కోట : ఎన్ని అవాంతరాలు ఎదురయినా దుగరాజపట్టనంకు ఓడ రేవును చేసేందుకు కృషి చేస్తానని తిరుపతి పార్లమెంట్‌సభ్యులు చింతా మోహన్ అన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యశాలలోని పలు గదులను పరిశీలించారు.తదుపరి సంబంధిత అధికారులను, సిబ్బందిని అక్కడి స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వున్న డాక్టర్ల కొరత, సిబ్బంది కొరతను వారం రోజులలోపు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వాకాడు మండలంలోని సముద్ర తీరప్రాంతలో గల దుగరాజపట్టనాన్ని బ్రిటీష్ పరిపాలనలో ఉన్నటువంటి పూర్వవైభవాన్ని మళ్లీ తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
దీనిపై రాష్టప్రతికి, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళడం కూడా జరిగిందని ఆయన అన్నారు. మండలంలో పనికీ ఆహార పథకం చిత్తూరు జిల్లాలో పురోగతిని సాధించిందని, సుమారు 87 గ్రామాలలో 3 కోట్ల రూపాయలకు పైగా ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందారన్నారు. నెల్లూరు జిల్లా వెనుకబడి వుందని, సర్వేపల్లి అసెంబ్లీ నియోజక వర్గంలో కూడా ఈ పథకం చాల వెనుకబడి వుందని కోట, వాకడు, చిట్టమూరు మండలాలలో కొంత వరకు మెరుగుపడిందని, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలలో ఉత్తమమైన పథకం పనికీ ఆహార పథకం అని ఆయన అన్నారు.
ప్రజలు ఈ పథకంలో కూలీలు గ్రూపులుగా చేయడం వలన శ్రద్ద వహించలేకుండా వున్నారని, ఫీల్డ్ అసిస్టెంట్‌లు గ్రామాలలోకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించలేక పోవడం ఒక కారణమన్నారు. జిల్లాలో నేడు రూ.5 కోట్ల వ్యయంతో పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శిలా ప్రతిష్ట చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా తిరుపతిలో మూడు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుగుతుందని ఆయన అన్నారు. ఈయన వెంట సర్దార్‌హెస్సేన్, డాక్టర్ సుందరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment