నెల్లూరు : సమాజంలో కన్నతల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురై అనాథలుగా వదిలేసిన పిల్లలను గుర్తించి వారిని ఆదరించాలని జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టర్ బంగళాలో ఐసిబిఎస్ సంస్థ ఆధ్వర్యంలో పిల్లలు లేనివారికి దత్తత కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తన కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న రమణయ్య, దొరసానమ్మ దంపతులు అనాథ ఆడబిడ్డను దత్తత తీసుకోవడం అభినందనీయ మన్నారు. వారు ఆ అనాథ బిడ్డను పోషించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు.
జిల్లాలో ఐదేళ్ల లోపు అనాథ పిల్లలను గుర్తించి వారిని శిశు గృహంలో చేర్పిస్తామని, పిల్లలు లేనివారికి దత్తత ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ దత్తత స్వీకారం ఐసిడిఎస్ ద్వారానే జరుగుతుందని, ఎవరైనా పిల్లలు లేనివారు దత్తత తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకున్న దంపతులకు సీరియల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుందని, ఇప్పటివరకు ఐదుగురు అనాథలను దత్తత ఇవ్వడం జరిగిందని, వారిలో ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలని తెలిపారు.