online marketing

Tuesday, February 14, 2012

తృప్తి అసంతృప్తి ఈ హెల్త్ కార్డుల ద్వారా ..

నెల్లూరు:  ప్రభుత్వం త్వరలో హెల్త్ కార్డులను జారీ చేయనున్నది. దీంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రీ ఎంబర్స్‌మెంట్ ప్రక్రియలో ముందుగా డబ్బు ఖర్చు చేయలేని ఎందరో హెల్త్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఎన్నోమార్లు కోరారు. రీఎంబర్స్‌మెంట్ ప్రక్రియలో ఆలస్యం, ఇతర ఇబ్బందల దృష్ట్యా హెల్త్ కార్డుల వైపే ఉద్యోగులు మొగ్గు చూపారు.
హెల్త్ కార్డుల జారీకి సంబంధించి రెండేళ్ల నుంచి ఉద్యోగ సంఘాలతో ఇరవైసార్లకు పైగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. నెలకు రూ.90 ఈ హెల్త్ కార్డులు పొందే ఉద్యోగి నెలకు రూ. 90 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించటం వల్ల ఉద్యోగికి వైద్య సేవలు సులువుగా పొందే వీలుంది.

తృప్తి అసంతృప్తి ఈ హెల్త్ కార్డుల ద్వారా సంవత్సరంలో కుటుంబంలోని ఒకే ఒక వ్యక్తి వైద్యం చేయించుకునే వీలుంది. కుటుంబంలోని రెండో వ్యక్తికి హెల్త్ కార్డును వినియోగించుకునే వీలుండదు. హెల్త్ కార్డులు అందుతాయనే సంతృప్తిలో ఉన్నా ఉద్యోగులు, ఆ కార్డు ద్వారా కుటుంబంలో ఒక్కరే సంవత్సరంలో వైద్య సేవా ఖర్చులు పొందే వీలుండటంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలోని రెండో వ్యక్తికి హెల్త్ కార్డు వైద్య సేవల అంశమై ముఖ్యమంత్రితో చర్చలు జరగాల్సి ఉంది. కుటుంబంలోని వ్యక్తులందరికీ హెల్త్ కార్డులు సేవలు ప్రతీ సంవత్సరం అందించాలని వారు కోరుతున్నారు. రూ. 3 లక్షలు వరకు సేవలు హెల్త్ కార్డు ద్వారా ఉద్యోగి రూ. 3 లక్షల వరకు వైద్య సేవలు పొందే వీలు కలుగనుంది. రీఎంబర్స్‌మెంట్ ప్రక్రియలో రూ.3.50 లక్షల వరకు ఉద్యోగి రీఎంబర్స్‌మెంట్ పొందేవారు. రీఎంబర్స్‌మెంట్‌లో దాదాపు అన్నీ జిల్లాలలో ఈ సౌకర్యం ఉంది. కుటుంబంలోని వ్యక్తుల సంఖ్యను వివరించాల్సి ఉంది.

ఉద్యోగులు పెన్షనర్లు జిల్లాలో మొత్తం ఉద్యోగులు 37వేల మంది ఉన్నారు. పెన్షనర్లు 22వేల మంది ఉన్నారు. ఉద్యోగులకు జీతాల రూపేణా రూ. 43 లక్షలను చెల్లిస్తున్నారు. పెన్షనర్లకు రూ. 18 కోట్లను చెల్లిస్తున్నారు. వీరందరికీ హెల్త్ కార్డుల వలన ఉపయోగం కలుగుతుంది. మరో మూడు నెలలు హెల్త్ కార్డుల ప్రక్రియ ప్రారంభం కావడానికి మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ కార్డుల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh