online marketing

Sunday, May 8, 2011

మేకపాటి సంస్థల్లో జగన్‌ డబ్బు రూ.8 వేల కోట్లు : ఆనం వివేకానందరెడ్డి

నెల్లూరు : మేకపాటి సోదరుల వ్యాపార సంస్థల్లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి చెందిన డబ్బు రూ.8 వేల కోట్లు రొటేషన్‌ అవుతుందని నెల్లూరు రూరల్‌ ఎమ్మల్యే ఆనం వివేకానందరెడ్డి ఆరోపించారు. బుధవారం నెల్లూరు మినీ బైపాస్‌ రోడ్డులోగల సామాజిక వికాస భవనంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మేకపాటి సోదరులపై పలు ఆరోపణలు చేశారు. జగన్‌కు సంబంధించిన రూ.1.40 లక్షల కోట్ల ఆస్తుల్లో రూ.40 వేల కోట్లు మాత్రం స్థిరాస్తుల రూపంలో ఉన్నాయని, మిగిలిన లక్ష కోట్ల ధనాన్ని వ్యాపార మిత్రులవద్ద రొటేషన్‌ చేస్తున్నాడని అన్నారు. ఆ జాబితాలో మేకపాటి సోదరుల పేర్లున్నాయన్నారు. మేకపాటి సోదరులు కచ్చితంగా విశ్వసనీయతలేని నీతిమాలిన రాజకీయ నాయకులు అన్నారు. ఏ మాత్రం నీతి, నిజాయితీ ఉన్నా రాజీనామా చేసి జగన్‌ వైపు వెళ్లి ఉండేవారన్నారు. కడపను సర్వనాశనం చేయడానికే జగన్‌ కంకణం కట్టుకున్నాడన్నారు. కడప అభివృద్ధిని తన రాజకీయ స్వార్ధంతో చిన్నాభిన్నం చేస్తున్నాడనీ, సీఎంకావాలనే అశతోనే పెంచిపోషించిన కాంగ్రెస్‌కు ద్రోహంచేసి రాజీనామా చేసినట్లు ఆనం చెప్పారు.
కడపలో చిరంజీవి ప్రచారంతో కాంగ్రెస్‌ పుంజుకుందన్నారు. చిరంజీవి, చంద్రబాబుపై దాడులు జరిగిన తర్వాత జగన్‌ పలుకుబడి దిగజారిందన్నారు. ఈ సమావేశంలో నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, మాజీ కార్పొరేటర్లు పిండి సురేష్‌, సూళ్లూరు రమాదేవి, సంక్రాంతి కల్యాణ్‌, కాం గ్రెస్‌ నాయకులు మేఘనాధ్‌సింగ్‌, డి.రాజానాయుడు, కె.హరికుమార్‌, షేక్‌ నన్నేసాహెబ్‌, సూళ్లూరు దేవరాజులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh