online marketing

Tuesday, January 31, 2012

మరమ్మత్తులకు నోచుకోని నెల్లూరు పెన్నా బ్రిడ్జ్

అది అరవై ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన. అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది వాహనాలు దానిపై ప్రయాణించాయి. అయితే ఇన్నేళ్లలో దానిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ప్రస్తుతం ఇది శిథిల స్థితికి చేరి ప్రమాదకరంగా మారింది. నెల్లూరు సమీపంలో ప్రమాదకర స్థితిలో ఉన్న పెన్న బ్రిడ్జ్‌పై కథనం! నెల్లూరు నగరాన్ని ఆనుకుని ఉన్న పెన్న బ్రిడ్జ్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. అరవై ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెనపై రోడ్డంతా గుంతలుపడింది. 

చెట్లు పెరిగిపోయాయి. నెల్లూరు నుంచి కోవూరు, కావాలి, విజయవాడ వైపు నిత్యం వేలాది వాహనాలు దీనిపై నుంచి వెళతాయి. అయితే ఇటీవల దీనిపై వెళుతున్నప్పుడు వంతెన ఊగుతున్నట్టు అనిపిస్తోందని...వాహనదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ బ్రిడ్జ్‌పై వెళుతుంటే ఎప్పుడు కూలిపోతుందో తెలియక భయపడిచస్తున్నామని స్థానికులు అంటున్నారు. 

దీనిపై పాలకులు, అధికారులు దృష్టిపెట్టి ప్రత్యామ్నాయంగా మరో వంతెన నిర్మించాలని వారు కోరుతున్నారు. ప్రమాదం ఉందని తెలిసినప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే అనర్థం తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు. బ్రిడ్జి పరిశీలనకు నిపుణులను పంపి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh