ఉదయగిరి : రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఉప ఎన్నికల సమరం ముగియటంతో రెండవ విడత ఉప ఎన్నికల సమరం కోసం ఉదయగిరి సిద్ధం పడుతోంది. జిల్లాలో మొదటి విడతగా జరిగిన ఉప ఎన్నికల్లో కోవూరు ఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు ఉదయగిరిలో జరగనున్న ఎన్నికలను మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొనున్నాయి. విప్ ధిక్కారం క్రింద శాసనసభ్యుత్వాన్ని కోల్పోయిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి గత రెండు పర్యయాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించారు. తాజాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఉపపోరుకు సిద్ధపడుతున్నారు. ఉప ఎన్నిక అనివార్యమని భావించే ముందే అభ్యర్ధిని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ కూడా తన వంతు ఎన్నికల వ్యూహన్ని సిద్ధం చేసుకుంటుంది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త బొల్లినేని వెంకట రామారావు ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ తరుపున ఒక విడత నియోజక వర్గం పర్యటన పూర్తి చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల పోరును ఎదుర్కొటానికి సర్వ శక్తులు వడ్డీ వ్యూహన్ని రసించుకుంటోంది. కాంగ్రెస్ పార్టీలో మర్రి వృక్షంలా పెరిగిన మేకపాటి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటంతో కాంగ్రెస్ అభ్యర్ధిత్వం కోసం ద్వితీయ శ్రేణి నేతల్లో ఆశలు పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి ఆశావాహులతోపాటు గతంలో పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి మాదాల జానకిరామ్ కూడా రేసులో ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. టీడీపీ అభ్యర్థిగా ఒక్కసారి, స్వతంత్ర అభ్యర్థిగా మరోసారి ఉదయగిరి శాసనసభ్యుడుగా ఎన్నికయిన కంభం విజయరామిరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరటం ఇటీవల కాలంలో జరిగిన కొత్త పరిణామం.
ఈయన కూడా ఉదయగిరి టిక్కెట్టు ఆశిస్తున్నట్లు తెలిసింది. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పి చెంచలబాబుయాదవ్, సీతారామపురం మాజీ జడ్పీటీసి సభ్యులు దుగ్గిరెడ్డి గురువారెడ్డి, జలదంకి మాజీ మండలాధ్యక్షుడు కావ్వ కృష్ణారెడ్డి మర్రిపాడు మాజీ మండలాధ్యక్షుడు పుట్టం బ్రహ్మానందరెడ్డి తదితరులు కూడా తమ గెలుపు అవకాశాలను అదిష్ఠానం ముందు వివరించి టిక్కెట్టు తమకు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆనం రామానారాయణరెడ్డి ఉదయగిరిపై ప్రత్యేక శ్రద్ద పెట్టి ఎలానైనా ఉదయగిరిని హస్తగతం చేసుకోవాలని గుంబనంగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున అన్నీతానై ఆనం కుటుంబానికి సవాళ్ల మీద సవాళ్లు విసిరిన మేకపాటి సోదరులను ఓడించటానికి ఆనం కుటుంబం అత్యంత రహస్య వ్యూహం నిర్వహించటానికి పకడ్బీందీగా రంగం చేసుకుంది.
తెలుగుదేశం అభ్యర్ధి బొల్లినేని వెంకటరామారావుకు ప్రజలతో అనుకున్న మేరా సన్నిహిత సంబంధాలు లేక పోవటంతో ఆయన నియోజకవర్గంలో గెలుపుకోసం మరింత కష్ట పడాల్సివుంది. ఇదే అదునుగా బావించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరికి వారు రహస్యంగా వ్యూహన్ని స్దిద్దంచేసుకుంటున్నారు.
No comments:
Post a Comment