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు సన్నిహితుడైన ఆదాల ప్రభాకర్‌ రెడ్డికి మంత్రి వర్గంలో చోటు కల్పించవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

పిల్లల్లో దృష్టిలోపంతోపాటు అంధత్వం కూడా

పెద్దల అవగాహన లోపం వలన సరైన సమయాల్లో చికిత్స చేయించకపోవడం వల్ల పిల్లల్లో దృష్టిలోపంతోపాటు అంధత్వం కూడా సంక్రమిస్తుందని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, మోడరన్‌ ఐ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అధినేత డాక్టర్‌ పిఎల్‌.రావు తెలిపారు. ఆయన బుధవారం మేజర్‌న్యూస్‌తో మాట్లాడుతూ వస్తువుల మీద పడిన కాంతి ప్రతి వక్రీకరణ చెంది కంటి భాగాల ద్వారా ప్రసరించి రెటీనా అనే కంటి నరంపై పడి ప్రతిబింబం ఏర్పడుతుందన్నారు. కంటి నరం ద్వారా విద్యుత్‌ రసాయన చర్యచే మెదడు ఆ వస్తువు యొక్క రూపాన్ని గ్రహించగలుగుతుందన్నారు. కాంతి కిరణాలు వివిధ భాగాల ద్వారా (కార్నియా, లెన్స్‌, విట్రియస్‌) రెటీనాను చేరే ప్రక్రియలో ఎక్కడా అవరోధం ఏర్పడినా చూపు దెబ్బతింటుందని తెలిపారు. 
నల్లగుడ్డు, (కార్నియా) మచ్చలు ఏర్పడ్డ, గాయల వలన దెబ్బతిన్న కటకం (లెన్స్‌)లో పారదర్శకత లోపించి శుక్లం ఏర్పడ్డ లోపలి నరముల రెటీనా పాడైనా దృష్టి కోల్పోవడం జరుగుతుందన్నారు. వృత్తి రీత్యా ఎంత ప్రాధాన్యం వున్నా సున్నితమైన కంటిని రక్షించేందుకు ప్రకృతి ప్రసాదించిన కనురెప్పలు మాత్రమే అన్నారు. ఆఫ్తాల్మియా నియోనెటోరం అనే ఈ వ్యాధి అతి ప్రమాదకరమైందన్నారు. అపరిశుభ్ర వాతావరణంలో, ఇళ్లలో జరిగే కాన్పుల్లో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తుందన్నారు. తల్లి జననాంగాల అపరిశుభ్రత కూడా ఈ వ్యాధికి కారణమన్నారు. ఏడాది లోపు పిల్లల్లో కంటి పాప స్థానంలో తెల్లగాను, పసుపుగాను ఉండి మెరుస్తున్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా కంటి వైద్యులకు చూపించాలన్నారు. కంటిలో శుక్లం గాని రెటీనోబ్లాస్టోమా అనే క్యాన్సర్‌ వ్యాధి వుండవచ్చని అభిప్రాయపడ్డారు.

దృష్టిలో లోపాలు ఉన్న పిల్లలు బోర్డు మీద రాసినవి కనపడక చదువుమీద శ్రద్ధ వున్నా తరగతిలో ముందుకు పోలేక అభద్రతా భావానికి లోనవుతున్నారని తెలిపారు. కంటి అద్దాలతో దృష్టి దోషాన్ని సరిచేస్తే వారి సమస్యలు అంతర్థానమవుతాయని తెలిపారు. హ్రస్వ దృష్టి పరావర్తనం చెందిన కాంతి కిరణాలు రెటీనా వెనుక వైపు కాకుండా ముందు వైపు కేంద్రీకృతమవుతాయన్నారు. చిన్న పిల్లల్లో బాగా టివికి దగ్గరగా వెళ్తుంటారని, దీనిని తల్లిదండ్రులు దురలవాటుగా భావించి పిల్లలను మందలించిన సందర్భాలు ఎక్కువన్నారు. పిల్లల్లో తప్పనిసరిగా ఏడాదికొక్కసారి నేత్ర పరీక్షలు, దంత పరీక్షలు చేయించడం మంచిదని తెలిపారు. మెల్లకన్ను వున్నవారు అదృష్టవంతులనే వ్యాఖ్య సరికాదని, మెల్లకన్నుకు ఎంత త్వరగా చికిత్స చేస్తే అంత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. 1, 2 సంవత్సరాల వయసు గల పిల్లలకు చికిత్స మెల్లకన్నుకు చేసినట్లయితే కంటిచూపు సక్రమంగా ఉంటుందన్నారు.

మెల్లకన్ను విషయంలో పిల్లలు పెరిగే కొద్దీ చికిత్స కష్టతరమవుతుందని తెలిపారు. పిల్లలు పెద్దయిన తర్వాత ఆపరేషన్‌ ద్వారా మెల్ల కన్నును సరిచేయవచ్చుకాని తగిన చూపును మాత్రం తిరిగి పొందేటట్లు చేయడం సాధ్యం కాదన్నారు. పిల్లలకు కూసుగావున్న మొనలేని ఆట వస్తువులు పరికరాలను ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లల దరి చేరనీయకూడదన్నారు. పుల్లలతో, బాణాలతో కత్తి యుద్ధం లాంటి ఆటలాడుతూ కంటికి దెబ్బ తగిలించుకుని దృష్టి పోగొట్టుకునేవారు ఎక్కువ మంది వున్నారని తెలిపారు. కంటికి దెబ్బ తగిలినప్పుడు కంటిని నలపకుండా తెల్లని శుభ్రమైన రుమాలును (చేతిగుడ్డ) మడత వేసి కంటిపై వుంచి కంటి వైద్యులను సంప్రదించాలని తెలిపారు. ఆహారంలో విటమిన్‌ ఎ వల్ల లోపం ముందుగా కన్నులోని తడి ఆరిపోవడం, తెల్లగుడ్డుపై తెల్లని మచ్చలు త్రిభుజాకారంలో మెరుస్తున్న తెల్లని స్పాంజి లాంటి మచ్చలు, రేచీకటి వంటి వ్యాధులు వస్తాయని ఆయన తెలిపారు. ఈ వ్యాధుల పట్ల పూర్తి నిర్లక్ష్యం వహిస్తే శాశ్వత అంధత్వానికి గురి కావాల్సివస్తుందని తెలిపారు.

కంటిలోని జబ్బులకు, ఇతర కంటి వ్యాధులకు నాటు వైద్యాలు చేయడం ద్వారా శాశ్వతంగా గుడ్డివారు కావడం తప్పదని హెచ్చరించారు. నాటు వైద్యాల ద్వారా ఉన్న రోగం ఎక్కువై మొదటికే మోసం వచ్చే విషయాన్ని గమనించుకోవాలని ఆయన సూచించారు. ఏ వయసువారికైనా కంటి వైద్యం చేయడానికి అనువైన అధునాతన వసతులు, పరికరాలు, నిష్ణాతులైన వైద్య సేవలను అందించడమే మోడరన్‌ ఐ హాస్పిటల్‌ లక్ష్యమని డాక్టర్‌ పిఎల్‌.రావు తెలిపారు. 

తెలుగుదేశం పార్టీ సత్తా ఏమిటో రానున్న ఉప ఎన్నికలలో...

కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం అభిమాన కేంద్రమైన తెలుగుదేశం పార్టీని గెలిపించి తద్వారా పార్టీ ప్రతిష్టను పెంచి నల్లపురెడ్డికి తన బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం జిల్లా అద్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకూరుపేట మండలం బుధవారం రోడ్డు షో నిర్వహించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసన్న వైఖరిని తీవ్రంగా విమర్శించారు. తెలుగుదేశం పార్టీ సత్తా ఏమిటో రానున్న ఉప ఎన్నికలలో బట్టబయలవుతుందని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ ద్వారా గెలిచి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రసన్నకుమార్‌రెడ్డికి పార్టీ ప్రతిష్ట చులకనైపోయిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకుని ప్రసన్నకు తగిన గుణపాఠం చెబుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు కైలాసం ఆదిశేషారెడ్డి, ఇందుకూరుపేట మండలాధ్యక్షుడు వీరేంద్రనాయుడు, రమణప్పనాయుడు, తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Tuesday, January 31, 2012

ఆధ్యాత్మిక ముసుగులో కోట్ల రూపాయల విలువ చేసే స్థలాలను కబ్జా


ఆధ్యాత్మిక ముసుగులో కోట్ల రూపాయల విలువ చేసే స్థలాలను కబ్జా చేయడమేకాకుం డా ఎంతో మంది అమాయిలకుల జీవితాల తో ఆటలాడుతున్న దొంగబాబాలు పుట్టగొడు గుల్లా వెలుస్తున్నారు. నాయుడుపేట పట్టణం లోని తిమ్మాజికండ్రిగ కాజ్‌వేను అనుకుని ఇప్పటికే పదుల సంఖ్యలో ఆశ్రమాలు వెల సివున్నాయి. ఈ బాబాలు ఎవరో.. ఎక్కడ నుంచి వచ్చారో.. ఎవరికి తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న వారికి వారే స్వర్ణము ఖినదిని ఆక్రమణ చేసి హద్దులు ఏర్పాటు చేసుకోవడం అందరిని విస్మయానికి గురిచే స్తుంది. ఆధ్యాత్మిక ముసుగులో స్వర్ణముఖిన దిని కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్న ఈ దొంగ బాబాల భూ దందాలపై రెవెన్యూ అధికారులు కూడా దృష్టి సారించడం లేదు. స్వర్ణముఖినదిని పరిరక్షించాల్సిన మైనింగ్‌ అధికారులు కూడా ఆదిశగా చర్యలు తీసుకో కపోవడంతో రోజుకో ఆశ్రమం, వారానికో బా బా ఇక్కడ దర్శనమిస్తున్నారు. రైతులకు, ప్ర జలకు వరప్రసాదినిగా ఉన్న స్వర్ణముఖినదిని కబ్జా చేయడం ద్వారా వరద ఉదృతి సమ యంలో అనేక గ్రామాలు నీటమునిగే ప్రమా దం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడ నుం చో వచ్చిన ఈ దొంగబాబాలు పలు నేరాలకు పాల్పడడమేకాక నేరస్తులకు ఆశ్రయమిచ్చే సూచనలు కూడా కనిపిస్తోన్నాయి. రాత్రి స మయంలో నది ఒడ్డున మాంత్రిక పూజలు చేస్తున్న కారణంగా ప్రజలు బెంబేలు చెందు తున్నారు. ఇప్పటికే ఇసుక అక్రమ రవాణాతో రూపురేఖలు కోల్పొయిన దొంగబాబాల ఆశ్ర మాల చాటున జరుగుతున్న కబ్జాలతో నది గ్రామాలను తలపించే విధంగా మారిపో నుంది. అమాయిక ప్రజలను తమ మాంత్రిక శక్తులతో ఆకర్షితులను చేస్తున్న దొంగబాబాలు వారి జీవితాల తో చెలగాటమాడుతున్నారు. బిరదవాడ సమీపంలో వెలసిన ఓ ఆశ్రమం లోని స్వామి భక్తిపేరుతో వికృత చేష్టలకు పాల్పడడమేకాక విదేశీయులను సైతం ఆక ర్షించి ఇక్కడ ఉన్న కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆధ్యాత్మి క ముసుగులో కొనసాగుతున్న భూకబ్జాలపై దృష్టి సారించి అవసరమైన చర్యలు చేపట్ట కపోతే దొంగబాబాలు ఇంకా మరి కొంత మంది పుట్టుకొచ్చే అవకాశాలు లేకపోలేదు.

మరమ్మత్తులకు నోచుకోని నెల్లూరు పెన్నా బ్రిడ్జ్

అది అరవై ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన. అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది వాహనాలు దానిపై ప్రయాణించాయి. అయితే ఇన్నేళ్లలో దానిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ప్రస్తుతం ఇది శిథిల స్థితికి చేరి ప్రమాదకరంగా మారింది. నెల్లూరు సమీపంలో ప్రమాదకర స్థితిలో ఉన్న పెన్న బ్రిడ్జ్‌పై కథనం! నెల్లూరు నగరాన్ని ఆనుకుని ఉన్న పెన్న బ్రిడ్జ్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. అరవై ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెనపై రోడ్డంతా గుంతలుపడింది. 

చెట్లు పెరిగిపోయాయి. నెల్లూరు నుంచి కోవూరు, కావాలి, విజయవాడ వైపు నిత్యం వేలాది వాహనాలు దీనిపై నుంచి వెళతాయి. అయితే ఇటీవల దీనిపై వెళుతున్నప్పుడు వంతెన ఊగుతున్నట్టు అనిపిస్తోందని...వాహనదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ బ్రిడ్జ్‌పై వెళుతుంటే ఎప్పుడు కూలిపోతుందో తెలియక భయపడిచస్తున్నామని స్థానికులు అంటున్నారు. 

దీనిపై పాలకులు, అధికారులు దృష్టిపెట్టి ప్రత్యామ్నాయంగా మరో వంతెన నిర్మించాలని వారు కోరుతున్నారు. ప్రమాదం ఉందని తెలిసినప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే అనర్థం తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు. బ్రిడ్జి పరిశీలనకు నిపుణులను పంపి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

గుప్తనిధులు దొంగలను పట్టుకుంటాం : డీఎస్పీ


గుప్త నిధుల కోసం పురాతన దేవాలయాలను, కట్టడాలను కూల్చి వేస్తున్న దొంగలను త్వరలోనే పట్టుకుంటామని కావలి డీఎస్పీ ఇందిర అన్నారు. మంగళవారం ఉదయగిరి సర్కిల్‌పోలీస్‌ స్ఠేషన్‌ తనిఖీ నిమిత్త వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉదయగిరి ప్రాంతంలో అత్యధికంగా దేవాలయాలు నిర్మించారని, అందులో గుప్తనిధులు ఉన్నాయనే అనుమానాలతో ధ్వంసం చేస్తున్నారని వీరు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. దుండగులకోసం పోలీస్‌ ప్రత్యేక బలగాలను రంగంలోకి దించామన్నారు. మండలంలో సర్వరాబాద్‌లో ఎస్సీలకు, గ్రామస్తులకు మధ్య భూ వివాదం కారణంగా కేసులు నమోదయి ఉన్నాయన్నారు. వీటిని స్థానిక తహసీల్దార్‌ వెంకటనారాయణమ్మ ఆధ్వర్యంలో విచారిస్తామన్నారు. అలాగే వింజమూరుకు చెందిన ఓ దిన పత్రిక విలేకరిపై వచ్చిన అట్రాసిటీ ఫిర్యాదును విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఉదయగిరి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కళ్యాణరాజు, ఎసై్స రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh