నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమవారం జరిగిన రంగనాథస్వామి రథయాత్ర సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. రథోత్సవం సందర్భంగా ప్రమాదవశాత్తూ రథం భక్తులపైకి దూసుకు పోయింది. దీంతో ఒక భక్తుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. స్పాట్‌లో మృతి చెందిన వ్యక్తి కడప జిల్లాకు చెందిన విక్రంరెడ్డిగా గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
రథం కింద పడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపిస్తున్నారు. నెల్లూరులో రంగనాథస్వామి ఉత్సవాలు ఈ నెల 14నుండి 24 వరకు ఉంటాయి. ఉత్సవం సందర్భంగా భద్రత లేక పోవడంతో తోపులాట జరిగడంతో ఈ దుర్ఘటన జరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున పోలీసులు సరియైన భద్రతను స్వామి వారి రథయాత్ర వద్ద కల్పించక పోవడం వల్లనే జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. సరియైన భద్రత ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదని అంటున్నారు.

No comments:
Post a Comment