గుప్త నిధుల కోసం పురాతన దేవాలయాలను, కట్టడాలను కూల్చి వేస్తున్న దొంగలను త్వరలోనే పట్టుకుంటామని కావలి డీఎస్పీ ఇందిర అన్నారు. మంగళవారం ఉదయగిరి సర్కిల్‌పోలీస్ స్ఠేషన్ తనిఖీ నిమిత్త వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉదయగిరి ప్రాంతంలో అత్యధికంగా దేవాలయాలు నిర్మించారని, అందులో గుప్తనిధులు ఉన్నాయనే అనుమానాలతో ధ్వంసం చేస్తున్నారని వీరు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. దుండగులకోసం పోలీస్ ప్రత్యేక బలగాలను రంగంలోకి దించామన్నారు. మండలంలో సర్వరాబాద్‌లో ఎస్సీలకు, గ్రామస్తులకు మధ్య భూ వివాదం కారణంగా కేసులు నమోదయి ఉన్నాయన్నారు. వీటిని స్థానిక తహసీల్దార్ వెంకటనారాయణమ్మ ఆధ్వర్యంలో విచారిస్తామన్నారు. అలాగే వింజమూరుకు చెందిన ఓ దిన పత్రిక విలేకరిపై వచ్చిన అట్రాసిటీ ఫిర్యాదును విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఉదయగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కళ్యాణరాజు, ఎసై్స రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment