online marketing

Monday, February 13, 2012

చెరువును రిజర్వాయర్‌గా మార్చారన్నారు

 సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం వివిధ గ్రామాల ప్రజలు పట్టణంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. చిల్లకూరు మండలం పొన్నవోలు గ్రామస్థులు మాట్లాడుతూ గ్రామంలో సర్వే నెంబరు 483-పి చెరువు కింద 400 ఎకరాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 200 మంది గతంలో సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామన్నారు.

ఇటీవల పరిశ్రమల కోసం చెరువును రిజర్వాయర్‌గా మార్చారన్నారు. దీంతో చెరువులో వ్యవసాయం చేస్తున్న తమ భూములను రిజర్వాయర్‌లోకి తీసుకున్నారన్నారు. అందుకు చెల్లిస్తామన్న నష్టపరిహారాన్ని తమ గ్రామానికి మాత్రం చెల్లించలేదన్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గోను జయరామయ్య, కేఆర్ దాసరి, రమణయ్య, కృష్ణదాసు, శీనయ్య, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీహెచ్‌పీఎస్ డివిజన్ అధ్యక్షుడు మందాకృష్ణయ్య మాట్లాడుతూ ఐదేళ్లుగా మండల పరిధిలోని గాంధీనగర్, ప్రశాంతినగర్, సుందరయ్యకాలనీలలో మౌలిక వసతులు లేక ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని, ఇకనైనా న్యాయం చేయాలన్నారు. ఈ కా ర్యక్రమంలో కృష్ణయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి సునీల్ మాట్లాడుతూ ఆరు రోజులుగా పాలిటెక్నిక్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆందోళన చేస్తున్నారన్నారు. విద్యార్థులు చదువులు సాగక అవస్థలు పడుతున్నారన్నారు. అధికారులు స్పందించి కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించి క్లాసులు జరిగేలా చూడాలన్నారు. కళాశాలలో తాగునీరు, బెంచీల వసతి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, రాజేంద్ర, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh