కోవూరు : రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన కోవూరు ఉప ఎన్నిక ఓటరు తీర్పు బుధవారం వెలువడనుంది. దీంతో పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్...టెన్షన్... ఇప్పటికే ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం అభ్యర్థులు కోట్లాది రూపాయలు నగదును మంచినీళ్ల ప్రాయంగా గెలుపు కోసం ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. దీనికి తోడు అభ్యర్థులు గెలుపోటములపై కోట్లాది రూపాయలు బెట్టింగ్‌లు కూడా రాష్ట్ర స్థాయిలో పెట్టిన సంగతి కూడా తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు కొన్ని గంటల వ్యవధి ఉండడంతో అభ్యర్థు తోపాటు బెట్టింగ్ నిర్వాహకులు, పార్టీల అభిమానులు, ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. నేటి ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ మొదలు కానుండడంతో మంగళవారం నుండే ఈ విషయమై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఏ సెంటర్‌లో చూచినా అభ్యర్థులు గెలుపోటములపైనే చర్చించుకోవడం కనిపించింది.
అలాగే అభ్యర్థులు ఎంత మెజారిటీతో గెలుస్తారో అనే విషయంపై కూడా బెట్టింగ్‌లు పెట్టిన సంగతి తెలిసిందే. ఫలితాలు లెక్కింపు మొదలయ్యేదానికి కౌంట్ డౌన్ మొదలు కావడంతో నగరం తోపాటు అన్ని మండలాల్లో టెన్షన్ వాతావరణం నెలకొనివుంది. ఉప ఎన్నిక జరిగిన కోవూరు నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓటింగ్ జరగడంతో ఫలితాలు కూడా తారుమారయ్యే అవకాశం ఉండడంతో అభ్యర్థులతోపాటు అభిమానుల్లోనూ, ప్రజల్లోనూ ఉద్వేగభరిత వాతావరణం నెలకొనివుంది. ఇప్పటికే అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగ్‌లు పెట్టిన వారిలో అభ్యర్థులకు ఎంత మెజారిటీతో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో, ఏ పార్టీ ద్వితీ స్థానాన్ని, తృతీయ స్థానాన్ని సాధిస్తుంది అనే అంశ ంపై కూడా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొనివుంది. ఓట్ల లెక్కింపు జరిగే వెంకటేశ్వరపురం, పాలిటెక్నిక్ కళాశాల వద్ద చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ మంగళవారం సాయంత్రం నుండే సందడి వాతావరణం నెలకొనివుంది.
అలాగే అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగ్‌లు పెట్టినవారు నగరంలోని పలు లాడ్జీలలో వ్యాపారం పేరుతో లాడ్జీల్లో చేరి అక్కడ నుంచే వారి వారి అనుచరులతో బెట్టింగ్‌లు పెట్టుకుంటూ కార్యకలాపాలను సాగిస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్‌ల సంస్కృతి మంచిది కాదని, దాంతో వాదోపవాదాలు జరిగి గొడవలు చోటు చేసుకునే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. అలాగే గెలుపోటములపై మండలాల్లోని తమ త మ అనుచరులకు ఫోన్‌లు చేయడం, అక్కడి పరిస్థితులను కనుక్కోవడం, ఓటింగ్‌లో పలితాలు ఎలా ఉండబోతాయి అని అడగడం కనిపిస్తుంది. క్షణక్షణానికి మండలాల్లోని ప్రజలు చెబుతున్న వివరాలకు బెట్టింగ్ పెట్టిన వారిలోనూ, అభిమానుల ద్వారా సమాచారం అందుకుంటున్న పోటీగా నిలబడ్డ అభ్యర్థుల్లోనూ టెన్షన్ వాతావరణం కనపడుతోంది.
ఈ నేపథ్యంలో కోవూరు నియోజకవర్గంలోని 5 మండలాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ఓట్లు పోలవడంతో ఏ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుస్తాడో చెప్పలేని పరిస్థితి. పార్టీ కార్యకర్తల్లోనూ, పరిశీలకుల్లోనూ కనపడకపోవడంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెస్తున్నా యనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ ఉదయం 8 గంటలకు మొదలుకానున్న కౌంటింగ్ ప్రక్రియ కొద్ది గంటల్లోనే పూర్తయి అభ్యర్థుల భవిష్యత్తును తేల్చనున్నట్లు కోవూరు నియోజ కవర్గంలోని 5 మండలాల్లోని ప్రజలతోపాటు జిల్లా ప్రజల్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ కట్టినవా రిలోనూ టెన్షన్ మొదలవడంతోపాటు జయాపజయాలపై కౌంట్ డౌన్ మొదలైంది.
No comments:
Post a Comment