online marketing

Sunday, May 8, 2011

సింహపురి తీరంలో మరో 'థర్మల్‌' పిడుగు !

సింహపురి తీరంలో మరో 'థర్మల్‌' పిడుగు పడనుంది. 'వీనస్‌ పవర్‌ వెంచర్స్‌ (ఇండియా) లిమిటెడ్‌' స్థాపించనున్న థర్మల్‌ విద్యుత్కేంద్రానికి ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా అనుమతి మంజూరు చేసేందుకు సిద్ధమైరది. దాని విద్యుదుత్పత్తి సామర్థ్యం 350 మెగావాట్లు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో 28 ప్రాజెక్టుల ద్వారా 33 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా సోంపేటలో అక్కడ ప్రజలు తరిమికొట్టిన నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నేలటూరులో నెల్‌క్యాస్ట్‌ విద్యుత్కేంద్రంలో భాగసామ్యమైంది. ఇందులో రూ.150 కోట్ల పెట్టుబడులుపెట్టింది. అవసరానికి మించి థర్మల్‌ విద్యుత్కేంద్రాలకు అనుమతిలిస్తే జిల్లా వల్లకాడుగా మారుతుందనీ, బూడిద తప్ప మనుషులుండరనీ జనవిజ్ఞాన వేదిక, అఖిలపక్షాలు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు దేశ, విదేశాల్లోని పెట్టుబడిదారులు దృష్టిపెట్టారు. కృష్ణపట్నం పోర్టుకు అనుబంధంగా ప్రాజెక్టులు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. పరిశ్రమలు పెడతామని పేద రైతుల నుంచి భూములను కారు చౌకగా తీసుకుంటున్నారు. వారి భూములకు సక్రమమైన పరిహారమూ ఇవ్వడంలేదు. పారిశ్రామికవేత్తలూ, ప్రభుత్వమూ తామిచ్చిన హామీ మేరకు స్థానికులకు ఉపాధీ, ఉద్యోగావకాశాలూ కల్పించడం లేదు.

అన్నింటికి మించి థర్మల్‌ విద్యుత్కేంద్రాల కాలుష్యంపై ప్రజల్లో తీవ్ర అలజడి ఉంది. ఇప్పటివరకూ 33,285 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి 28 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టులకు రోజుకు సుమారు ఐదు లక్షల టన్నుల బొగ్గు వినియోగం జరుగుతుంది. తద్వారా సుమారు రెండు లక్షల టన్నుల బూడిద బయటకొస్తుంది. నెలకు 60 లక్షల టన్నుల బూడిద విడుదలవుతుంది. ఇప్పటికే అన్ని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు అఖిలపక్షంగా ఏర్పడ్డాయి. థర్మల్‌ విద్యుత్కేంద్రాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా ప్రజల తరపున విజ్ఞప్తి కూడా వెళ్లింది. గత ముఖ్యమంత్రి రోశయ్య తన వద్దకు వచ్చిన జిల్లా అఖిలపక్షానికి ఇకపై కొత్త అనుమతులు ఇవ్వబోమని హమీ ఇచ్చారు. అయినా అనుమతులు మాత్రం ఆగడం లేదు. ఒక ప్రాజెక్టు తరువాత మరోదానికి అనుమతులు వస్తూనే ఉన్నాయి.

తాజాగా కృష్ణపట్నం సమీపాన హైదరాబాద్‌కు చెందిన వీనస్‌ పవర్‌ వెంచర్స్‌ (ఇండియా) ప్రయివేట్‌ లిమిటెడ్‌ 175 ఎకరాల్లో 350 మెగావాట్ల విద్యుత్కేంద్ర నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చకచకా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా సోంపేటలో అక్కడ ప్రజలు తరిమికొట్టిన నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నేలటూరులో నెల్‌క్యాస్ట్‌ విద్యుత్కేంద్రంలో భాగసామ్యమైంది. సోంపేటలో ఒక్క విద్యుత్కేంద్రం పెట్టేందుకు ప్రయత్నిస్తేనే ప్రజలు పోరాటం సాగించారు. ఇద్దరు ప్రాణ త్యాగం చేశారు. ఇక వీలులేక పారిశ్రామికవేత్తలు అక్కడ నుండి పలాయనం చిత్తగించారు. అలాంటి విద్యుత్కేంద్రాలన్నీ ఇప్పుడు నెల్లూరు జిల్లాకు రావడం, అవి వెలువరించే కాలుష్యంతో పర్యావరణవేత్తలు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఆరోగ్యంకన్నా పారిశ్రామికవేత్తల జేబులు నింపడానికే ప్రభుత్వం పనిచేస్తోందని జెవివి ఆరోగ్య విభాగం రాష్ట్ర నాయకలు డాక్టర్‌ ఎంవి రమణయ్య విమర్శించారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh