Saturday, February 18, 2012
Flora and fauna and biodiversity in the lake attract thousands of migratory birds
The Centre has decided to undertake research studies to rejuvenate the Pulicat lake in the state. Pulicat lake on the border be-AP and Tamil Nadu is the second largest brackish water lagoon in India, covering 461 km square. Flora and fauna and biodiversity in the lake attract thousands of migratory birds during the winter-om various parts of the neck-ntry and even Siberia.
Began carving tiny things with the aim of making the Guinness Book.
Nellore: There is a part-time jeweler. He has neither his own shop, or access to sophisticated instrumentation. Yet, he sculpts microstructures in gold, like the Taj Mahal, with precision and passion. Musaveer, 45, who works in jewelry stores on street Korada Nellore, began carving tiny things with the aim of making the Guinness Book.
$ 500 billion of money illegal has been deposited in banks abroad---M Venkaiah Naidu
Nellore: BJP national leader M Venkaiah Naidu demanded the UPA government to clarify its position to return to India, billions of black money stashed in foreign banks.
Addressing participants of one-day policy seminar for executives mandal in the district, where he inaugurated on Thursday, he said CBI Director, AP Singh revealed that $ 500 billion of money illegal has been deposited in banks abroad, but the union government has yet to make its position clear on what to do about it.
Friday, February 17, 2012
Wednesday, February 15, 2012
సినిమా ఫక్కి లో కొందరు దుండగులు పట్ట పగలు కత్తులతో బెదిరించి..
నెల్లూరు : సినిమా ఫక్కి లో నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులో కొందరు దుండగులు బుధవారం పట్ట పగలు కత్తులతో బెదిరించి ఓ వ్యాపారి నుంచి రూ. 78వేలు దోచుకుని వెళ్లాడు. నాల్గో నగర ఎస్ఐ మల్లికార్జున కథనం మేరకు. నెల్లూరు లేక్‌వ్యూ కాలనీకి చెందిన కొండయ్య స్టోన్‌హౌస్‌పేటలో మిరపకాయల వ్యాపారం చేస్తున్నాడు.
పుచ్చిన కందిపప్పుతో వంటచేస్తుండడంతో విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు...
నెల్లూరు జి :ల్లాలోని సాంఘిక సంక్షేమ, ఎస్టీ వసతి గృహాలకు కందిపప్పు సరఫరా చేయడంలేదు. దీంతో అవి నిల్వ ఉండి పుచ్చిపోతున్నాయి. విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. నిధుల వథా వసతిగృహాలకు కందిపప్పును సరఫరా చేసేందుకు సాంఘిక సంక్షేమశాఖకు రూ.4.08 లక్షలు, ఐటీడీఏ వసతి గృహాలకు రూ. 2.06లక్షలు విడుదల చేశారు.
రాపూరు లక్ష్మీపురంలో సమస్యలు కోకొల్లలు...
రాపూరు : రాపూరు లక్ష్మీపురంలో సమస్యలు కోకొల్లలుగా వున్నాయి. వర్షం వస్తే వారి తిప్పలు చెప్పనలవి కావు. దీంతో నిత్యం అవస్థ పడుతూనే వున్నారు. ఏళ్లనాటి నుంచి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రోడ్లు వరద నీటిలో మునుగుతున్నాయి. అన్నింటికి మించి కోట అగర్త కలుజు ప్రవహిస్తే ఆ నీరంతా కాలనీని చుట్టుముడుతుంది. భారీ భవనాలు జలదిగ్భంధంలో చిక్కుకుంటాయి. పాములు, విష పురుగులతో భయానకమైన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఇక్కడ రెండో వీధి ఏర్పాటుకు స్థలం కేటాయించారు.
కావలి ద్విచక్ర వాహనం ఢీ , ట్రాలీ లారీని మినీలారీ వెనుక నుంచి ఢీ
కావలి : కడనూతల వద్ద రోడ్డు దాటుతున్న పర్రి లక్ష్మమ్మ అనే మహిళను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బుధవారం నెల్లూరుకు చెందిన ముజీర్, అతని మిత్రుడు కలిసి కావలికి ద్విచక్ర వాహనంపై వేగంగా వెలుతూ కడనూతల వద్ద అదుపుతప్పి లక్ష్మమ్మను ఢీకొట్టారు.
శ్రీకాళహస్తీశ్వరునికి భక్తుడైన కన్నప్పకు ఇక్కడ తొలిపూజ...
శ్రీకాళహస్తి : ఆదిదేవుడుకు అభిషేక ప్రియుడైన భక్త వల్లభుడు శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా భక్తకన్నప్ప ధ్వజారోహణంతో మాఘ బహుళ నవమి బుధవారం సాయంత్రం 4 : ౩౦ గంటలకు ప్రాంభమయ్యాయి. భక్తుల పాలిట కల్పతరువైన శ్రీ శ్రీ శ్రీ శ్రీకాళహస్తీశ్వరునికి భక్తుడైన కన్నప్పకు ఇక్కడ తొలిపూజను చేసి ఆయన ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయడం ఆనవాయితి వస్తుంది .
Tuesday, February 14, 2012
భార్యను లారీ జయమానితో సహజీవనం చేయాలంటూ ఒత్తిడి
పొదలకూరులోని ఓరుపల్లె పోలయ్య ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేసే వాడు. ఆయన ప్రవర్తనతో విసుగుచెందిన భార్య వెళ్లిపోయింది. ఇద్దరు బాలికలను ఆశచూపి, భయపెట్టి తన కామవాంఛను తీర్చుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
సుఖ పడటమంటేనే శృంగారం అన్న భావన .
"ధర్మేచా... అర్థేచా... కామేచా... మోక్షేచా... నాతి చరామి'' అంటూ పురోహితుడు అగ్ని సాక్షిగా వధూవరులతో ప్రమాణం చేయిస్తాడు. ధర్మం, సంపాదన, సంసారం, అన్ని విధాల నేను నీకు తోడు, నీడగా ఉంటానని దీనర్థం. పెళ్లినాటి ప్రమాణాలలో అతిముఖ్యమైన నాతిచరామికి నేడు తిలోదకాలిస్తున్నారు. సమాజంలో నెలకొన్న ఆధునిక పోకడలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సుఖపడటం అంటే శృంగారం అనే భావన నెలకుంటోంది.
షార్‌లో చిరుతల భయం వదిలేటట్లులేదు
శ్రీహరికోట : శ్రీహరికోట సతీష్‌థావన్ అంతరిక్ష కేంద్రం (షార్) అటవీ ప్రాంతంలో మరిన్ని చిరుత పులులు ఉండవచ్చని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. షార్‌లో ఇటీవల వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి బలైపోయిన చిరుత ఉదంతమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చిరుత మృతిచెందిన పరిసర ప్రాంతంలో రాత్రుళ్లు చిరుత గాండ్రింపులు వినిపిస్తున్నాయంటూ ఫేజ్-2, లేబర్‌కాలనీల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీనిపై స్పందించిన అటవీశాఖ అధికారులు షార్‌లో చిరుతల ఉనికిని కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
పేదలకు కొళాయి కనెక్షన్ అందని ద్రాక్ష...
నెల్లూరు : పురపాలక సంఘాల పరిధిలో వ్యక్తిగత కొళాయి కనెక్షన్ పొందాలంటే రూ.7వేల నుంచి రూ.10వేల వరకు డిపాజిట్ చెల్లించాలి. అంత డబ్బు ఇచ్చుకోలేక పోవడంతో పేదలకు కొళాయి కనెక్షన్ అందని ద్రాక్షలా మారింది. దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పట్టణ ప్రాంతాల్లో పేదోళ్ల ఇళ్లకు రూ.1200లకే కొళాయి కనెక్షన్ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు.
అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు..ఎస్పీ బీవీ రమణకుమార్
నెల్లూరు : జిల్లాలో పోలీసు సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ బీవీ రమణకుమార్ హెచ్చరించారు. మంగళవారం పోలీసు మైదానంలోని ఉమేష్ చంద్ర హాలులో జిల్లాస్థాయి పోలీసు అధికారులతో ఆయన సమీక్షించారు. ఉద్యోగాల్లో అవినీతికి పాల్పడి తలవంపులు తేవద్దని, ఇక నుంచి పోలీసుల ధోరణి మారాలని సూచించారు.
తృప్తి అసంతృప్తి ఈ హెల్త్ కార్డుల ద్వారా ..
నెల్లూరు: ప్రభుత్వం త్వరలో హెల్త్ కార్డులను జారీ చేయనున్నది. దీంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రీ ఎంబర్స్‌మెంట్ ప్రక్రియలో ముందుగా డబ్బు ఖర్చు చేయలేని ఎందరో హెల్త్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఎన్నోమార్లు కోరారు. రీఎంబర్స్‌మెంట్ ప్రక్రియలో ఆలస్యం, ఇతర ఇబ్బందల దృష్ట్యా హెల్త్ కార్డుల వైపే ఉద్యోగులు మొగ్గు చూపారు.
హెల్త్ కార్డుల జారీకి సంబంధించి రెండేళ్ల నుంచి ఉద్యోగ సంఘాలతో ఇరవైసార్లకు పైగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. నెలకు రూ.90 ఈ హెల్త్ కార్డులు పొందే ఉద్యోగి నెలకు రూ. 90 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించటం వల్ల ఉద్యోగికి వైద్య సేవలు సులువుగా పొందే వీలుంది.
తృప్తి అసంతృప్తి ఈ హెల్త్ కార్డుల ద్వారా సంవత్సరంలో కుటుంబంలోని ఒకే ఒక వ్యక్తి వైద్యం చేయించుకునే వీలుంది. కుటుంబంలోని రెండో వ్యక్తికి హెల్త్ కార్డును వినియోగించుకునే వీలుండదు. హెల్త్ కార్డులు అందుతాయనే సంతృప్తిలో ఉన్నా ఉద్యోగులు, ఆ కార్డు ద్వారా కుటుంబంలో ఒక్కరే సంవత్సరంలో వైద్య సేవా ఖర్చులు పొందే వీలుండటంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలోని రెండో వ్యక్తికి హెల్త్ కార్డు వైద్య సేవల అంశమై ముఖ్యమంత్రితో చర్చలు జరగాల్సి ఉంది. కుటుంబంలోని వ్యక్తులందరికీ హెల్త్ కార్డులు సేవలు ప్రతీ సంవత్సరం అందించాలని వారు కోరుతున్నారు. రూ. 3 లక్షలు వరకు సేవలు హెల్త్ కార్డు ద్వారా ఉద్యోగి రూ. 3 లక్షల వరకు వైద్య సేవలు పొందే వీలు కలుగనుంది. రీఎంబర్స్‌మెంట్ ప్రక్రియలో రూ.3.50 లక్షల వరకు ఉద్యోగి రీఎంబర్స్‌మెంట్ పొందేవారు. రీఎంబర్స్‌మెంట్‌లో దాదాపు అన్నీ జిల్లాలలో ఈ సౌకర్యం ఉంది. కుటుంబంలోని వ్యక్తుల సంఖ్యను వివరించాల్సి ఉంది.
హెల్త్ కార్డుల జారీకి సంబంధించి రెండేళ్ల నుంచి ఉద్యోగ సంఘాలతో ఇరవైసార్లకు పైగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. నెలకు రూ.90 ఈ హెల్త్ కార్డులు పొందే ఉద్యోగి నెలకు రూ. 90 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించటం వల్ల ఉద్యోగికి వైద్య సేవలు సులువుగా పొందే వీలుంది.
తృప్తి అసంతృప్తి ఈ హెల్త్ కార్డుల ద్వారా సంవత్సరంలో కుటుంబంలోని ఒకే ఒక వ్యక్తి వైద్యం చేయించుకునే వీలుంది. కుటుంబంలోని రెండో వ్యక్తికి హెల్త్ కార్డును వినియోగించుకునే వీలుండదు. హెల్త్ కార్డులు అందుతాయనే సంతృప్తిలో ఉన్నా ఉద్యోగులు, ఆ కార్డు ద్వారా కుటుంబంలో ఒక్కరే సంవత్సరంలో వైద్య సేవా ఖర్చులు పొందే వీలుండటంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలోని రెండో వ్యక్తికి హెల్త్ కార్డు వైద్య సేవల అంశమై ముఖ్యమంత్రితో చర్చలు జరగాల్సి ఉంది. కుటుంబంలోని వ్యక్తులందరికీ హెల్త్ కార్డులు సేవలు ప్రతీ సంవత్సరం అందించాలని వారు కోరుతున్నారు. రూ. 3 లక్షలు వరకు సేవలు హెల్త్ కార్డు ద్వారా ఉద్యోగి రూ. 3 లక్షల వరకు వైద్య సేవలు పొందే వీలు కలుగనుంది. రీఎంబర్స్‌మెంట్ ప్రక్రియలో రూ.3.50 లక్షల వరకు ఉద్యోగి రీఎంబర్స్‌మెంట్ పొందేవారు. రీఎంబర్స్‌మెంట్‌లో దాదాపు అన్నీ జిల్లాలలో ఈ సౌకర్యం ఉంది. కుటుంబంలోని వ్యక్తుల సంఖ్యను వివరించాల్సి ఉంది.
వెనుకవైపు నుంచి వచ్చి ముసుగు వేసి యాసిడ్ చల్లి
గూడూరు: మండల పరిధిలోని గాంధీనగర్ వరసిద్ధి వినాయక గార్డెన్ సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నెల్లటూరుకు చెందిన శరత్ అనే యువకుడిపై యాసిడ్ తో దాడి చేసి గాయపరిచారు.
తరగతులకు వెళ్ళి విద్యార్ధులకు హితబోధ చేశారు..గూడూరు సబ్‌కలెక్టర్
గూడూరు : విద్యార్ధులు శ్రమదానం ద్వారా సాధ్యమైన సమస్యలను పరిష్కరించుకోవాలని గూడూరు సబ్‌కలెక్టర్ జి.వీరపాండియన్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్ధులకు సూచించారు.
పరీక్షా ఫలితాల ప్రకటనలో జాప్యం జరుగడం దురదృష్టకరం
కోట : మండలంలోని ఎన్‌బికెఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు పరీక్షా ఫలితాలలో జాప్యాన్ని నిరసిస్తూ మంగళవారం రెండవరోజు ఆందోళన కార్యక్రమాలను కొనసాగించారు.ఇంజనీరింగ్ తృతీయ,చతుర్ద విద్యాసంవత్సరం విద్యార్ధులు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి కళాశాలలోని ఇతర ఇంజనీరింగ్ విభాగాల విద్యార్ధులు మద్దతు ప్రకటించి తరగతులు బహిష్కరించారు.
Monday, February 13, 2012
చెరువును రిజర్వాయర్‌గా మార్చారన్నారు
సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం వివిధ గ్రామాల ప్రజలు పట్టణంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. చిల్లకూరు మండలం పొన్నవోలు గ్రామస్థులు మాట్లాడుతూ గ్రామంలో సర్వే నెంబరు 483-పి చెరువు కింద 400 ఎకరాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 200 మంది గతంలో సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామన్నారు.
సీలింగ్ డెకరేటివ్ లైట్స్ రూ.2,500 నుంచి రూ.2.50 లక్షల వరకు..
నెల్లూరులోని గృహాలకు, షాపింగ్ కాంప్లెక్స్‌లకు, స్టార్ హోటళ్లకు డూప్లెక్స్ ఇళ్లకు అవసరమైన అన్ని రకాల షోల్యాంప్స్, డిజైనర్ ల్యాంప్స్, ఎంపీ-3 మ్యూజికల్ ల్యాంప్స్ గోల్డెన్ ఎలక్ట్రికల్స్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.
కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి చిత్రపటాలు...
చిట్టమూరు : వాళ్లపై మీకంత ప్రేమ ఉందా.. అయితే ఆ ఫొటోలు ఎత్తుకెళ్లి మీ ఇళ్లలో పెట్టుకోండి.. కార్యాలయంలో ఇప్పటి సీఎం, స్వతంత్ర సమరయోధుల ఫొటోలు ఏర్పాటు చేయండి. అంటూ ఎంపీ చింతా మోహన్ అధికారులకు సూచించారు.
పేదోళ్ల ఉసురు ఊరికే పోదు మట్టి కొట్టకుపోతారు...
నెల్లూరు : మనీస్కీంతో మోసపోయిన తమను అధికారులు ఆదుకోవాలని లే కుంటే ఆత్మహత్యలే శరణ్యమని బాధి తులు వాపోయారు. యూత్ అండ్ స్ట్రెంగ్త్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు డబ్బు చెల్లించిన ఏజెంట్లు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ముఖ్యమంత్రే స్వయంగా సమాధానం చెప్పాలని నగర ఎమ్మెల్యే ముంగమూరు
నెల్లూరు : జిల్లా తీర ప్రాంతాల్లో ఏర్పాటు కా నున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలపై అ సెంబ్లీలో మంగళవారం చర్చకు రానున్నది. నగర ఎమ్మెల్యే ముంగమూరు థర్మల్ కేంద్రాల ఏర్పాటుపై అసెంబ్లీలో ప్రశ్నలు వేశారు.
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయా?
నె ల్లూరును మహా నగరం గా మార్చేందుకు చుట్టుపక్కల ఉన్న పంచాయతీలను విలీనం చేయాలని పాలకులు భావించారు. ఈ క్రమంలో ఇంతవరకు విలీనంపై జీవో జారీ కాలే దు. దీనికితోడు గ్రామాలు విలీనమె ౖతే రానున్న ఎన్నికల్లో గెలుపు సా« ద్యంకాదేమోనన్న ఉద్దేశంతో అధికారపార్టీ నేతలు వెనుకడుగు వేస్తున్న ట్లు తెలిసింది.
Sunday, February 12, 2012
త్వరలో జగన్ జైలుకు వెళ్లడం..
బు చ్చిరెడ్డిపాళెం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని ఆయ న కుమారుడు జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రా న్ని నిలువుదోపిడీ చేశాడని తెలుగుదే శం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు.
గ్రామదేవత సత్యమ్మతల్లికి భక్తులు పొంగళ్లుపెట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు
కలువాయి: కలువాయి మండలంలోని తోపుగుంట గ్రామానికి చెందిన గ్రామదేవత సత్యమ్మతల్లికి భక్తులు ఆదివారం ఘనంగా పొంగళ్లు నిర్వహించారు.సత్యమ్మతల్లికి వివిద గ్రామాల్లో స్థిపరడివున్న భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చిన పొంగళ్లుపెట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు.
చంద్రబాబు నాలుకను కోస్తానంటూ ప్రకటనలు చేస్తున్న ఎమ్మెల్యే వివేకా
ఆనం సోదరులిద్దరికీ రాజకీయ భిక్ష ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టబట్టే ఈ రోజు అధికార మదంతో స్థాయిని మరచి ఆరోపణలు చేస్తున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నైజం, తల్లిపాలు తాగి ఆ తల్లి రొమ్మునే గుద్దే నీచమైన రాజకీయ సంస్కృతివున్న రూరల్ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి తన స్థాయిని మరచి చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేయడం తగదన్నారు.
విదేశాలలో ఇంజనీర్లుగా పనిచేస్తూ ఇండియాలో వివాహం చేసుకుని..
ఇటీవల కాలంలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎన్‌ఆర్‌ఐ భర్తల వేధింపులపై ఫిర్యాదులు అందుతున్న విషయం తెలిసింది. . ఇదేవిధంగా నెల్లూరు నగరంలో మరో ఎన్‌ఆర్‌ఐ భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు అందినది. అనేకమంది విదేశాలలో ఇంజనీర్లుగా పనిచేస్తూ ఇండియాలో వివాహం చేసుకుని అనంతరం అధిక కట్నం తేవాలని వేధించడం పరిపాటైంది వివరాలిలా వున్నాయి.
సినీ నిర్మాత నికిల్‌రెడ్డిని శనివారం నెల్లూరు నగరంలో అరెస్ట్
సినిమా ఫైనాన్స్ చేసిన వ్యక్తికి డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సినీ నిర్మాతను అరెస్ట్ . వివరాలిలా వున్నాయి.
చంద్రబాబు, సోనియా గాంధీ కాళ్లు కడిగి ఆ నీళ్లు..
రాష్ట్రంలో సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారని, అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో కాంగ్రెస్, టిడిపి కుమ్మకై్క తనను ఓడించాలని ఎన్ని కుయుక్తులు పన్నినా చివరకు ఉప ఎన్నికలో విజయం సాధిస్తానని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇరుపార్టీలపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కిరణ్, చంద్రబాబు రాజకీయాలను మంత్రి డిఎన్ సమర్థించారన్నారు.
ఆత్మకూరు బస్టాండ్ వద్ద రోజు రోజుకూ ట్రాఫిక్ అధికం..
- నెల్లూరు నగరం నడిబొడ్డున వున్న ఆత్మకూరు బస్టాండ్ వద్ద రోజు రోజుకూ ట్రాఫిక్ అధికం అవుతుండడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల కొద్దీ ఈ సర్కిల్‌లో ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో అత్యవసర పనులపై వెళ్లేవారు తీవ్ర వెతలు పడుతున్నట్లు నగర వాసులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం సుమారు 3 గంటలపాటు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్‌లో 108 కూడా ఇరుక్కుపోవడంతో అందులో వున్న పేషెంట్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది.
Subscribe to:
Posts (Atom)