ఆధ్యాత్మిక ముసుగులో కోట్ల రూపాయల విలువ చేసే స్థలాలను కబ్జా చేయడమేకాకుం డా ఎంతో మంది అమాయిలకుల జీవితాల తో ఆటలాడుతున్న దొంగబాబాలు పుట్టగొడు గుల్లా వెలుస్తున్నారు. నాయుడుపేట పట్టణం లోని తిమ్మాజికండ్రిగ కాజ్‌వేను అనుకుని ఇప్పటికే పదుల సంఖ్యలో ఆశ్రమాలు వెల సివున్నాయి. ఈ బాబాలు ఎవరో.. ఎక్కడ నుంచి వచ్చారో.. ఎవరికి తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న వారికి వారే స్వర్ణము ఖినదిని ఆక్రమణ చేసి హద్దులు ఏర్పాటు చేసుకోవడం అందరిని విస్మయానికి గురిచే స్తుంది. ఆధ్యాత్మిక ముసుగులో స్వర్ణముఖిన దిని కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్న ఈ దొంగ బాబాల భూ దందాలపై రెవెన్యూ అధికారులు కూడా దృష్టి సారించడం లేదు. స్వర్ణముఖినదిని పరిరక్షించాల్సిన మైనింగ్ అధికారులు కూడా ఆదిశగా చర్యలు తీసుకో కపోవడంతో రోజుకో ఆశ్రమం, వారానికో బా బా ఇక్కడ దర్శనమిస్తున్నారు. రైతులకు, ప్ర జలకు వరప్రసాదినిగా ఉన్న స్వర్ణముఖినదిని కబ్జా చేయడం ద్వారా వరద ఉదృతి సమ యంలో అనేక గ్రామాలు నీటమునిగే ప్రమా దం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడ నుం చో వచ్చిన ఈ దొంగబాబాలు పలు నేరాలకు పాల్పడడమేకాక నేరస్తులకు ఆశ్రయమిచ్చే సూచనలు కూడా కనిపిస్తోన్నాయి. రాత్రి స మయంలో నది ఒడ్డున మాంత్రిక పూజలు చేస్తున్న కారణంగా ప్రజలు బెంబేలు చెందు తున్నారు. ఇప్పటికే ఇసుక అక్రమ రవాణాతో రూపురేఖలు కోల్పొయిన దొంగబాబాల ఆశ్ర మాల చాటున జరుగుతున్న కబ్జాలతో నది గ్రామాలను తలపించే విధంగా మారిపో నుంది. అమాయిక ప్రజలను తమ మాంత్రిక శక్తులతో ఆకర్షితులను చేస్తున్న దొంగబాబాలు వారి జీవితాల తో చెలగాటమాడుతున్నారు. బిరదవాడ సమీపంలో వెలసిన ఓ ఆశ్రమం లోని స్వామి భక్తిపేరుతో వికృత చేష్టలకు పాల్పడడమేకాక విదేశీయులను సైతం ఆక ర్షించి ఇక్కడ ఉన్న కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆధ్యాత్మి క ముసుగులో కొనసాగుతున్న భూకబ్జాలపై దృష్టి సారించి అవసరమైన చర్యలు చేపట్ట కపోతే దొంగబాబాలు ఇంకా మరి కొంత మంది పుట్టుకొచ్చే అవకాశాలు లేకపోలేదు.
No comments:
Post a Comment