నెల్లూరు : నెల్లూరుజిల్లా నడిబొడ్డున ఉన్న సండేమార్కెట్ గత చరిత్ర ఉంది. పేద, మధ్య తరగతి కుటుంబాల వారు నిత్యం సండేమార్కెట్‌లో వ్యాపారాలు చేస్తూ రద్దీగా ఉంటుంది. ప్రతి దినం ఇక్కడ వ్యాపారాలు మూడుపువ్వులు ఆరు కాయలుగా జరిగేవి. పల్లె జనం ఎక్కువగా సండేమార్కెట్‌ను ముందుగా దర్శించుకుని, అవసరమైన అన్ని వస్తువులు ఇక్కడ లభ్యమవు తుండటంతో ఈ మార్కెట్‌లో వ్యాపారాలు విస్తృతంగా సాగేవి. అయితే గతంలో టౌన్‌లోని వివిధ వ్యాపార సంస్థలతో పోల్చుకుంటే ధర సరసమైనవిధంగా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయింది. వ్యాపారులంతా సిండికేట్ అయి, ఒక వస్తువుకి ఒకే ధర అనే నినాదంతో మార్కెట్ వ్యాపారులంతా ఈ షరతులు పాటించాలని, సంఘం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటూ వ్యాపారులు నిర్వహిస్తుండేవారు. ఈ విధంగా ఇక్కడ వ్యాపారులు షాపులు లీజుకు ఇవ్వరాదని, ప్రతి నెల శుక్రవారం సెలవు పాటించాలని, అన్ని షాపులు ఒకే ధరకు వస్తువులు విక్రయించాలనే మూడు షరతులతో ముందుకు సాగుతున్న ఈ వ్యాపారాలు కాస్త పేద, మధ్య తరగతుల వారికి వినియోగదారులకు కష్టతరంగా మారిన, ఇక్కడున్న వ్యాపారులంతా సామాన్యులే కనుక మూడు షరతుల వల్ల ప్రయోజనకారిగా మారిందనే విషయం వాస్తవం. అయితే యూనియన్ పేరుతో షరతులను తప్పక పాటించాలనే విషయంలో కొందరు అతిక్రమించటమేకా కుండా ప్రత్యక్షదాడులకు దిగేస్థాయికి దౌర్జన్యాలకు దిగే సంస్కృతి మొదలయింది. ఇందుకు నిదర్శనంగా గత వారం అర్జున్ అనే వ్యాపారి శరవణ్ అనే వ్యాపారిపై దాడికి పాల్పడి, తలపగలకొట్టి ఇతరులపై భౌతిక దాడులకు పాల్పడటం, అందుకు అతని అనుచరులను పురికొల్పటం వంటి రౌడీయిజం, మార్కెట్‌లో పెచ్చుమీరుతున్న సందర్భాలున్నాయి. జిల్లా పోలీసులు ఈ విషయంలో చొరవచూపి, సండేమార్కెట్‌లో జరుగుతున్న దౌర్జన్యమా? ఆధిపత్యపోరా? రౌడీయిజమా? ఏదైనా కావచ్చు ఇటీవల అరాచకం జరుగుతుంది. వ్యాపారుల మధ్యే కాకుండా అక్కడకు వచ్చే వినియోగదారులపై కూడా కొందరు జులు ప్రదర్శించటం జరిగిన సందర్భాలున్నాయి. గతంలో జెండావీథి వినియోగదారులపై జరిగిన గొడవ పోలీసుల వరకు వెళ్ళింది. ఈ సంఘటనల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగం సండేమార్కెట్ నిర్వహణపై దృష్టిపెట్టి , మార్కెట్‌లోని వినియోగదారులు, వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందిలేకుండా చూడాల్సిన అవసరం జిల్లా పోలీసు యంత్రాంగంపై ఉంది.
No comments:
Post a Comment