నెల్లూరు : ప్రజాపథంలో భాగంగా నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలు సోమవారం మధ్యాహ్నం మండుటెండలో గిరిజనులతోపాటు చెక్కరిక్షా ఎక్కి ర్యాలీలో పాల్గొనడం విశేషం. జడ్పీ స్కూల్ నుంచి చెక్క రిక్షాలో ర్యాలీగా నేతాజీనగర్ 8వ వీధికి చేరుకున్నారు. ఆనం వివేకానందరెడ్డి పార్టీ నాయకులను ఎక్కించుకుని యువకుని వలె కేరింతలు కొడుతూ అందరిని పలకరిస్తూ రిక్షా తొక్కడం అందరినీ అబ్బురపరచింది. సేట్లు తలకు చుట్టే తలపాగా ధరించి పక్కన కార్యకర్తలతో చమత్కరిస్తూ ఎన్నికల ప్రచారం వలె ఆయన రిక్షా తొక్కుతూ వస్తుంటే కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపించింది.
అక్కడున్న విద్యార్థులను పలకరించి సమస్యలేవైనా ఉంటే చెప్పండి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
ప్రతి ఒక్కరి వద్ద తన నెంబరు ఉండాలని, ఫోన్ చేస్తే స్పందిస్తానని, మీలో ఒక్కడినని వివేకా చెప్పారు. వివేకా రిక్షా తొక్కుతుండడంతో పోలీసులు రోడ్డుపై ట్రాఫిక్ ఉండడంతో పరుగులు తీశారు. అలాగే అధికారులు ఎమ్మెల్యేలను అనుసరిస్తూ వచ్చారు.

ఆయన ku ఆత్మకూరు బస్టాండ్ దగ్గర రోడ్డు అంత చెత్తగా ఉంటె దానిని బాగు చేయలనిపించ లేదా! అక్కడ తొక్కి ఉండాల్సింది రిక్ష. ఓళ్లు పులిసి పోయిఉండేది.
ReplyDelete