నెల్లూరు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తన కుమార్తె చావుబతుకుల మధ్య వుంటే సహాయం చేస్తామంటూ చెప్పిన ఫైనాన్స్ కంపెనీ వారు, ఇన్సూరెన్స్ వారు, పోలీసులు వారు మాటమార్చి సహాయం చేసేందుకు నిరాకరంచి తన కుటుంబాన్ని వీధుల పాలు చేశారని, బిడ్డ ప్రాణాలు దక్కించుకునేందుకు తాను దాదాపు 60 వేల రూపాయలు అప్పు చేసానని ఇంతవరకు సహాయం చేస్తానన్న వారు మొఖం చాటేసారని కిసాన్ నగర్, రాజీవ్‌గాంధీ కాలనీ రోడ్డు, మల్లితోటకు చెందిన రేణింగి రవికుమార్ ఆవేదన వెలిబుచ్చాడు. శుక్రవారం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన కుమార్తె రేణింగి జ్యోత్స్న (4) జనవరి నెల 7 వ తేదీన స్కూలుకు వెళ్లేందుకు పిండిమిల్లు మెట్లవద్ద సిద్దంగా వుండగా మద్యం సేవించిన మత్తులో నజీర్ అనే వ్యక్తి ఇండికా కారును నడుపుతూ వేగంగా వచ్చి తన కుమార్తెను ఢీ కొట్టడంతో 8 అడుగుల ఎత్తుకు ఎగిరి కారు చక్రం క్రింద పడడంతో పాప ఛాతీపై, ఎడమ కాలు, ఎడమ చేయికి బలమైన రక్తపు గాయాలు తగిలాయని ఇందుకు చికిత్సకు తాను 60 వేలు అప్పు చేసినట్లు తెలిపారు. తర్వాత ఈ విషయంపై తమకు సహాయం చేస్తామన్న పోలీసులు, ఇన్సూరెన్స్ కంపెనీ వారు, ఫైనాన్స్ కంపెని వారు ఇప్పటి వరకు తనను తిప్పుకుని ఇప్పుడు తాము ఏమి సహాయం చేయలేమని చెప్పారని తన ఆవేదనను వెలిబుచ్చారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారించి తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రవికుమార్ భార్య లత, కుమార్తె జ్యోత్స్న పాల్గొన్నారు.
No comments:
Post a Comment