నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని అభివృద్ధి పనులతో మరింత అభివృద్ధి పరిచి జాతీయ స్థాయి గుర్తింపు కల్పించేందుకు చర్యలు చేపడుతానని తిరుపతి ఛీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు చలపతిరావు మంగళవారం తెలిపారు. ఆయన నేలపట్టు పక్షుల కేంద్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా చలపతి రావు మాట్లాడుతూ ప్రపంచంలో పెలికాన్ పక్షులు 7వేలు ఉన్నాయని అందులో 2500 పెలికాన్ పక్షులు నేలపట్టు పక్షుల కేంద్రంకు వచ్చి కడప చెట్లపై ఆవాసం ఉంటూ తమ సంతానాన్ని పెంపోందించుకుంటున్నాయన్నారు. ఈ వలస విహంగాల రక్షణ కోసం పక్షుల కేంద్రం చుట్టూ క్యాంపా స్కీమ్ ద్వారా రూ.86లక్షలతో 2.8కి.మీ రక్షణ గోడ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అంతేకాకుండా పక్షుల కేంద్రంలో రూ.15లక్షలతో చైన్ లింక్‌వాల్ రూ.17లక్షలతో వాచ్‌టవర్, జింకల పార్కు వద్ద రూ.4.50లక్షలతో బార్డ్ ఎన్‌క్లోజర్, మరో రూ.15లక్షలతో చెరువుకట్ట విస్తర్ణ, కల్వర్టు మరమ్మత్తు పనులు చేపడుతున్నారు. పక్షుల కేంద్రంలో పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు త్వరగా పనులు పూర్తి చేయకపోవడంతో వారికి నోటీసులు అందచేసినట్లు ఆయన తెలిపారు. పులికాట్ సరస్సులో ముఖద్వారాల పూడిక తీతకు ప్రతిపాధనలు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ విధంగా నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని మరింత అభివృద్ధి పరిచి జాతీయ స్థాయి గుర్తింపుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆయన వెంట సూళ్ళూరుపేట డిఎఫ్‌వో పార్ధనంద ప్రసాద్, ఫారెస్టర్ బాలాజి తదితర సిబ్బంది ఉన్నారు.
No comments:
Post a Comment