online marketing

Monday, February 13, 2012

పేదోళ్ల ఉసురు ఊరికే పోదు మట్టి కొట్టకుపోతారు...

నెల్లూరు : మనీస్కీంతో మోసపోయిన తమను అధికారులు ఆదుకోవాలని లే కుంటే ఆత్మహత్యలే శరణ్యమని బాధి తులు వాపోయారు. యూత్ అండ్ స్ట్రెంగ్త్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు డబ్బు చెల్లించిన ఏజెంట్లు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

వారు మాట్లాడుతూ సంస్థలో జిల్లావ్యాప్తంగా ఏజెంట్లను రామయ్య, డా క్టర్ సురేష్‌లు నియమించారని, వచ్చిన కోట్లాది రూపాయలతో వారు ఆస్తులు కూడబెట్టుకుని పేద ప్రజలకు ఎగనా మం పెట్టారన్నారు. తాము కమిషన్ కోసం సంస్థలో చేరామన్నారు. ఇప్పటికే ఐదు నెలల నుంచి గ్రామాలలోకి వెళ్లలేక ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవిగో ఆస్తులు మనీస్కీం పేరుతో డాక్టర్ సురేష్‌బాబుయాదవ్, రామయ్యలు కూడబెట్టిన ఆస్తుల వివరాలను ఏజంట్లు బయట పెట్టారు. నాయుడుపేట సమీపంలోని నెలబల్లి వద్ద 35 ఎకరాల భూమి కొను గోలు రిజిస్ట్రేషన్ పూర్తి కాగా, మరో 50 ఎకరాలకు రూ.70లక్షలు అడ్వాన్సుగా చెల్లించారన్నారు. నగరంలోని పొగతోటలోని సాయికృష్ణ డయాబెటీస్ ఆసుపత్రి సమీపంలోనే మరో భవనాన్ని కొ నుగోలు చేశారన్నా. కోట మండలంలో 40 అడుగుల భవనాన్ని రూ.20 లక్షల తో, ప్రకాశం జిల్లా కనిగిరిలో సురేష్ చెల్లెలు బంకా అనూరాధకు ఆరు కోట్ల తో ఆసుపత్రి నిర్మించారన్నారు. గుడ్లూరులో 35 ఎకరాల మామిడితోట, 30 ఎకరాలు జామాయిల్ తోటలు కొన్నా రన్నారు. వాటిని సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకుని ప్రజలకు చెల్లించాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. పేదోళ్ల ఉసురు ఊరికే పోదు మట్టి కొట్టకుపోతారని కొందరు మహి ళా ఏజంట్లు శాపనార్ధాలు పెట్టారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh