కోవూరు ఉప ఎన్నిక నిర్వహణకు సమాయతం కండి సమీక్షా సమావేశంలో సి ఇ ఓ భన్వర్ లాల్ . నియోజకవర్గ ఓటరు నమోదు తుది జాబితా తయారీ. కోవూరు ఉప ఎన్నికలకు అధికారులు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారని ఛీప్ ఎన్నికల కమిషనర్ బన్వర్‌లాల్ తెలిపారు. స్థానిక గోల్డెన్‌జూబ్లీహాల్లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, అందులో కోవూరు ఒకటన్నారు. ఈ ఏడాది జనవరి పదో తేదీ వరకూ ఓటర్ల లిస్టు పూర్తయిందన్నారు. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ ప్రకటిస్తే అప్పుడు పూర్తి జాబితా సిద్ధమవుతుందన్నారు. జిల్లాలో 63శాతం కాగా ఒక్క కోవూరులోనే 67 శాతం ఓటర్ల నమోదు జరిగిందన్నారు. వివిధ రాజకీయపార్టీల సూచనల మేరకు కోవూరు నియోజకవర్గంలో ఈ నెలాఖరు దాకా ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతుందన్నారు. 18 ఏళ్లు నిండిన యువకులందరూ ఓటర్లుగా చేరాలన్నారు. ఓటర్ల చేర్పులు, మార్పులు నిరంతరంగా ఉంటుందని తెలిపారు. ఈనెలాఖరువరకు నకిలీ ఓటర్ల గుర్తింపు, కొత్త ఓటర్ల చేర్పు విషయమై ఇంటింటి వెళ్లి తనిఖీలు చేస్తారని చెప్పారు. అలాగే పోలింగ్ స్టేషన్ విషయం కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఎక్కువ, తక్కువ మంది ఓటర్లున్న కేంద్రాలను గుర్తించి అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. ఈ రోజ జరిగిన సమావేశానికి అన్ని రాజకీయపార్టీలు హాజరయ్యాయని తెలిపారు. మద్యం, డబ్బు, క్రైం విషయాలు చర్చకు వచ్చాయన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన వెంటనే నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు. పత్రికలు, టివిల్లో అభ్యర్థుల తరపున ప్రచురించే ప్రకటనల నియంత్రణకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో రెండు కమిటీలుంటాయన్నారు. ఇద్దరు పత్రికా ప్రతినిధులతోపాటు, అధికారులు అందులో సభ్యులుగా ఉంటారన్నారు. ప్రతి నాలుగు గంటల సమయంలో కమిటీ విశ్లేషించి అది పెయిడ్ న్యూస్ అయితే ఆ ప్రకటన ఖర్చును అభ్యర్థుల జాబితాలో చేర్చతామని తెలిపారు. నెల్లూరు నగరంలో డోర్‌నెంబర్లు సరిగాలేవని కొందరు నాయకులు తన దృష్టికి తీసుకొచ్చారనన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సరిచేస్తామని తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. సమావేశంలో కలెక్టర్ బి. శ్రీధర్, ఎస్‌పి బి.వి. రమణకుమార్, జాయింట్ కలెక్టర్ సౌరభ్‌గౌర్, డిఆర్‌ఓ బి.రామిరెడ్డి, కావలి, నెల్లూరు ఆర్‌డిఓలు సుబ్రమణ్యేశ్వర రెడ్డి, మాధవీలత, జడ్‌పి సిఇఓ జి.వి. జయరామయ్య, మాజీ ఎంఎల్‌ఎ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, సిపిఎం ప్రతినిధి జి. శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి పముజుల దశరథరామయ్య, బిజెపి ప్రతినిధి కాళేశ్వరరావు, టిడిపి ప్రతినిధులు చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, భువనేశ్వర్,కోవూరు, విడవలూరు, ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాళెం మండలాల తహశీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment