కోట : మండలంలోని ఎన్‌బికెఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు పరీక్షా ఫలితాలలో జాప్యాన్ని నిరసిస్తూ మంగళవారం రెండవరోజు ఆందోళన కార్యక్రమాలను కొనసాగించారు.ఇంజనీరింగ్ తృతీయ,చతుర్ద విద్యాసంవత్సరం విద్యార్ధులు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి కళాశాలలోని ఇతర ఇంజనీరింగ్ విభాగాల విద్యార్ధులు మద్దతు ప్రకటించి తరగతులు బహిష్కరించారు.
ఈ సందర్భంగా కళాశాల ఆవరణంలో భైఠాయించి నిరసన వ్యక్తం చేసిన విద్యార్ధులు మాట్లాడుతూ గత ఏడాది నుంచి ఇప్పటి వరకు పరీక్షా ఫలితాలను ప్రకటించలేదని ,అదనపు ఫీజులు చెల్లించాలంటూ యాజమాన్యం ఒత్తిడులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కళాశాల డైరెక్టరును వివరణ కోరగా పరీక్షా ఫలితాల ప్రకటనలో జాప్యం జరుగడం దురదృష్టకరమన్నారు. ఎస్‌వి యూనివర్శిటీ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. త్వరితగతిన సమస్య పరిష్కారం అయ్యేలా చొరవ చూపుతామని విద్యార్ధులకు హామీ ఇచ్చారు.

No comments:
Post a Comment