నెల్లూరుకు రావడమంటే థ్రిల్లింగ్‌గా ఉంటుందని సినీ నటుడు, నిర్మాత కొణిదల నాగేంద్రబాబు (నాగబాబు) అన్నారు. శుక్రవారం నగరంలోని డిఆర్ ఉత్తమ్ హోటల్‌లో జరిగిన భువిద సెంటర్ సిటీ కార్యక్రమంలో పాల్గొని ఆయన భువిద బ్రోచెర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ నెల్లూరులో తాను విద్యాభ్యాసం చేశానని, చాలామంది తెలిసినవారు, పరిచయస్తులు ఉన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో నెల్లూరు చాలా అభివృద్ధి చెందినదన్నారు. హైదరాబాద్‌తో పోల్చుకుంటే నెల్లూరులో స్థలాల రేట్లు కూడా తక్కువగా ఏమీ లేవన్నారు. ప్రతి ఒక్కరికీ సొంత ఊరిలో ఇల్లు ఉండాలనే కోరిక ఉంటుందన్నారు. ఆ ఇంట్లోనే శ్వాస వదలాలని ఉంటుందన్నారు. గతంలో సొంతిల్లు ఉండాలని ఉండేది కాదన్నారు. సామాన్యులకు అందుబాటులో ‘భువిద’ ఉందన్నారు.
ఈ సందర్భంగా ఆయనను ఆ సంస్థ వారు ఘనంగా సన్మానించారు. అలాగే పలువురు అభిమానులు ఆయనను కలిశారు. ఉగాది రోజు నాగబాబు రావడంతో అభిమానులు కోలాహలం కనిపించింది. ఆయన వారికంద రికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఎస్‌కె. ఖాజావలి మాట్లాడుతూ నెల్లూరు ప్రపంచ వాణిజ్య కేంద్రంగా మారుతుందన్నారు. నెల్లూరు క్లాస్ సిటీగా కానున్నదన్నారు. సినీ నటుడు నాగబాబుకు నెల్లూరీయులతో మంచి సంబంధాలున్నాయన్నారు. భువిద సెంటర్ సిటీ ఎండి రమేష్, బాలకోటయ్యలు మాట్లాడుతూ మోడల్ టౌన్‌షిప్ చేయాలనే సంకల్పంతో భువిదలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాషా, ద్వారకనాధ్, యల్లారెడ్డి, రాధాకృష్ణ, భాస్కర్‌రెడ్డి, ప్రభాకర్, ప్రమోటర్స్, ప్రముఖులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment