శ్రీహరికోట : శ్రీహరికోట సతీష్‌థావన్ అంతరిక్ష కేంద్రం (షార్) అటవీ ప్రాంతంలో మరిన్ని చిరుత పులులు ఉండవచ్చని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. షార్‌లో ఇటీవల వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి బలైపోయిన చిరుత ఉదంతమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చిరుత మృతిచెందిన పరిసర ప్రాంతంలో రాత్రుళ్లు చిరుత గాండ్రింపులు వినిపిస్తున్నాయంటూ ఫేజ్-2, లేబర్‌కాలనీల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీనిపై స్పందించిన అటవీశాఖ అధికారులు షార్‌లో చిరుతల ఉనికిని కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా మంగళవారం అటవీ శాఖ అధికారి హరికుమార్ మరో ఇద్దరితో షార్‌లో తిరిగినట్లు సమాచారం. చిరుత పిల్లలను చూసినట్లు కొందరు వారి దృష్టికి తెచ్చారు. ఇందుకు సంబంధించి అడుగుజాడలు కూడా సేకరించారు.
మృతి చెందిన చిరుత సంతతి. షార్‌లో మృతి చెందిన మగ చిరుత వయస్సు 8 సంవత్సరాలు ఉంటుందని అధికారులు భావించారు. సహజంగా చిరుతలు 18 నుంచి 20 ఏళ్ల వరకు జీవిస్తాయని, మృతి చెందిన చిరుత మంచి యుక్తవయసులో ఉండటంతో దీని సంతతి కూడా షార్ అడవుల్లో ఉండోచ్చని అనుమానిస్తున్నారు. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటే షార్ అటవీ ప్రాంతంలో మరిన్ని చిరుతలు ఉంటాయని అనుమానిస్తున్నారు. గడగడలాడుతున్న షార్ వాసులు చిరుత మృతి అనంతరం షార్‌లో నివసిస్తున్న ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అదిగో పులి అంటే... ఇదిగో తోక చందంగా షార్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. చిరుతల భయంతో అటవీ ప్రాంతంలోకి వెళ్లేందుకు కాంట్రాక్ట్ కూలీలు, సిబ్బంది, షార్ ఉద్యోగులు జంకుతున్నారు. అయితే, ఈ భయం వల్ల అటవీ ప్రాంతంలో దొంగతనాలు తగ్గే అవకాశం ఉంటుందని సీఐఎస్ఎఫ్ బలగాలు భావిస్తున్నాయి.
శ్రీహరికోట రాకెట్ కేంద్రం రెండో గేట్ నుంచి దట్టమైన అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. షార్ కేంద్రానికి చెందిన భవనాలు, ముఖ్యకార్యాలయాలు, అటవీ ప్రాంతంలో అక్కడక్కడా విసిరేసినట్లు ఉంటాయి. సాధారణంగా ఈ కార్యాలయాలలో బిక్కుబిక్కుమంటూ ఉద్యోగులు విధులు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం చిరుత భయంతో ఈ కార్యాలయాలకు వెళ్లేందుకు ఉద్యోగుల సైతం జంకుతున్నారు. వేల ఎకరాల్లో విస్తరించి ఉండే షార్ అటవీ ప్రాంతంలో చిరుతల జాడలను పసికట్టాలంటే అటవీ శాఖ, పులికాట్ వన్యప్రాణి విభాగం, షార్ భద్రతా విభాగాలు సంయుక్తంగా ప్రయత్నించాల్సి ఉంటుంది. వాటిని బంధించి వన్యప్రాణి విభాగాలకు తరలిస్తేకాని షార్‌లో చిరుతల భయం వదిలేటట్లులేదు. సతీష్‌థావన్ అంతరిక్ష కేంద్రం (షార్) అటవీ ప్రాంతంలో మరిన్ని చిరుత పులులు ఉండవచ్చని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. షార్‌లో ఇటీవల వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి బలైపోయిన చిరుత ఉదంతమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చిరుత మృతిచెందిన పరిసర ప్రాంతంలో రాత్రుళ్లు చిరుత గాండ్రింపులు వినిపిస్తున్నాయంటూ ఫేజ్-2, లేబర్‌కాలనీల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీనిపై స్పందించిన అటవీశాఖ అధికారులు షార్‌లో చిరుతల ఉనికిని కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మంగళవారం అటవీ శాఖ అధికారి హరికుమార్ మరో ఇద్దరితో షార్‌లో తిరిగినట్లు సమాచారం. చిరుత పిల్లలను చూసినట్లు కొందరు వారి దృష్టికి తెచ్చారు. ఇందుకు సంబంధించి అడుగుజాడలు కూడా సేకరించారు.

No comments:
Post a Comment