online marketing

Thursday, May 26, 2011

రాపూరులో గ్రామసేవకుల నిర్వదిక సమ్మె

రాపూరు: రాపూరు ప్రభుత్వ రెవిన్యూ కార్యలయంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ సేవకుల సమ్మె ఒప్పందాలు వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రామసేవకుల సంఘం పిలుపుమేరకు బుధవారం రాపూరు తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట 36 మంది గ్రామ సేవకులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుకూలంగా నెలసరివేతనం రూ.5వేలు, టిఎ, డీఎలు రూ.50ల నుండి రూ.100ల వరకు పెంచాలన్నారు. అలాగే ఖాళీగా ఉన్న గ్రామసేవకుల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలన్నారు. ప్రస్తుతం గ్రామ సేవకులకు వేతనం రూపంలో నెలకు రూ.2500లు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

ఆశాకాన్నంటుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు ప్రభుత్వం చెల్లించే కొద్దిపాటి వేతనాలు సరిపోకపోవడంతో తమ కుటుంబాలు పస్తులు ఉంటున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వం హామీ ప్రకారం గ్రామసేవకులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. జీవో నంబర్‌ 1849 ప్రకారం గ్రామసేవకుల కుటుంబీకులకు వారసత్వంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించని పక్షంలో సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమ్మెలో రాపూరు పట్టంలోని 21 పంచాయితీలకు చెందిన 36 మంది గ్రామసేవకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh