ఆకాశం నుంచి వర్షం పడుతుంది. ఇది అందరికీ తెలిసిందే. ఇందులో ఆశ్చర్యం లేదు. అయితే, నెల్లూరు జిల్లాలోని ఓ ఊళ్ళో గంధం కురుస్తోంది. అందుకే ఇది ఇప్పుడు న్యూస్ అయింది. ఆ జిల్లాలోని పొదలకూరు గ్రామంలోని రామమందిరం ఏరియాలో గత వారం రోజులుగా ప్రజలు ఈ వింతను చూస్తున్నారు. తమ ప్రాంతంలో గంధపు రంగుతో కూడిన తుంపర్లు పడుతున్నాయనీ, అయితే, పడుతున్నప్పుడు మాత్రం వీటిని ఎవరూ గుర్తించలేకపోతున్నారనీ స్థానికులు చెబుతున్నారు.
స్కూటర్లు, బైకులు, సైకిళ్ళ కవర్ల మీద ఈ తుంపర్లు పసుపు రంగులో స్పష్టంగా కనిపిస్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు. ఈ జల్లులు శరీరం మీదపడితే మాత్రం దురదలొస్తున్నాయని చెబుతున్నారు.ఈ వార్త చుట్టుపక్కల వ్యాపించడంతో, ఈరోజు జనవిజ్ఞాన వేదిక వారు వచ్చి శాంపిల్స్ సేకరించి, పరీక్షల కోసం నెల్లూరు పంపించారు. ఇవి ఆమ్ల వర్షాలు కాదనీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ వారు చెబుతున్నారు. ల్యాబ్ రిపోర్ట్ వస్తే అసలు విషయం తెలుస్తుంది!
రాపూరు నుండి బ్లాగరా? అద్భుతం !
ReplyDeleteనేను గడచిన వారం రాపూరు వచ్చాను. వీలైతే మళ్ళీ వచ్చినపుడు కలుద్దాము.