నెల్లూరు: ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయస్సు గల బాల బాలికలందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను నూటికి నూరుశాతం అందించేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్ తెలిపారు. శనివారం స్థానిక గోల్డెన్‌జూబ్లీ హాలులో రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బడిబాట కార్యక్రమంపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల పునః ప్రారంభం నాటికి బాలబాలికలందరూ పాఠశాలల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల రిసోర్స్‌పర్సన్లతో కలిసి అంగన్‌వాడీ వర్కర్లు, వయోజన విద్యా ప్రేరక్‌లు, సాక్షర భారత్ వాలంటీర్లు, మహిళా సమాఖ్యలు, యువజన సంఘాలు, గ్రామ సహాయకుల సహకారంతో 2011, మే 8వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు ప్రతి కుటుంబాన్ని సందర్శించి ఓటర్ల జాబితా ఆధారంగా 6-14 సంవత్సరాల వయస్సు కల్గిన బడిబయట పిల్లల వాస్తవ పరిస్థితులను సేకరించాలన్నారు. సేకరించిన వివరాలను నిర్దేశించిన నమూనాలలో తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. జిల్లాలో బడికి దూరంగా ఉన్న 4241 మంది బడిఈడు పిల్లలను గుర్తించినట్లు తెలిపారు. ఇందులో 2289 మంది బాలురు, 1952 మంది బాలికలు ఉన్నారన్నారు. ప్రాథమిక విద్యాశాఖ నిర్వహించిన సర్వే వివరాలను బడిబాట సందర్భంగా గ్రామసభలలో సామాజిక తనిఖీల ద్వారా ధ్రువీకరించుకోవాలన్నారు.
‘బడీడు పిల్లలందర్నీ పాఠశాలల్లో చేర్పించాలి’
అదనపు జాయింట్ కలెక్టర్ టి సీతారామయ్య మాట్లాడుతూ రాజీవ్ విద్యామిషన్, విద్యాశాఖ అధికారులు సమన్వయంగా పనిచేసి బడికి దూరంగా ఉన్న బడిఈడు పిల్లందరినీ గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించాలన్నారు. సంబంధిత మండల విద్యాశాఖాధికారులు, మండల రిసోర్స్‌పర్సన్స్, తహశీల్దార్ల నుండి ఓటర్ల జాబితా ప్రతులను తీసుకుని వాటి ఆధారంగా సమగ్రంగా సర్వే నిర్వహించి బడికి దూరంగా ఉన్న బడిఈడు పిల్లలను గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్‌పి నాగేశ్వరరావు, రాజీవ్ విద్యామిషన్ పివో జలీల్‌బాషా, జిల్లా విద్యాశాఖాధికారి బాలకాశయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణారెడ్డి, ఐసిడిఎస్ పిడి శారద, మండల విద్యాశాఖాధికారులు, మండల రిసోర్స్‌పర్సన్స్, తదితరులు పాల్గొన్నారు.