అమ్మబోతే అడవి కొనబోతే కొరివి
జిల్లాలో రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందంగా ఉంది. పుట్టికి 850 కిలోలు. మిల్లర్లు పుట్టి ధాన్యాన్ని 8 వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. 850 కిలోల ధాన్యాన్ని ఆడిస్తే 600 కిలోల బియ్యం వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో బియ్యం రూ.30 ధర పలుకుతోంది. అంటే పుట్టి వడ్లను బియ్యం రూపంలోకి మార్చితే వాటి విలువ సుమారు రూ. 18 వేలు. ఇక తౌడు, పొట్టును ప్రత్యేకంగా అమ్ముకుంటారు. రైతు నుంచి కేవలం ఎనిమిది వేలకుకొనుగోలు చేస్తున్న పుట్టి ధాన్యాన్ని మార్కెట్లో 18 వేలకు విక్రయిస్తున్నారు. అంటే రైతు ఎకరాకు సుమారు 10 వేల రూపాయల వంతున నష్టపోతున్నాడు. కానీ రైతు అంత ధర ఇవ్వాలని కోరడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు 9435 లేదా 9335 రూపాయలు ఇవ్వాలని బతిమలాడుతున్నాడు. ఇకనైనా అధికారులు స్పందించి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
నేడు రైతులు వినూత్న ధర
ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని కోరుతూ జిల్లా కేంద్రంలో అఖిల పక్షం రైతు సంఘం ఆధ్వర్యాన రైతులు వినూత్న ఆందోళనకు దిగనున్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే రైతులు ఆత్మకూరు బస్టాండుకు చేరుకుంటారు. రైతులు, రైతు సంఘాల నాయకులు వరి పనలు చేత్తో తీసుకుని, వడ్ల మూట్లను నెత్తిన పెట్టుకుని గాంధీబొమ్మకు చేరుకుంటారు. అక్కడ వడ్ల రాశి వినూత్న నిరసన తెలుపుతారు. ఈ సందర్భంగా వారు రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టనున్నారు. ఆందోళనలో అధిక సంఖ్యలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని అఖిలపక్ష రైతు సంఘం జిల్లా కన్వీనర్ గంగపట్నం రమణయ్య రైతులకు విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment