online marketing

Tuesday, February 14, 2012

అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు..ఎస్పీ బీవీ రమణకుమార్

నెల్లూరు : జిల్లాలో పోలీసు సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ బీవీ రమణకుమార్ హెచ్చరించారు. మంగళవారం పోలీసు మైదానంలోని ఉమేష్ చంద్ర హాలులో జిల్లాస్థాయి పోలీసు అధికారులతో ఆయన సమీక్షించారు. ఉద్యోగాల్లో అవినీతికి పాల్పడి తలవంపులు తేవద్దని, ఇక నుంచి పోలీసుల ధోరణి మారాలని సూచించారు.

 గూడూరుకు మందలింపు ఇసుక, సిలికాల రవాణాలో గూడూరు సబ్ డివిజన్ పోలీసులు అవినీతికి పాల్పడుతున్నారని తనదృష్టికి వచ్చిం దని, మరోసారి ఇలా జరిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఎస్పీ హెచ్చరిం చారు. చిన్నాచితకా కేసుల్లో నిందితుల ను పట్టుకోకపోవడంపై ఎస్ఐ సంగమే శ్వరరావుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గూడూరు సబ్ డివిజన్‌లో ఎస్ఐలు, సీఐలు సక్రమంగా పని చేయడం నే ర్చుకోవాలని ఆయన సూచించారు. నేటి నుంచి సెక్టార్ స్టేషన్లు నెల్లూరులో 4, 5వ నగరం పోలీసు స్టేషన్‌లను సెక్టార్ వారీగా విభజించను న్నారు. ఈ స్టేషన్లలో క్రైమ్ ఎస్ఐలుగా పనిచేస్తున్న మల్లికార్జునరావు, శ్రీనివాస రావు శాంతి భద్రతలు, నేర పరిశోధన విభాగం, ట్రాఫిక్‌లను పర్యవేక్షించాల్సి ఉంటుంది. బుధవారం ఉదయం ఓఎస్ డీ నరసింహకిషోర్ వీ రికి బాధ్యతలు అప్పగించనున్నారు. జీఎన్‌టీ రోడ్డుకి రెండు వైపులా 4, 5 స్టేషన్లను నలుగురు ఎస్ఐలు పర్యవేక్షించనున్నారు. ఒకటి, మూడు షిఫ్ట్ పద్ధతిలో బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh