online marketing

Tuesday, October 9, 2012

ఆత్మాభిమానం దెబ్బతిన్న యువకుడు తల్లి చూస్తుండగానే ఆత్మహత్య

నెల్లూరు: నెల్లూరు నగరంలో 18 ఏళ్ల ఓ యువకుడిని సెల్‌ఫోన్‌ చోరీ చేశాడని తీవ్రంగా కొట్టడంతో ఆ యువకుడు మనస్తాపంతో తల్లి ఎదుటే ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు ఇచ్చిన రహస్య సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి. స్థానిక టెక్కేమిట్టలో తమిళనాడు రాష్ట్ర అరక్కోణంకు చెందిన ఆర్ముగం సుమారు 20 ఏళ్ల క్రితం నెల్లూరుకు వలస వచ్చి టెక్కేమిట్టలోని రెైల్వేగేటు సమీపంలో పూరిపాక వేసుకుని నివసిస్తున్నాడు. ఇతనికి మహేష్‌, రూపేష్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మహేష్‌ చదువుకుంటుండగా రూపేష్‌ పెయింటింగ్‌ పనికి వెళ్తూ ఇంటికి సహాయపడేవాడు. రూపేష్‌ వారి ఇంటి సమీపంలో నివసించే కమతం రమణయ్య కుమారుడు రమేష్‌ తో పెయింటింగ్‌ పనికి వెళ్లేవాడు. గత నెల వినాయ చవితి సందర్భంగా రూపేష్‌ రమేష్‌తో పాటు ఉండగా రమేష్‌ సెల్‌ఫోన్‌ కనిపించలేదు.

దీంతో రమేష్‌ కోపోద్రిక్తుడెై నువ్వే సెల్‌ఫోన్‌ దొంగిలించావని అంటూ రూపేష్‌పెై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. అప్పటికీ శాంతించని రమేష్‌ రూపేష్‌ను తీసుకుని వారి ఇంటి వద్దకే వెళ్లగా రూపేష్‌ తల్లిని ఇంటిలో నుండి పిలిచి ఆమె ఎదుటే రూపేష్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ మరలా కొట్టాడు. కొద్దిసేపటికి రమేష్‌ వెళ్లిపోగా తల్లి ఎదుటే తనకు ఇంత అవమానం జరగడంతో ఆత్మాభిమానం దెబ్బతిన్న రూపేష్‌ తల్లి చూస్తుండగానే ఇంటి పక్కనే వున్న రెైల్వేట్రాక్‌ వెైపు పరుగెత్తుకుని వెళ్లి అప్పుడే అటు వెళ్తున్న రెైలుకు అడ్డం పడ్డాడు. రూపేష్‌ను రెైలు ఢీకొనడంతో అక్కడికక్కడే రూపేష్‌ మరణించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో మృతుడు రూపేష్‌ తల్లిదండ్రులు బోరున విలపిస్తూ కుమారుడి మృతదేహం వద్ద కుప్పకూలిపోయారు. ఈ విషయం తెలిసి రమేష్‌ వారి వద్దకు వెళ్లి వారిని కేసులు పెట్టకుండా బెదిరించి రూపేష్‌ మృతదేహాన్ని కాల్చి బూడిద చేసేలా వారిపెై ఒత్తిడి తెచ్చారు. 

అనంతరం కొద్ది రోజులు రమేష్‌ పరారీలో ఉండి విషయం చల్లబడిందని తెలిసి బయటకు వచ్చినట్లు సమాచారం. మీకు మరో కొడుకు వున్నాడని, ఈ విషయం బయటకు చెబితే వాడిని చంపేస్తానంటూ మృతుడి తండ్రిని రమేష్‌ , అతని కుటుంబ సభ్యులు బెదిరించినట్లు, తాము రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి బతుకుతున్నామని, ఇక్కడ తమకేదెైనా జరిగితే దిక్కే లేదని, అందుకే విషయం బయటకు చెప్పలేకపోయామని రూపేష్‌ తండ్రే మీడియా అని తెలియక విలేకరులకు తెలిపాడు. ఆలస్యంగా వెలుగు చూచిన ఈ సంఘటనపెై రెైల్వే పోలీసులకు కాని, ఇటు లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు కాని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆ వ్యక్తులు రూపేష్‌ కుటుంబ సభ్యులను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేసి వారిని నోరు మూయించారు. దీనిపెై పోలీసులకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో కేసు మూత పడినట్లేనని రమేష్‌ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇకనెైనా పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఈ కేసును పరిశోధించి నిజాలను నిగ్గు తేల్చి బాధితులకు న్యాయం చేసి నేరస్తులను శిక్షించాల్సివుంది

సైకో కత్తితో వీరంగం...

చేజర్ల: చేజర్లలోని స్థానిక బస్టాండు సెంటరు వద్ద సైకోగా మారిన మొద్దు వెంకట రమణయ్య కత్తితో వీరంగం సృష్టించడంతో ఇద్దరు యువకులు గాయాల బారినపడి తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం మొద్దు వెంకట రమణయ్య గత కొంతకాలంగా చేజర్ల బస్టాండు సెంటరువద్దగల దుకాణాల సెంటర్లో చిన్నచిన్న పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఆదివారం డబ్బులు విషయంలో జరిగిన చిన్న ఘర్ణణతో అతను సైకోగామారి ఆదివారం ఉదయం కత్తితో అహ్మద్‌బాషా, రియాజ్‌ అనే యువకులపెై దాడిచేసి గొంతుపెై గాయపరిచాడు. అతని సమీపంలోని మరొక యువకుడు రియాజ్‌ మోచేతిపెై గాయపరిచాడు. 

బస్టాండు సెంటరు వద్ద రిక్షాతోలుకుంటూ జీవనం గడుపుతున్న అహ్మద్‌బాషాకు తీవ్ర రక్తస్రావం కావడంతో వీరిద్దరిని 108సాయంతో వెైద్యచికిత్సలకోసం నెల్లూరు ప్రభుత్వ వెైద్యశాలకు తరలిం చారు. సైకోగామారిన మొద్దు రమణయ్య బస్టాండు సెంటరు వద్ద వీరంగం సృష్టిస్తూ దగ్గరికి వెళ్లినవారిపెై దాడిచేయడం మొదలుపెట్టాడు. ఈ దాడిని అడ్డుకోబోయిన హెడ్‌ కానిస్టేబుల్‌ పరంధామయ్యపెై సైతం ఆ సైకో దాడికి దిగడంతో అతను తృటిలో ప్రమాదంనుండి తప్పించుకు న్నాడు. బస్టాండులోని ప్రజలు అతని వద్దకు వెళ్లాలంటే భయాందోళనలకు గురయ్యారు. అందరూ కలసి సమిష్టిగా అతన్ని పట్టుకొని అతనివద్ద నుండి కత్తిని తీసివేసి పోలీస్‌ సిబ్బంది సహకారంతో పోలీస్టేషన్‌లో అప్పగించడం జరిగింది. 

అయితే ఇతడు గతంలో ఆదురుపల్లి సెంటరు వద్ద ఒక మహిళ చెవిని కోయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి అతన్ని గ్రామం నుండి తరిమివేయడం జరిగింది. ఇతను చేజర్ల మండలం పెళ్లేరు గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు తెలిపారు. ఇతను ఏ గ్రామంలోవున్నా అక్కడ ఏదోఒక గొడవచేసి పలువురుని గాయపరచిన సంఘటనలు అనేకం ఉన్నాయి. చేజర్ల బస్టాండు వద్ద జరిగిన సంఘటనతో ప్రజలు సైకో ప్రవర్తనపెై భయాందోళనలు చెందుతూ బిక్కుబిక్కుమంటున్నారు. ఇతను బయట సంచరిస్తే అనేకమందిని గాయపరచి ప్రాణాలు తీసే ప్రమాదంవుందని గ్రామస్తులు తెలుపుతు న్నారు. స్థానిక ఎస్‌ఐ రంగనాథ్‌గౌడ్‌ సైకోను అదుపులోకి తీసుకొని అతనిపెై కేసు నమోదుచేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లుగా ఆయన తెలిపారు. 

ప్రజల సహకారంతో ఇటువంటి వ్యక్తులను అదుపుచేయడం జరుగుతుందన్నారు. ఎవరెైనా అనుమానిత వ్యక్తులుగా సంచరిస్తుంటే పోలీస్టేషన్‌లో సమాచారాన్ని అందించాలన్నారు. ఇటువంటి వారిపెై చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ పరంధామయ్య, కానిస్టేబుల్‌ రఫిలు పాల్గొన్నారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh