నెల్లూరు జి :ల్లాలోని సాంఘిక సంక్షేమ, ఎస్టీ వసతి గృహాలకు కందిపప్పు సరఫరా చేయడంలేదు. దీంతో అవి నిల్వ ఉండి పుచ్చిపోతున్నాయి. విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. నిధుల వథా వసతిగృహాలకు కందిపప్పును సరఫరా చేసేందుకు సాంఘిక సంక్షేమశాఖకు రూ.4.08 లక్షలు, ఐటీడీఏ వసతి గృహాలకు రూ. 2.06లక్షలు విడుదల చేశారు.
కందిపప్పు పుచ్చి పోయి పురుగులు పట్టడంతో నిధులు వృథా అయ్యాయి. దీన్నే కొన్ని వసతిగృహాలకు సరఫరా చేశారు. ఈ విషయమై అక్కడి సిబ్బంది జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఏజేసీ విస్త్రృత తనిఖీలు చేస్తుండడంతో మద్రాస్ బస్టాండ్ సమీపంలోని వసతి గృహ సముదాయంలో మాత్రం సంక్షేమాధికారులు కందిపప్పును తీసుకోలేమంటూ వెనక్కి పంపారు. గతంలో బఠాణీల విషయంలో కూడా పుచ్చిన వాటినే వసతి గృహలకు సరఫరా చేసిన విషయం తెలిసిందే.
విద్యార్థుల అగచాట్లు పుచ్చిన కందిపప్పుతో వంటచేస్తుండడంతో విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పలువురు సంక్షేమాధికారులు ఈ పప్పును ఎండబెట్టి వంటలలో వేస్తున్నారు. ఐటీడీఏ వసతి గృహాలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సాంఘిక సంక్షేమశాఖ డీడీ విశ్వమోహన్‌రెడ్డి కూడా ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు.

No comments:
Post a Comment