నెల్లూరు : పురపాలక సంఘాల పరిధిలో వ్యక్తిగత కొళాయి కనెక్షన్ పొందాలంటే రూ.7వేల నుంచి రూ.10వేల వరకు డిపాజిట్ చెల్లించాలి. అంత డబ్బు ఇచ్చుకోలేక పోవడంతో పేదలకు కొళాయి కనెక్షన్ అందని ద్రాక్షలా మారింది. దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పట్టణ ప్రాంతాల్లో పేదోళ్ల ఇళ్లకు రూ.1200లకే కొళాయి కనెక్షన్ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు.
ఈ మొత్తాన్ని నెలకు వంద చొప్పున 12 నెలల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. దీంతో పేదలు కొళాయిలు కనెక్షన్ పొందేందుకు ఆసక్తి చూపారు. అయితే, ఇందులో నిబంధనలు కఠినంగా ఉండటంతో కనెక్షన్ల మంజూరు అంతంతమాత్రంగానే ఉంటోంది. ఈ నిబంధనలు మరింత సవరించి కేవలం రూ.200లకే కొళాయి కనెక్షన్ ఇచ్చేందుకు మున్సిపల్ శాఖ శ్రీకారం చుట్టింది. అంతూగార నెలకు వంద చొప్పున రెండు నెలల్లో చెల్లించే వెసులుబాటునూ కల్పించింది. భారీగా దరఖాస్తులు భారీ మొత్తంలో డిపాజిట్ తగ్గడంతో వ్యక్తిగత కొళాయి కనెక్షన్ల కోసం దరఖాస్తులు వెల్లువలా వచ్చి చేరుతున్నాయి. నెల్లూరుతో పాటు గూడూరు, కావలి, వెంకటగిరి మున్సిపాలిటీలలో కనెక్షన్‌ల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. నెల్లూరులో ఇప్పటికే ఎనిమిది వేల కనెక్షన్‌లు మంజూరు చేయగా ఇంకా దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా వచ్చి చేరుతున్నాయి. ఇదిలా ఉంటే ధనికులతో సమానంగా ఇప్పటివరకు పేదల కనెక్షన్‌కూ నెలకు వంద రూపాయల పన్ను వసూలు చేస్తున్నారు. దీనిని రూ.45లకు తగ్గిస్తూ మున్సిపల్ ఉన్నతాధికారులు ఇటీవల నిర్ణయం తీసుకుంది.

No comments:
Post a Comment