ఇటీవల కాలంలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎన్‌ఆర్‌ఐ భర్తల వేధింపులపై ఫిర్యాదులు అందుతున్న విషయం తెలిసింది. . ఇదేవిధంగా నెల్లూరు నగరంలో మరో ఎన్‌ఆర్‌ఐ భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు అందినది. అనేకమంది విదేశాలలో ఇంజనీర్లుగా పనిచేస్తూ ఇండియాలో వివాహం చేసుకుని అనంతరం అధిక కట్నం తేవాలని వేధించడం పరిపాటైంది వివరాలిలా వున్నాయి.
నగరంలోని దర్గామిట్ట శాంతినగర్‌కు చెందిన సింధూర అనే యువతికి బుచ్చికి చెందిన వాకాటి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అనే యువకునితో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సందర్భంగా కృష్ణారెడ్డి, సుధీరమ్మ కుమారుడైన ప్రశాంత్‌రెడ్డికి రూ.10 లక్షల నగదు, 50 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. అనంతరం అమెరికాలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్‌కుమార్‌రెడ్డి భార్య సింధూరను ఇంకా అధిక కట్నం కావాలంటూ పెళ్లి సందర్భంగా ఇచ్చిన రెండెకరాల పొలాన్ని తన పేరుమీద రాసివ్వాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. భర్తతోపాటు అత్తమామలు, మరిది వేధింపులు ఎక్కువవడంతో భరించలేని సింధూర నెల్లూరుకు చేరుకుంది. భర్త, మరిది, అత్త మామల వేధింపులకు తాళలేక సింధూర శనివారం వారిపై 4వ నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 4వ నగర ఎస్‌ఐ రామాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

No comments:
Post a Comment