online marketing

Tuesday, March 20, 2012

గతంలో సెంట్‌ భూమి వందల్లో పలికితే నేడు సెంట్‌ భూమి లక్షలాది రూపాయల్లో

నెల్లూరు : తడ మండలంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుంది. దీంతో బిజినెస్‌మెన్‌ల చూపు తడ వైపు మళ్లింది. పంట పొలాలన్నీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల వశవుతున్నాయి. మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో పలు భారీ పరిశ్రమలు రావడంతో బిజినెస్‌మెన్‌ల చూపు తడ మండలం వైపు పడింది. దీంతో స్థలాల విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. నేడు మండలంలో నలువైపులా ఎక్కడకూడ ఖాళీ స్థలాల్లే కుండా ఇంటి నిర్మాణాలకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొనుగోలు చేసి ప్లాట్‌లుగా విభజించి అమ్మకాలు సాగిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వల్ల పంట పొలాలన్నీ కనుమరుగవుతున్నాయి. భవిష్యత్‌లో ధాన్యం కొరత ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే మండలంలోని అక్కంపేట చివరి ప్రాంతంలో పంట పొలాల్లో మట్టిని తోలి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి రంగం సిద్ధం చేశారు. తడ మండలంలో ఇప్పటికే సుమారు 22 లే అవుట్‌లు ప్రారంభించి కట్టడాలను నిర్మిస్తున్నారు. మండలంలోని 22కి గాను 5 లే అవుట్‌లకు టెక్నికల్‌ కంట్రోల్‌ ప్లానింగ్‌ ప్రకారం నిర్మాణాలు సాగిస్తోన్నారు. మిగిలిన లే అవుట్‌లకు టెక్నికల్‌ కంట్రోల్‌ ప్లానింగ్‌ ప్రకారం ఇళ్ల కట్టడాలను నిర్మించాలి. కానీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పంచాయతీ అప్రూల్‌తో సరిపెట్టుకొని ఇళ్ల కట్టడాలను నిర్మిస్తున్నారు. దీంతో తడ మండలంలో పలు గ్రామాల్లో కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుంది. గతంలో సెంట్‌ భూమి వందల్లో పలికితే నేడు సెంట్‌ భూమి లక్షలాది రూపాయల్లో పలుకుతుంది. ఈ ప్రాంతంలో భూమి కొనుగోలుదారుల ఉత్సాహం చూపడంతో దళారులు ఇష్టారాజ్యంగా భూముల ధరలు పెంచేస్తున్నారు. గతంలో అక్కంపేట ప్రాంతంలో నర సంచారం కరువైయ్యేది. కానీ నేడు అక్కడ సెంటు భూమి లక్షలాది రూపాయల్లో ధర పలుకుతోంది. జాతీయ రహదారి ప్రాంత స్థలాల భూములకు కూడ ధరలకు రెక్కలొచ్చాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకోవడంతో ప్లాట్‌లను ఎత్తు చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. సమీపంలోని చెరువుల ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ భూమిలో మట్టి గుట్టలను ఏర్పాటు చేసి వాటిని చదును చేసి స్థలాలకు విలువలు పెరిగేల్లా ఏర్పాట్లు సాగిస్తున్నారు. లే అవుట్లలో ఇళ్ల కట్టడాల నిర్మాణాలు సాగిస్తుండటంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా దిన దిన ప్రవర్తమానంగా పెరుగుతోంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో అధికారులు, ఉద్యోగులు, నాయకులు ఉండటంతో వ్యాపారం జోరుగా సాగుతోంది. భవిష్యత్‌లో తడ మండలం భూమి రేట్లు కార్పోరేషన్‌ స్థాయిని మించినా ఆశ్చర్య పోవడంలో తప్పులేదని పలువురు అంటున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh