నెల్లూరు:నగరంలోని ఎసి.సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న బ్యాడ్మింటన్ శిక్షణా శిబిరంలోని క్రీడాకారులకు సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం, క్రీడా దుస్తులను అందజేశారు. శనివారం స్థానిక ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ముక్కాల ద్వారకనాధ్ మాట్లాడుతూ జిల్లాలో క్రీడల అభివృద్ధికి ఫౌండేషన్ సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. క్రీడలలో రాణిస్తూ ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రత్యే శ్రద్ధతో వారి అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. ఏ క్రీడాంశానికి చెందినవారికైనా ఫౌండేషన్ ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందన్నారు.
జిల్లాలో మొట్టమొదటిసారిగా బ్యాడ్మింటన్ రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంప్‌ను నిర్వహిస్తున్న సందర్భంగా తమ ఫౌండేషన్ ద్వారా సుమారు 60 మందికి పౌష్టికాహారంను, క్రీడా దుస్తులను అందజేస్తున్నామన్నారు. అంతేకాకుండా జిల్లా స్థాయిలో, రాష్టస్థ్రాయిలో ప్రతిభను కనబరచిన క్రీడాకారులకు నెలకొకరికి సంబంధిత క్రీడలు అవసరమయ్యే పరికరాలను అందజేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. క్రీడాకారుల అభివృద్ధిని కోరుకునేవారు తమని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింహపురి ఫౌండేషన్ అధ్యక్షులు రాకేష్ చౌదరి, సభ్యులు వినోద్‌రెడ్డి, శ్రీనివాసులు, సీనియర్ క్రీడాకారులు వేణుమాధవ్, ప్రతాప్, కోచ్ ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment