శ్రీకాళహస్తి : ఆదిదేవుడుకు అభిషేక ప్రియుడైన భక్త వల్లభుడు శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా భక్తకన్నప్ప ధ్వజారోహణంతో మాఘ బహుళ నవమి బుధవారం సాయంత్రం 4 : ౩౦ గంటలకు ప్రాంభమయ్యాయి. భక్తుల పాలిట కల్పతరువైన శ్రీ శ్రీ శ్రీ శ్రీకాళహస్తీశ్వరునికి భక్తుడైన కన్నప్పకు ఇక్కడ తొలిపూజను చేసి ఆయన ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయడం ఆనవాయితి వస్తుంది .
స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఆలయంలోని అలంకార మండపంలో భక్తకన్నప్ప ఉత్సవమూర్తికి విశేష అలంకరణలు చేశారు. అలయ వేదపండితులు కన్నప్పకు కుర్పూర హరతులిచ్చి, కైలాగిరిపైనున్న భక్తకన్నప్ప ఆలయం వద్దకు భక్తుల శివనామస్మరణల మధ్య మేళ, తాళాలతో కన్నప్పను చేర్చారు. అక్కడ శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలకు నాంధిగా అష్టదిక్పాలకులను, సకల దేవతలను అహ్వానం పలుకుతూ ధ్వజ స్థంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వేదపండితులు, ఆలయ అర్చకుల వేదమంత్రోశ్చారణల మధ్య ధ్వజారోహణ కార్య్ర క్రమాన్ని అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఇఓ ఎల్వీ.సుబ్రమణ్యం, ఆలయ అర్చకులు, వేదపండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:
Post a Comment