online marketing

Tuesday, February 21, 2012

తెలుగుదేశంపార్టీలో ఉంటూనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ అభిమాని...


నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి వైఎస్‌ఆర్‌పార్టీ తొలిసారి పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఉప ఎన్నికల వేడిరాజుకుంది. అన్ని రాజకీయ పార్టీల్లాగే వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ కూడా తొలిసారి ఉపఎన్నికల బరిలో దూకేందుకు సిద్ధమ వుతోంది. జగన్‌ వైఎస్‌ఆర్‌పేరుతో రాజకీయ పార్టీ పెట్టాక ఆ పార్టీపేరుతో తాను కడపలోక్‌సభ నియోజకవర్గంనుంచి , తన తల్లి విజయమ్మ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి గత ఏడాది ఉప ఎన్నికల్లో పోటీిచేసి గెలుపొందారు ఆ రెండు స్థానాలు వారు ఇదివరకు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలే కావటంతో వాటిని పెద్దగా లెక్కలోకి తీసుకోవటంలేదు. దింవంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి మూడు దశాబ్దాలకాలంగా కడప, పులివెందుల నియోజక వర్గాలు సొంత నియోజ వర్గాలుగా మారటంతో ఆనాటి ఉప ఎన్నికల ఫలితాలను కూడ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.

అయితే ఈ సారీ జరిగే ఉప ఎన్నికలు వైఎస్‌కుటుంబంతో ఏమా త్రం సంబధం, ప్రభావంలేని నియోజకవర్గాలు కావటంతో జగన్‌కు తొలిపరీక్ష పెట్టబోతున్నాయి. ఉప ఎన్నికలో బరిలోకి దిగబోతున్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరుకు పాత కాపే అయినప్పటికీ పార్టీలరంగులే మారిపో యాయి. తెలుగుదేశంపార్టీలో ఉంటూనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ అభిమాని గా మారిన ప్రసన్న జగన్‌ వర్గంలో చేరిపో యారు. తెలుగుదేశంపార్టీకి, శాసనస భసభ్యత్వానికి రాజీనామాచేసిన ప్రసన్న వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్దిగా ఉప ఎన్నికల రంగంలోకి దిగారు. రాజకీయల్లో ప్రత్యేకించి ఉప ఎన్నికల పోటీలో గెలుపు ఓటములు అభ్యర్థులకు సహజమే అయినా వాటి ప్రభావం అభ్యర్థులకంటే పార్టీలపైన తీవ్రపభావం చూపుతుందం టున్నారు.


వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీకి ఉప ఎన్నికల ఫలితాలే పార్టీ మనుగడకు జగన్‌ ఇమేజికి సూచికలుగా నిలవనున్నాయని రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు కోవూరు తోపాటు మరికొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నప్పటికీ కోవూరుకు, మిగిలిన వాటికి చాల తేడా ఉందంటున్నారు. ప్రాంతీయ ఉద్యమాలు జరుగుతున్న నేపద్యంలో వచ్చిన ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో జరిగే ఉపఎన్నికలు ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్నాయంటున్నారు. అదే సీమాంధ్ర ప్రాంతంలో కోవూరు నియోజకవర్గ ఉప ఎన్నికలు అందుకు పూర్తి బిన్నంగా భావిస్తున్నారు. ఏ సెంటిమెంట్‌ ప్రభావం అంతగాలేకుండా జరుగుతున్న కోవూరు ఉప ఎన్నికలు కాంగ్రెస్‌, తెలుగుదేశంతో పాటు వైఎస్‌ఆర్‌ పార్టీకి కూడా పరీక్షేనని చెబుతున్నారు. అయితే మిగిలిన పార్టీలకంటే జగన్‌కే కోవూరు ఉప ఎన్నికలు పెద్ద సవాలుగా మారుతున్నాయంటున్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితా లనుబట్టే వ్యక్తిగతంగా జగన్‌ ఇమేజితోపాటు పార్టీ అధ్యక్షుడిగా ఆయన దీక్షాదక్షతలు స్పష్టంకానున్నాయి

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh