online marketing

Sunday, April 15, 2012

గర్భిణి అని చూడకుండా వారు ఆమెపైనా దాడి...

నెల్లూరు: గర్భిణిపై దాడి చేసినా పోలీసులు పట్టించుకోని సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన సమాచారం మేరకు.. ముకుందాపురానికి చెందిన ఎన్. శ్రీనివాసులరెడ్డికి అదే ప్రాంతానికి చెందిన హనుమంతరావుతో స్థల వివాదం ఉంది. ఈ విషయమై ఇరువురు కోర్టును ఆశ్రయించారు. వివాదం కోర్టులో ఉన్న సమయంలో శనివారం హనుమంతరావు శ్రీనివాసులరెడ్డి స్థలంలోకి వెళ్లేందుకు యత్నించాడు.

శ్రీనివాసులరెడ్డి అడ్డుకోవడంతో కోపోద్రిక్తుడైన హ నుమంతరావు తన కుటుంబసభ్యులతో కలిసి శ్రీనివాసులరెడ్డిపై దాడిచేశాడు. కళ్ల ఎదుట భర్తపై దాడిచేస్తుండడంతో సహించలేని సుహాసిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. గర్భిణి అని చూడకుండా వారు ఆమెపైనా దాడిచేశారు. అడ్డొచ్చిన మరో ఇద్దరు మహిళలపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయమై బాధితులు రెండోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని పట్టించుకోలేదు. పెపైచ్చు ఎక్కువ మాట్లాడితే ఇరువర్గాలపై కేసులు కడుతామని హెచ్చరించారు.
బాధితులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి వెళ్లి జరిగిన విషయాన్ని హాస్పిటల్ ఔట్‌పోస్టు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అప్పటికే సుహాసిని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ప్రభుత్వ వైద్యులు మెరుగైన చికిత్స కోసం జూబ్లీ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ఆమె జూబ్లీ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వెళ్లిపోయింది. దాడిచేసిన వారు అధికారపార్టీ ఎంఎల్‌ఎ అనుచరులు కావడంతో పోలీసులు కేసునమోదు చేయడంలేదని బాధితులు ఆరోపించారు.బాధితులు తమకు జరిగిన నష్టం గురించి పోలీసులకు తెలిపినప్పటికి వారికి న్యాయం చేయకపోగా తాము చెప్పినట్లు వినకపోతే ఇరువర్గాలపై కేసులు పెడుతామని హెచ్చరించడం సిగ్గుచేటన్నారు. రెండోనగర పోలీసులు అధికారపార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ బాధితులకు న్యాయం చేయడం లేదని, ఈ విషయమై తమ పార్టీ ఆధ్వర్యంలో డీజీపీని కలిసి స్వయంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh