వాకాడు: 3,50,000 మెజారిటీతో వైయస్ జగన్ గెలుపు ఖాయమని, వైయస్‌ఆర్ పార్టీ నాయకులు నేదురుమల్లి పద్మనాభరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఢిల్లీ నుండి పెద్ద పెద్ద మంత్రులు వచ్చినా, జగన్, విజయమ్మల మెజారిటీని తప్పించలేరన్నారు. సోనియాగాంధీ, వైయస్‌ఆర్ అభిమానుల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. వైయస్‌ఆర్ కీర్తిప్రతిష్టలను కడప ప్రజలు ఎప్పుడూ గౌరవిస్తూనే ఉన్నారని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబునాయుడు, జగన్‌ను లాడెన్‌తో పోల్చటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. చిరంజీవి జిమ్మిక్కులు కడప ప్రజలు వినే పరిస్థితులో లేరని వారు తెలిపారు. జగన్ గెలుపుతో భారతదేశ రాజకీయాలలో పలుమార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, చట్టపరమైన చర్యలు చేపడుతున్నారన్నారు. సోనియాగాంధీకి కడపలో జరుగుతున్న పరిణామాలతో జగన్ అంటే భయం పుడుతుందన్నారు. ఇకనైనా సోనియాగాంధి కళ్లు తెరవకపోతే అనేక పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన అన్నారు. తాను ప్రచారం చేసిన పులివెందుల, బద్వేలు, కమలాపురం, చింతలగుంటలపాలెం, ప్రొద్దుటూరు, వేంపల్లి, కడప రూరల్, అర్బన్, వైయస్‌ఆర్ పుట్టిన బల్పానూరు ప్రాంతాలలో వైయస్‌ఆర్ అభిమానులు అధికసంఖ్యలో జేజేలు కొడుతున్నారన్నారు. ఇతర దేశాలలో ఉన్న వైయస్‌ఆర్ అభిమానులు ఇంటర్నెట్ ద్వారా, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా జగన్ విజయానికి సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నేదురుమల్లి రంజన్‌రెడ్డి, పెంచలరెడ్డి ఉన్నారు.
No comments:
Post a Comment