నెల్లూరు : సమస్యలు పరిష్కరించాలని పోలీసు స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాం. తమ గోడును పట్టించుకునే నాధుడు లేరు. మీరైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని బాధితులు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజావిజ్ఞప్తుల దినంలో ఎస్పీ రమణకుమార్‌కు విన్నవించుకున్నారు. స్పందించిన ఎస్పీ వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని ఆయా ప్రాంతాల పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజావిజ్ఞప్తుల దినంలో 22 అర్జీలు వచ్చాయి. అందులో ఏడు అర్జీలు సివిల్ వివాదాలకు సంబంధించినవి కావడంతో వాటిని లీగల్‌సెల్ అథారిటీకి పంపారు.
భర్త వేధింపుల నుంచి కాపాడండి
భర్త, అత్తింటి వారి వేధింపుల నుంచి తనను కాపాడాలని సుబేదార్‌పేట ఆజాద్‌వీధికి చెందిన బి. సువర్ణలక్ష్మి కోరారు. అనంతపురం జిల్లా బుచ్చయ్యగారిపల్లెకు చెందిన బి.వి శ్రీధర్‌తో 2010 ఆగస్టు 15వ తేదీన తనకు వివాహమైందని తెలిపారు. శ్రీధర్ బెంగళూరులోని టీఎస్‌పీ లిమిటెడ్ కంపెనీలో కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. వివాహ సమయంలో తన తల్లిదండ్రులు రూ.1.50 లక్షలు, పది సవర్ల బంగారు ఆభరణాలను కట్నం కింద ఇచ్చారని తెలిపారు. కొద్దిరోజులు సజావుగా తమ కాపురం సాగిందన్నారు. అనంతరం అదనపు కట్నం కింద రూ.3లక్షలు తీసుకురావాలని భర్తతో పాటు అత్తింటి వారు తనను తీవ్ర వేధింపులకు గురిచేశారన్నారు. ఈనేపథ్యంలో అదే ఏడాది డిసెంబర్‌లో తనను బలవంతంగా ఇంట్లోనుంచి బయటకు గెంటేశారన్నారు. ఈ విషయమై అప్పటి నుంచి తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్తింటివారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
రౌడీషీట్‌ను తొలగించాలి
తనపై అన్యాయంగా బనాయించిన రౌడీషీట్‌ను తొలగించాలని దొరవారిసత్రం ఆర్‌ఎంపీ వైద్యులు చింతపూడి అయ్యన్న కోరారు. తాను కొంతకాలంగా ఆ ప్రాంతంలో దళితుల సమస్యలపై ఉద్యమిస్తున్నానని తెలిపారు. స్థానిక పోలీసులు ఓ పథకం ప్రకారం తనపై అన్యాయంగా రౌడీషీట్‌ను తెరిచారని తెలిపారు. దీనిపై విచారణ చేసి రౌడీషీట్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
నా భర్తను దారిలో పెట్టండి
మద్యానికి బానిసై తన భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని, అతన్ని సరైన దారిలో పెట్టాలని నెల్లూరు రూరల్ మండలం సౌత్‌మోపూరుకు చెందిన చక్కిరాల వెంకటశేషమ్మ కోరారు. తనకు 20 ఏళ్ల కిందట శేషయ్యతో వివాహమైందన్నారు. ఇద్దరు పిల్లలున్నారని తెలిపారు. మద్యానికి బానిసైన శేషయ్య రోజూ తమను వేధింపులకు గురిచేస్తున్నాడన్నారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి కాపాడండి
రియల్ ఎస్టేట్ వ్యాపారుల బారి నుంచి కాపాడాలని మనుబోలు కోదండరామపురం అరుందతీయవాడ వాసులు ఎస్పీని కోరారు. తాము 30ఏళ్లుగా కోదండరామపురంలోని ప్రభుత్వ భూమిలో నివాసముంటున్నామని తెలిపారు. తాజాగా బాలాజీ ఎన్‌క్లేవ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ స్థలం తమదంటూ తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, తమ ఇళ్లను కూలదోసి నిలువ నీడ లేకుండా చేస్తున్నారని తెలిపారు. వారి భారి నుంచి తమను కాపాడాలని కోరారు.
అన్యాయంగా కేసుపెట్టారు
తమ తల్లిదండ్రులపై రెండోనగర పోలీసులు అన్యాయంగా కేసు పెట్టారని తడికలబజారుకు చెందిన ఎర్రమల్లి హరికృష్ణ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. తన తమ్ముడు మదుకు జగదేవిపేటకు చెందిన లావణ్యతో 2005లో వివాహమైందన్నారు.
వివాహమైన నాటినుంచి మధు, భార్యతో కలిసి తమకు దూరంగా ఉంటున్నారన్నారు. ఈక్రమంలో మధు, లావణ్య నడుమ విబేధాలు పొడచూపాయన్నారు. దీంతో లావణ్య మధుతో పాటు తన తల్లిదండ్రులైన చిన్నయ్య, చిన్నమ్మపై రెండోనగర పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. పోలీసులు మధుతోపాటు తమ తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారని తెలిపారు. హరికృష్ణ తల్లిదండ్రులకు ఎలాంటి సంబంధం లేనప్పటికి కేసు నమోదు చేయడం దారుణమని దీనిపై విచారించి న్యాయం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కర్నాటి ఆంజనేయరెడ్డి, మిడతల రమేష్ ఎస్పీని కోరారు. సమస్యలు పరిష్కరించాలని పోలీసు స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాం. తమ గోడును పట్టించుకునే నాధుడు లేరు. మీరైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని బాధితులు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజావిజ్ఞప్తుల దినంలో ఎస్పీ రమణకుమార్‌కు విన్నవించుకున్నారు. స్పందించిన ఎస్పీ వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని ఆయా ప్రాంతాల పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజావిజ్ఞప్తుల దినంలో 22 అర్జీలు వచ్చాయి. అందులో ఏడు అర్జీలు సివిల్ వివాదాలకు సంబంధించినవి కావడంతో వాటిని లీగల్‌సెల్ అథారిటీకి పంపారు.
భర్త వేధింపుల నుంచి కాపాడండి
భర్త, అత్తింటి వారి వేధింపుల నుంచి తనను కాపాడాలని సుబేదార్‌పేట ఆజాద్‌వీధికి చెందిన బి. సువర్ణలక్ష్మి కోరారు. అనంతపురం జిల్లా బుచ్చయ్యగారిపల్లెకు చెందిన బి.వి శ్రీధర్‌తో 2010 ఆగస్టు 15వ తేదీన తనకు వివాహమైందని తెలిపారు. శ్రీధర్ బెంగళూరులోని టీఎస్‌పీ లిమిటెడ్ కంపెనీలో కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. వివాహ సమయంలో తన తల్లిదండ్రులు రూ.1.50 లక్షలు, పది సవర్ల బంగారు ఆభరణాలను కట్నం కింద ఇచ్చారని తెలిపారు. కొద్దిరోజులు సజావుగా తమ కాపురం సాగిందన్నారు. అనంతరం అదనపు కట్నం కింద రూ.3లక్షలు తీసుకురావాలని భర్తతో పాటు అత్తింటి వారు తనను తీవ్ర వేధింపులకు గురిచేశారన్నారు. ఈనేపథ్యంలో అదే ఏడాది డిసెంబర్‌లో తనను బలవంతంగా ఇంట్లోనుంచి బయటకు గెంటేశారన్నారు. ఈ విషయమై అప్పటి నుంచి తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్తింటివారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
రౌడీషీట్‌ను తొలగించాలి
తనపై అన్యాయంగా బనాయించిన రౌడీషీట్‌ను తొలగించాలని దొరవారిసత్రం ఆర్‌ఎంపీ వైద్యులు చింతపూడి అయ్యన్న కోరారు. తాను కొంతకాలంగా ఆ ప్రాంతంలో దళితుల సమస్యలపై ఉద్యమిస్తున్నానని తెలిపారు. స్థానిక పోలీసులు ఓ పథకం ప్రకారం తనపై అన్యాయంగా రౌడీషీట్‌ను తెరిచారని తెలిపారు. దీనిపై విచారణ చేసి రౌడీషీట్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
నా భర్తను దారిలో పెట్టండి
మద్యానికి బానిసై తన భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని, అతన్ని సరైన దారిలో పెట్టాలని నెల్లూరు రూరల్ మండలం సౌత్‌మోపూరుకు చెందిన చక్కిరాల వెంకటశేషమ్మ కోరారు. తనకు 20 ఏళ్ల కిందట శేషయ్యతో వివాహమైందన్నారు. ఇద్దరు పిల్లలున్నారని తెలిపారు. మద్యానికి బానిసైన శేషయ్య రోజూ తమను వేధింపులకు గురిచేస్తున్నాడన్నారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి కాపాడండి
రియల్ ఎస్టేట్ వ్యాపారుల బారి నుంచి కాపాడాలని మనుబోలు కోదండరామపురం అరుందతీయవాడ వాసులు ఎస్పీని కోరారు. తాము 30ఏళ్లుగా కోదండరామపురంలోని ప్రభుత్వ భూమిలో నివాసముంటున్నామని తెలిపారు. తాజాగా బాలాజీ ఎన్‌క్లేవ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ స్థలం తమదంటూ తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, తమ ఇళ్లను కూలదోసి నిలువ నీడ లేకుండా చేస్తున్నారని తెలిపారు. వారి భారి నుంచి తమను కాపాడాలని కోరారు.
అన్యాయంగా కేసుపెట్టారు
తమ తల్లిదండ్రులపై రెండోనగర పోలీసులు అన్యాయంగా కేసు పెట్టారని తడికలబజారుకు చెందిన ఎర్రమల్లి హరికృష్ణ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. తన తమ్ముడు మదుకు జగదేవిపేటకు చెందిన లావణ్యతో 2005లో వివాహమైందన్నారు.
వివాహమైన నాటినుంచి మధు, భార్యతో కలిసి తమకు దూరంగా ఉంటున్నారన్నారు. ఈక్రమంలో మధు, లావణ్య నడుమ విబేధాలు పొడచూపాయన్నారు. దీంతో లావణ్య మధుతో పాటు తన తల్లిదండ్రులైన చిన్నయ్య, చిన్నమ్మపై రెండోనగర పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. పోలీసులు మధుతోపాటు తమ తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారని తెలిపారు. హరికృష్ణ తల్లిదండ్రులకు ఎలాంటి సంబంధం లేనప్పటికి కేసు నమోదు చేయడం దారుణమని దీనిపై విచారించి న్యాయం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కర్నాటి ఆంజనేయరెడ్డి, మిడతల రమేష్ ఎస్పీని కోరారు.