online marketing

Friday, February 3, 2012

ప్రాచీన కళ్యాణ మండపం కూల్చి వేసిన సంఘటన

ఉదయగిరి  : ఒకరు ప్రజా నాయకుడు... మరోకరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లీడరు వీరిద్దరూ స్థానిక శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి ముఖ్య అనుచరులే... వారే కొట్టాలపల్లి సొసైటీ అధ్యక్షుడు అక్కి భాస్కర్‌రెడ్డి మరోకరు వాటర్‌ ప్లాంట్‌ అధినేత బొందగుల రమణారెడ్డిలు గుప్త నిధుల కోసం గత నెల 13 వతేది కృష్ణాలయం కళ్యాణ మండపం కూలి వేసిన సంఘటనలో ప్రధాన ముద్దాయిలుగా పోలీసులు నోరుతెరచారు. ఈ సందర్భంగా కావలి డిఎస్పీ పి,ఇందిర గురువారం స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెళ్లడించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత నెల 13వ తేదిన గుప్త నిధులుంటాయని అత్యంత ప్రాచీన కళ్యాణ మండపం కూల్చి వేసిన సంఘటన పై తాము చేసిన దర్యాప్తులో 11 మంది సభ్యులుగా గుర్తించి వారిపై ఐపిసి 379, 511 తోపాటు సెక్షన్‌ 31 క్రింద కేసు నమోదు చేశామని తెలిపారు. పదకొండు మంది ముఠాసభ్యులతో నలుగురు స్థానికులని వారు అక్కి భాస్కర్‌రెడ్డి (సొసైటి అధ్యక్షులు) బందుగుల రమణారెడ్డి (గంగా వాటర్‌ యజమాని) వింజమూరుకు చెందిన రామిరెడ్డి వాటర్‌ ప్లాంట్‌ మేనేజర్‌ అయిన కప్పా శ్రీనివాసరాజులుగా గుర్తించామని కప్పా శ్రీనివాసరాజును అరెస్టు చేశామని మిగిలిన వారు పొరుగు జిల్లాలకు చెందిన వారిగా గుర్తించామని తొందరిలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. గుప్త నిధుల కేసులో ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు కావడం ఉదయగిరి స్టేషన్‌ పరిధిలో ప్రధమమని నాలుగురోజుల క్రిందటే కలిగిరి సర్కిల్‌ పరిధిలోని వింజమూరులో కూడా నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. రాజకీయ ఒత్తిడులు ఏమిలేవని అలాంటివి ఎదురైనా రాజీపడేది లేదని స్పష్టం చేశారు.

పౌరులకు భధ్రత ఉంది:
రాజ్యాంగం చెప్పిన ఆర్టికల్‌ 51 అ ప్రకారం ప్రాచీన సంపద కాపాడే హక్కు ప్రతి పౌరుడికి ఉందని మూఢనమ్మకాల వల్ల నిధులు ఉంటాయని నిర్మాణాలు కూల్చివేయడం అవివేకం అని ఆమె అన్నారు. ఈమెతోపాటు సీఐ కళ్యాణరాజు, ఎస్‌ఐ రమేష్‌లు కూడా ఉన్నారు.

పోలీసులకు స్థానికుల ప్రశంశలు:
ఉదయగిరి చరిత్రలో ఇంత పెద్ద సంఘటన జరగలేదని జరిగిన అనతి కాలంలోనే పోలీసులు ఛేదించడం పెద్ద మనుషులు అయినప్పటికి కేసు నమోదుచేయడం పై స్థానిక పోలీసులను డిఎస్పీని ఉదయగిరి ప్రాంత ప్రజలు ప్రశంశిస్తున్నారు. పెద్ద మనుషుల ముసుగులో ఉండి ఆలయాల పునరుద్ధరణ పేరుతో అవతారాలెత్తిన నాయకులే నిందితులు కావడం విషేషంగా మారింది.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh