నెల్లూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తల్లిదండ్రుల మాట విని తనను నిరాకరించడంతో ఓమహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఆమె ప్రయత్నాన్ని ప్రయాణికులు అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.
నగరానికి చెందిన అరవింద్, హైదరాబాద్‌కు చెందిన సౌజన్యతో ఫోన్లో పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారడంతో ఈనెల ఆరోతేదీ ఇంటి నుంచి పరారైన ఇద్దరు 8వ తేదీన భద్రాచలంలో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం నాలుగురోజులు అక్కడే గడిపారు. శుక్రవారం రాత్రి నెల్లూరు నగరానికి చేరుకుని ఇంటికి వెళ్లారు. అరవింద్ కుటుంబసభ్యులు ఆమెను నిరాకరించారు. అరవింద్ సైతం తల్లిదండ్రుల మాటను విని ఆమెను వద్దన్నాడు. ఆమెను హైదరాబాద్‌కు వెళ్లిపోవాలని సూచించారు. బాధితురాలు రైల్వేస్టేషన్‌కు చేరుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ప్రయాణికులు ఆమెను వారించి జరిగిన విషయం తెలుసుకున్నారు. ఇంతలో అక్కడకు చేరుకున్న అరవింద్ కుటుంబసభ్యులు ఇంటికి రావాలని సూచించారు. అరవింద్ అడ్డు తగల డంతో బాధితురాలు అతన్ని నిలదీసింది.అరవింద్ ఆమెపై చేయిచేసుకుని తనకు వ ద్దంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రయాణికుల సహాయంతో బాధితురాలు అ రవింద్‌పై రైల్వేపోలీసులకు ఫిర్యాదుచేసి తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు రెలైక్కింది.

No comments:
Post a Comment