online marketing

Monday, January 3, 2011

పది మందికి అందుబాటులో ఉంటా

నెల్లూరు, :నగరమే నా ఊరు, అందరూ నా కుటుంబ సభ్యులు నేను ఎక్కడికి వెళ్ళినా నగరానికి,రూరల్‌ ప్రాంతాలకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి పాటుపడటమే తన ఆశయమని రూరల్‌ ఎంఎల్‌ఏ ఆనం వివేకానందరెడ్డి తెలిపారు. స్థానిక బి.వి.నగర్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రిష్ట్‌మస్‌కు 15కోట్ల రూపాయలు నిధులు నగరానికి తీసుకొచ్చామని, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని 6కోట్ల రూపాయలు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని, మరలా సంక్రాంతికి జల్‌ తుఫాన్‌ ద్వారా 10కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి నగ ర,రూరల్‌ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు.

పదవులు ఉన్నా లేకపోయినా పదిమందికి అందుబాటులో ఉండటమే తమ ప్రధాన ధ్యేయమన్నారు. కొన్ని పత్రికలు విలువల్లేని రాతలు రాయడం తగదన్నారు. ఒక పత్రికకు ఇచ్చిన స్థలాన్ని అమ్ముకొని మరలా మరో స్థలానికి ఎదురు చూడటం ఎంతమాత్రం బాగుందని అన్నారు. కేవలం పొలిటికల్‌ బ్రోకర్‌లాగా వ్యవహరిస్తూ తమ బురద చల్లుతున్నారని విమర్శించారు. నిజాయితీగా వ్యవహరించాల్సిన కొన్ని పత్రికలు పేపర్‌ను అడ్డం పెట్టుకొని తార్చుతున్నారని అన్నారు. బారాషాహీద్‌ దర్గాలో అక్రమాలు జరిగాయాని తెలిపిన వారు వచ్చి నిరూపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటుగా చాట్ల, సన్నపురెడ్డి పెంచలరెడ్డి, సంక్రాంతి, మేకల నరేంద్రరెడ్డి, వెంకటే శ్వర్లు గౌడ్‌, సంఘమిత్ర రవీంద్రరెడ్డి, గిరిబాబు,బర్నా, మేఘనాద్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh