online marketing

Saturday, March 26, 2011

న్యాయం చేయండి.. ఓ బాధితుని ఆవేదన..

నెల్లూరు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తన కుమార్తె చావుబతుకుల మధ్య వుంటే సహాయం చేస్తామంటూ చెప్పిన ఫైనాన్స్‌ కంపెనీ వారు, ఇన్సూరెన్స్‌ వారు, పోలీసులు వారు మాటమార్చి సహాయం చేసేందుకు నిరాకరంచి తన కుటుంబాన్ని వీధుల పాలు చేశారని, బిడ్డ ప్రాణాలు దక్కించుకునేందుకు తాను దాదాపు 60 వేల రూపాయలు అప్పు చేసానని ఇంతవరకు సహాయం చేస్తానన్న వారు మొఖం చాటేసారని కిసాన్‌ నగర్‌, రాజీవ్‌గాంధీ కాలనీ రోడ్డు, మల్లితోటకు చెందిన రేణింగి రవికుమార్‌ ఆవేదన వెలిబుచ్చాడు. శుక్రవారం ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన కుమార్తె రేణింగి జ్యోత్స్న (4) జనవరి నెల 7 వ తేదీన స్కూలుకు వెళ్లేందుకు పిండిమిల్లు మెట్లవద్ద సిద్దంగా వుండగా మద్యం సేవించిన మత్తులో నజీర్‌ అనే వ్యక్తి ఇండికా కారును నడుపుతూ వేగంగా వచ్చి తన కుమార్తెను ఢీ కొట్టడంతో 8 అడుగుల ఎత్తుకు ఎగిరి కారు చక్రం క్రింద పడడంతో పాప ఛాతీపై, ఎడమ కాలు, ఎడమ చేయికి బలమైన రక్తపు గాయాలు తగిలాయని ఇందుకు చికిత్సకు తాను 60 వేలు అప్పు చేసినట్లు తెలిపారు. తర్వాత ఈ విషయంపై తమకు సహాయం చేస్తామన్న పోలీసులు, ఇన్సూరెన్స్‌ కంపెనీ వారు, ఫైనాన్స్‌ కంపెని వారు ఇప్పటి వరకు తనను తిప్పుకుని ఇప్పుడు తాము ఏమి సహాయం చేయలేమని చెప్పారని తన ఆవేదనను వెలిబుచ్చారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారించి తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రవికుమార్‌ భార్య లత, కుమార్తె జ్యోత్స్న పాల్గొన్నారు.







Friday, March 25, 2011

సవాల్ చేసి గెలిపించుకున్న ఆనం బ్రదర్స్: వాకాటి గెలుపు

నెల్లూరు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్రెడ్డి వర్గం నేతలు మేకపాటి బ్రదర్సుపై ఆనం బ్రదర్సు తమ ఛాలెంజ్‌ను నెగ్గించుకున్నారు. నెల్లూరులో కాంగ్రెసు అభ్యర్థిని గెలిపిస్తామని జగన్ వర్గానికి షాక్ ఇస్తామని చెప్పిన శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డి అన్నట్లుగానే అక్కడ జగన్ వర్గం అభ్యర్థిపై కాంగ్రెసు అభ్యర్థిని గెలిపించారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆయన తమ్ముడు ఆనం వివేకానందరెడ్డి కాంగ్రెసు గెలుపుకు తీవ్రంగా కృషి చేశారు.

జగన్ వర్గం నేతలైన నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన తమ్ముడు శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డిలు జగన్ వర్గం నాయకున్ని స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపించి ఆనం బ్రదర్సుకు షాక్ ఇవ్వాలనుకున్నారు. కానీ వారికి షాక్ తగిలింది. మొత్తానికి ఆనం సోదరులు నెల్లూరులో తమ సత్తా నిరూపించుకున్నా

Thursday, March 24, 2011

టెన్త్‌ పరీక్ష రాసిన ఇంజనీరింగ్‌ విద్యార్థి


నెల్లూరు:పరీక్షలు ప్రారంభమైన రోజునే ఇంజనీరింగ్‌ విద్యార్థి పదవ తరగతి పరీక్ష రాయడం పలువురిని ఆశ్చర్య పరచింది. నగరంలోని వేదసంస్కృత పాఠశాల పదవ తరగతి పరీక్షా కేంద్రం (4355)లో గురువారం తెలుగు పేపర్‌-1ను రాయాల్సిన ఎస్‌కె.ఖలీం హాల్‌టికెట్‌ నెం. 1117200131 ప్రైవేట్‌ విద్యార్థికి బదులు క్యూబా ఇంజనీరింగ్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎస్‌కె.ముహిసీన్‌ పరీక్ష రాశాడు. నాటకీయంగా బయట పడిన ఈ విషయం అనేక అనుమానాలకు తావిస్తోంది. పరీక్ష ముగిసే సమయంలో హాల్‌టిె ట్‌పై ఉన్న ఫోటోను, పరీక్ష రాస్తున్న అభ్యర్థిని పరిశీలించి నకిలీ అభ్యర్థిని పట్టుకున్నామని ఇన్విజిలేటర్‌ చెబుతున్నాడు. 

ఈ ఇన్విజిలేటర్‌ గత ఏడాది కూడా ఇదే పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహించడం గమనార్హం. అయితే పరీక్ష రాయాల్సిన అసలు విద్యార్థి ఎలా పట్టుపడ్డాడో అన్న అంశంపై విభిన్న సమాధానాలు వెలువడ్డాయి.పరీక్ష కేంద్రానికి బయట తచ్చాడుతుంటే పట్టుకున్నారని కొందరు, ఈ విధంగా పరీక్ష రాస్తే ఏం కాదుగదా అని ఆ విద్యార్థి అడుగుతుంటే పోలీసులకు అనుమానం వచ్చి పట్టుకున్నారని చెబుతున్నారు.అయితే పరీక్ష ప్రారంభానికి ముందు ఇన్విజిలేటర్‌ హాల్‌టిక్కెట్లను పరిశీలించి అభ్యర్థుల ఫోటోలు, నెంబర్లతో సరిచూసుకుని సమాధాన పత్రాలపై సంతకం పెట్టాల్సిన సమయంలో ఇన్విజిలేటర్‌ ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం అనుమానాలకు మరింత తావిస్తోంది.

పరీక్ష ముగిసే సమయంలో గమనించడానికి గల కారణాలు సంబంధిత అధికారులు, ఇన్విజిలేటర్‌ వద్ద లేవు. ముత్తుకూరు జడ్పీ హైస్కూల్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఇన్విజిలేటర్‌గా వ్యవహరించిన కె.శేఖర్‌ ఈ విషయాన్ని ఛీఫ్‌ సూపరింటెండెంట్‌కు తెలపడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన పోలీసులకు విద్యార్థులను అప్పగించడం జరిగింది. అయితే పదవ తరగతి ప్రైవేట్‌ విద్యార్థులు అప్లికేషన్‌ (ఐసి ఫారాల్లో) భారీ జాగ్రత్తలతో విద్యార్థుల నుండి తీసుకుంటారు. హాల్‌ టిక్కెట్లు ఇచ్చే సమయంలో కూడా హాల్‌ టిక్కెట్‌ వెనుక సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వివరాలను సరిచూసి ధృవీకరణ చేస్తారు. ఒక విద్యార్థి పరీ కు హాజరయ్యే సమయంలో ఇన్విజిలేటర్‌ వివరాలను, ఫోటోలను సరిచూసుకుని ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు అందజేస్తారు.

ఈ ప్రక్రియనంతా దాటుకుని పరీక్ష ముగిసే సమయంలో నకిలీ అభ్యర్థిని గుర్తించామని చెప్పడం, అసలు అభ్యర్థి పరీక్ష ముగిసే సమయానికి పరీక్షా కేంద్రంలో ప్రత్యక్షమవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక విద్యాశాఖకు సంబంధించిన వ్యక్తుల హస్తం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లా విద్యాశాఖాధికారులు ఇన్విజిలేషన్‌ డ్యూటీలను నియమించే సమయంలో అనేక ప్రలోభాలకు గురవడం వల్ల ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని విద్యాశాఖకు చెందిన కొంతమంది తెలిపారు. తన స్నేహితుడు గత పదేళ్లుగా పదవ తరగతి పరీక్ష పాస్‌కాక పోవడంతో తన కోసం ఈ పని చేశానని పరీక్ష రాసిన ఇంజనీరింగ్‌ విద్యార్థి చెబుతుంటే, ఎలాగైనా ఈసారి పరీక్ష పాస్‌ అవ్వాలని ఈ పని చేశామని అసలు విద్యార్థి చెప్పాడు. అయితే సరైన మార్గదర్శకం లేక విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకున్నారు. ఇందుకు ఆస్కారమిచ్చిన వారు ఎంతటివారైనా కఠినంగా శిక్షించడానికి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

నెల్లూరు జిల్లాలో అబ్బురపరుస్తున్న ఆకాశం


ఆకాశం నుంచి వర్షం పడుతుంది. ఇది అందరికీ తెలిసిందే. ఇందులో ఆశ్చర్యం లేదు. అయితే, నెల్లూరు జిల్లాలోని ఓ ఊళ్ళో గంధం కురుస్తోంది. అందుకే ఇది ఇప్పుడు న్యూస్ అయింది. ఆ జిల్లాలోని పొదలకూరు గ్రామంలోని రామమందిరం ఏరియాలో గత వారం రోజులుగా ప్రజలు ఈ వింతను చూస్తున్నారు. తమ ప్రాంతంలో గంధపు రంగుతో కూడిన తుంపర్లు పడుతున్నాయనీ, అయితే, పడుతున్నప్పుడు మాత్రం వీటిని ఎవరూ గుర్తించలేకపోతున్నారనీ స్థానికులు చెబుతున్నారు.
స్కూటర్లు, బైకులు, సైకిళ్ళ కవర్ల మీద ఈ తుంపర్లు పసుపు రంగులో స్పష్టంగా కనిపిస్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు. ఈ జల్లులు శరీరం మీదపడితే మాత్రం దురదలొస్తున్నాయని చెబుతున్నారు.ఈ వార్త చుట్టుపక్కల వ్యాపించడంతో, ఈరోజు జనవిజ్ఞాన వేదిక వారు వచ్చి శాంపిల్స్ సేకరించి, పరీక్షల కోసం నెల్లూరు పంపించారు. ఇవి ఆమ్ల వర్షాలు కాదనీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ వారు చెబుతున్నారు. ల్యాబ్ రిపోర్ట్ వస్తే అసలు విషయం తెలుస్తుంది!

Tuesday, March 22, 2011

రంగనాథస్వామి రథయాత్ర సందర్భంగా అపశృతి

నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమవారం జరిగిన రంగనాథస్వామి రథయాత్ర సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. రథోత్సవం సందర్భంగా ప్రమాదవశాత్తూ రథం భక్తులపైకి దూసుకు పోయింది. దీంతో ఒక భక్తుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. స్పాట్‌లో మృతి చెందిన వ్యక్తి కడప జిల్లాకు చెందిన విక్రంరెడ్డిగా గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

రథం కింద పడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపిస్తున్నారు. నెల్లూరులో రంగనాథస్వామి ఉత్సవాలు ఈ నెల 14నుండి 24 వరకు ఉంటాయి. ఉత్సవం సందర్భంగా భద్రత లేక పోవడంతో తోపులాట జరిగడంతో ఈ దుర్ఘటన జరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున పోలీసులు సరియైన భద్రతను స్వామి వారి రథయాత్ర వద్ద కల్పించక పోవడం వల్లనే జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. సరియైన భద్రత ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదని అంటున్నారు.

Sunday, March 20, 2011

మంత్రి ఆనం సోదరుడు పోలింగ్ ఏజెంట్

నెల్లూరు: మంత్రి ఆనం సోదరుడు పోలింగ్ ఏజెంట్‌గా ఉండి ప్రచారం చేస్తున్నారంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు.

మంత్రి ఆనం సోదరుడు పోలింగ్ ఏజెంట్

నెల్లూరు: మంత్రి ఆనం సోదరుడు పోలింగ్ ఏజెంట్‌గా ఉండి ప్రచారం చేస్తున్నారంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh