గూడూరు : విద్యార్ధులు శ్రమదానం ద్వారా సాధ్యమైన సమస్యలను పరిష్కరించుకోవాలని గూడూరు సబ్‌కలెక్టర్ జి.వీరపాండియన్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్ధులకు సూచించారు.
ఇటీవల కళాశాలలో నెలకొన్న సమస్యలపై విద్యార్ధులు సబ్‌కలెక్టర్ దృష్టికి తెచ్చిన నేపధ్యంలో ఆయన మంగళవారం ఆకస్మికంగా కళాశాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన వివిధ విభాగాల తరగతులకు వెళ్ళి విద్యార్ధులకు హితబోధ చేశారు. పారిశుధ్యంలో భాగంగా డ్రైనేజీ వంటి సమస్యలను శ్రమదానం ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో స్థానికులే తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలుగా ఉపాధిహామీ పథకాన్ని అమలు చేస్తూ ప్రజల భాగస్వామ్యంతో సమస్యలను పరిష్కరిస్తుందని విద్యార్ధులకు గుర్తు చేశారు. ప్రభుత్వపరంగా అవసరమైన చర్యలు తాము చేపడతామని తెలిపారు.

No comments:
Post a Comment