పొదలకూరు: నిమ్మకాయలధరలు ఇటీవల కాలంలో తక్కువగావుండి ధరలు లేకపోవడంతో నిమ్మరైతులు చెట్లపైనే కాయలువదిలేశారు. ఉన్నట్టుండి అమాంతం ఒక్కసారిగా నిమ్మధరలు పెరగడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. రాబోయే రోజుల్లో నిమ్మ ధరలకు గిరాకి పెరగడంతో దిగుబడి గణనీయంగా తగ్గుతోంది. పొదలకూరు నిమ్మమార్కెట్‌యార్డ్‌లో గురువారం లావులు లూజు బస్తా రూ.2వేలు నుంచి రూ.2700ల వరకు, సన్నాలు రూ.15వందలనుంచి రూ.2500ల వరకు ధర పలికింది. ఒక్కో దుకాణానికి పదికి మించి లూజు బస్తాలు రావడం లేదు. ఒకవేళ వచ్చినా నిమ్మకాయలు పండిపోయి ఉంటున్నాయి. నిమ్మరైతులకు ధరలు ఊరట కల్గిస్తున్నా ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడంతో వారికి నష్టం తప్పడంలేదు. గత ఏడాది లూజు బస్తా రూ.700ల నుండి వెయ్యి రూపాయల వరకు ఉండేది. కానీ ఈ ఏడాది లూజుబస్తా సన్నాలు రూ.2500లు పలుకుతున్నాయి. గూడూరు, వెంకటగిరి మార్కెట్‌లతో పోల్చితే ఇక్కడ ధరలు బాగా పెరిగాయని చెప్పవచ్చు.
పొదలకూరు నిమ్మయార్డ్ నుండి ఢిల్లీ, కోల్‌కత్తా, ఘోరక్‌పూర్, లక్నో, మధురై, కేరళ, బీహార్, పట్నా, కర్నాటక, చెనై్న, రాంచి, గయ, పట్టణ, రాష్ట్రాలకు నిమ్మకాయలను ఎగుమతి చేస్తుంటారు. పొదలకూరు, చేజర్ల, కలువాయి, రాపూరు, ఆత్మకూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల నుండి పొదలకూరు నిమ్మయార్డ్‌కు రోజుకు 12వందల బస్తాలు వస్తుంటాయి. ఈ ప్రాంత నిమ్మరైతులు గతంలో 18వేల ఎకరాల వరకు నిమ్మసాగు చేపట్టి యార్డ్‌కు నిమ్మకాయలు తరలించేవారు. ప్రస్తుతం 6వేల ఎకరాల్లో కూడా నిమ్మసాగు లేకపోవడంతో యార్డ్‌కు కాయలు రావడంలేదు. ఈ నేపథ్యంలో ధరలు పెరగడంతో రైతులకు ఆనందం వచ్చినా, దిగుబడిలేని కారణంగా ఆవేదన చెందుతున్నారు. పలు రకాల తెగుళ్లతో చెట్లు చనిపోయి మరికొన్ని చెట్లు నీరు సరిపడినంతలేక ఎండుకొమ్మలు ఏర్పడటంతో దిగుబడి తగ్గుతుంది. కావున ఉధ్యానవనశాఖ అధికారులు నిమ్మరైతులకు సూచనలు, సలహాలు అందించి నిమ్మదిగుబడికి కృషిచేయాలని రైతులు కోరుతున్నారు.

No comments:
Post a Comment