online marketing

Tuesday, April 17, 2012

స్థానికులంతా గుమికూడి ఈ తతంగాన్ని వేడుకలా చూశారేకాని, ఎవరూ ముందుకొచ్చి అడ్డుకోలేదు

నెల్లూరు : నెల్లూరు పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన సంఘటన కుసుమ హరిజనవాడ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. గుడిపల్లిపాడుకు చెందిన కేటరింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు బత్తెన మల్లికార్జున మంగళవారం మధ్యాహ్నం వంటకాలను వాహనంలో పెట్టుకుని నగరంలోని హోటళ్లకు సరఫరా చేసేందుకు రోజూ మాదిరిగానే బయలుదేరాడు. వంటకాల వాహనంతో వస్తున్న మల్లికార్జునను నగర శివారు ప్రాంతమైన కుసుమహరిజనవాడ వద్దకు వచ్చేసరికే మణి, బాబు అనే ఇద్దరు వ్యక్తులు వాహనానికి అడ్డుగా వచ్చారు. వాహనాన్ని నిలిపిన మల్లికార్జునను డబ్బులు కావాలంటూ బెదిరించారు. వారిరువురూ మద్యం మత్తులో ఉండడంతో ఎందుకొచ్చిన బెడద అనుకుని మల్లికార్జున వారికి వంద రూపాయలను ఇచ్చేందుకు ప్రయత్నించాడు. 

దీంతో వారు వంద ఇస్తావా అంటూ ఇంకా డబ్బులు కావాలని అతనిపై దాడి చేసి కొట్టసాగారు. స్థానికులంతా గుమికూడి ఈ తతంగాన్ని వేడుకలా చూశారేకాని, ఎవరూ ముందుకొచ్చి అడ్డుకోలేదు. ఇంతలో అటుగా వస్తున్న మఫ్టీ పోలీసులు విషయాన్ని గమనించి అక్కడకు వెళ్లి దాడిచేస్తున్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వారిలో ఒకడు తప్పించుకుని పారిపోగా, మరొక వ్యక్తిని పోలీసులు పట్టుకుని రెండవ నగర పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. బాధితుని ఫిర్యాదు మేరకు రెండవ నగర ఎస్‌ఐ కిషోర్‌బాబు కేసు నమోదు చేసి మరో నిందితుడి కోసం వెతుకులాట ప్రారంభించారు

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh